Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గోల్డెన్ రిట్రీవర్ పెంపకమెలా?

ఈ జాతి కుక్కల లక్షణాలు ఎలా వుంటాయంటే.....
ఇవి మీ కవసరమైన వస్తువులు తెచ్చిస్తాయి కనుకే వాటిని రిట్రీవర్స్ అన్నారు. పిల్లల బంతి, ఫ్రిస్ బీ దూరంగా పడవేస్తే తీసుకు వచ్చి ఇస్తాయి. ఎంతో ఆనందిస్తాయి. వాటిని ప్రతి అంశంలోను మెచ్చుకుంటూ వీపుపై ముట్టుకుంటే చాలా గర్వంగా భావిస్తాయి. పిల్లలతో కలసి ఆడతాయి. కొద్దిపాటి అతి స్నేహాన్ని ప్రదర్శిస్తాయి. ఇంటికి ఎవరైనా కొత్తగా వస్తే, వారి వద్దకు వెళ్ళి ముట్టుకుని వాసనలు చూస్తాయి. వారిని అభినందిస్తూ చిన్నగా మొరుగుతాయి. అలా చేయవద్దని వారిస్తే చిన్నబుచ్చుకుంటాయి. ఇతర కుక్కలు ఇంటో వుంటే స్నేహం చేసి ఆడతాయి. వీధి కుక్కలతో పోటీపడవు. వీటికి శిక్షణ నివ్వటం తేలిక. జుట్టు అధికంగా వుంటుంది. నీటిలో ఈత వీటికి చాలా ఇష్టం.
గోల్డెన్ రిట్రీవర్ కుక్కలు కావలికి పనికిరావు. సైజులో పెద్దవైనా భయంతో వెనుకకు తగ్గుతాయి. సాధారణంగా ఎవరిని కరవవు. ఇవి ఒంటరివారికి, ఉద్యోగస్తులైన భార్యాభర్తలకు తగినవి. వాటిని ఒంటరిగా వదిలితే వుండలేవు. అతి చురుకుదనం వుండదు. వీటికి కొద్దిపాటి వ్యాయామం చాలు. సాధారణ కుటుంబాలు ఒక మంచి కుక్కతో ఆనందించాలంటే గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క ఎంతో అనువైనది.



Click it and Unblock the Notifications