Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
మీ మార్బల్ ఫ్లోరింగ్ గురించి జాగ్రత్త తీసుకోండి !!
గృహాలంకరణలో పాలరాతిని వాడితే ఇంటికే అందం వస్తుంది. మీ ఇంటి ఫ్లోరింగ్ కోసం లేదా అలంకరణ కోసం పాలరాయి కొనడానికి మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టైతే మీరు తప్పక ఈ రాతి అందాన్ని కాపాడడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పాలరాతితో పని చేసేటప్పుడు మీరు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
దైనందిక జీవితంలో చాలా సార్లు దుస్తుల మీద, ఇంట్లో గచ్చు మీద రకరకాల మచ్చలు లేదా మరకలు పడుతుం టాయి. ముఖ్యంగా ఇంట్లో ఫ్లోర్ మార్బుల్ లేదా టైల్స్‌తో వుంటే మరింత కష్టంగా వుంటుంది. ఏ చిన్న మరకైనా అసహ్యంగా కనిపిస్తుంటుంది. అలా వదిలేయాలంటే మనసొప్పదు. అంత త్వరగా మరకా వదలదు. అలాంటి సమయంలో ఫ్లోర్‌ను శుభ్రం చేసేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే సరి..

మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే!
పాలరాతి నేలల మీద ద్రవాలు కానీ ఆహార పదార్ధాలు గానీ ఒలికితే, ఉపరితలం మీద అవి చెరగని మరక పడిపోతాయి. ఈ మారక ఒక నాణెం పరిమాణంలో గానీ లేదా పలు రాళ్ళ మీద పరచుకోవచ్చు. అందువల్ల పొరపాటున ఏవైనా పళ్ళ రసాలు, కూల్ డ్రింక్ లు, వైన్ లేదా టీ పాలరాతి నేల మీద పడితే, వెంటనే హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా కలిపిన మిశ్రమంలో ముంచిన మెత్తటి గుడ్డతో ఆ పాలరాతి నేల భాగాన్ని మళ్ళీ మెరుపు వచ్చే దాకా మెల్లిగా రుద్దండి.

మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే!
మరకలు ఏర్పడే మరో సాధనం ఆసిడ్ కలిగి వుండే డిటర్జెంట్ పౌడర్. వినేగార్ లేదా ఆమ్లాలు కలిగి వుండే పదార్ధాలతో ఎప్పుడూ పాలరాతి నెలలు తుడవకండి. పాలరాయి చాలా సున్నితంగా వుంటుంది కనుక దాన్ని పి హెచ్ న్యూట్రల్ వుండే మృదువైన పదార్ధాలతోనే కడగాలి. స్థానికంగా దొరికే చౌక రకం క్లీనర్ల తో పాలారాయి తుడిస్తే దాని మెరుపు శాశ్వతంగా దూరం కావచ్చు.

మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే!
పాలరాతి నెలలు రంధ్రాలు కలిగి వుంటాయి కనుక ఆహార పదార్ధాలు, నేల మీద ఉంచిన కుండలు, ఇనప ఫర్నిచర్ కాళ్ళు, నూనె, ఇంకు, మురికి నీరు లాంటివి పడితే రంగు కోల్పోతాయి. వంట నూనెలు లేదా జిడ్డు పదార్ధాలు పాలారాతి నేల మీద మరకలు పడేలా చేస్తాయి. అందువల్ల సబ్బు, నీళ్ళు పెట్టి వెంటనే అలాంటి వాటిని కడిగి వేయాలి.

మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే!
పాలరాతి నేలలను నిత్యం కడుగుతూ తుడుస్తూ వుంటే వాటి సహజమైన మెరుపు చాలా కాలం దాకా మన్నుతుంది. టెర్రీ గుడ్డతో శుభ్రంగా దుమ్ము దులపడం మంచిది. వేడి నీటి బదులు, పాలరాతి నేలలను గోరువెచ్చటి నీతితో కడగం మంచిది. ఏవైనా గట్టి పదార్ధాలు పేరుకుని వుంటే తప్ప పాలరాతి నేలలను రుద్దాల్సిన పని లేదు. నేలను క్లీనర్ లతో శుభ్రం చేసాక పాలరాయి మెరిసేందుకు దానికి కొంచెం మెత్తటి పాలిష్ అప్లయ్ చేస్తే మంచిది.

మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే!
మార్బుల్ ఫ్లోర్‌పై మరకలు పడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్‌లాగా తయారు చేసి మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తరువాత దానిమీద తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తుడిచేయాలి. మరక ఇట్టే పోతుంది



Click it and Unblock the Notifications
