భారత దేశంలో ప్రసిద్ది చెందిన 7 శ్రీకృష్ణ దేవాలయాలు...

మథురలో దేవకీవసుదేవుల బిడ్డగా పుట్టి, రేపల్లెలో యశోదానందుల ముద్దుల కొండగా, బలరాముడుగా, సుభద్రల సోదరుడిగా, కన్నయ్యగా మన అందరిచేత ముద్దుగా పిలిపించుకొంటున్న విష్ణుమూర్తి యొక్క తొమ్మిదవ అవతారమే శ్రీకృష్ణుడు. పురాణంలో దుష్ట సంహారం కోసం శ్రీకృష్ణుడు చాలా అవతారాలు ఎత్తారని వ్రాయబడింది. అన్ని అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణుని అవతారం.

కలియుగంలో శ్రీకృష్ణుని కోసం అనేక దేవాలయాలు నిర్మింపబడ్డాయి. వాటిలో కొన్ని శ్రీకృష్ణ దేవాలయాలు నిత్యం భక్తులతో, యాత్రికులతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి నిత్యం కొన్ని వేలల్లో భక్తులు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి దేవాలయాలను వెళుతూనే ఉంటారు.

మనం సాధారణంగా శ్రీకృష్ణుని దేవాలయాలలో శ్రీకృష్ణునితో పాటు రాధ లేదా రుక్మిణి ఉన్నవిగ్రహాలను కొలువుదీరి ఉంటాయి. శ్రీకృష్ణుడు తరచూ వేణువు ఊదుతుంటారు కాబట్టి, వేణుమాధవా అని స్మరిస్తుంటారు. మన సృష్టికే మూల పురుషుడైన శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు తన జీవిత చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ది. మరి అంతటి ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుడు కొలువై ప్రసిద్ది చెందిన కొన్ని దేవాలయాలరు గురించి తెలుసుకుందా... మన భారత దేశంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాలు...

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

ఇస్కాన్ దేవాలయం: ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయం. ప్రపంచ మొత్తంగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అందంగా అలంకరించి, చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఈ దేవాలయాలకు అన్ని వర్గాల ప్రజులు, వివిధ కుల మరియు మతం కలిగిన భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. ఇస్కాన్ దేవాలయాలు డిల్లీ, బృందావన్, బెంగుళూర్, కోలకతా, అస్సాం లో ఉన్నాయి.

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

ద్వారకాదీశ ఆలయం: దీనిని 1814లో గ్వాలియర్‌కి చెందిన గోకుల్‌దాస్‌ అనే ఆయన నిర్మించాడని అంటారు. గుజరాత్ పశ్చిమ తీరంలో ఉన్న ద్వారక పవిత్ర పుణ్యస్థలంగా భావించబడుతుంది. ఈ ఆలయ మండపంలో మూడు పెద్ద ఊయలలు ఏర్పాటుచేసారు. అందులో మధ్యలో ఉన్నది పూర్తి బంగారు ఊయల, రెండు వైపులా ఉన్నవి వెండి ఊయలలు. ఉత్సవాలు జరిపే సమయంలో ఇక్కడ శ్రీకృష్ణునికి శయ్యా వేడుకలు జరుపుతారు. రుక్మిణి(లక్ష్మి అవతారం అని నమ్మేవారు)దేవాలయంను కూడా సందర్శించడం మరవకండి.

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

బృందావన్ ఆలయం: ఈ ప్రదేశంలో శ్రీకృష్ణు బాల్యం గడిచిందని నమ్ముతారు. ఈ ప్రదేశాన్ని కింగ్ అక్బర్ సందర్శించిన తర్వాత అతను మరో నాలుగు శ్రీకృష్ణుని దేవాలయాలు(మధనమోహన, గోవింద, గోపినాథ మరియు జుగల్ కిషోర్) నిర్మించడానికి ఆదేశించాడు. అక్కడికి దగ్గరలోనే మధుర, చాల ప్రసిద్ది చెందిన దేవాలయం. ఇంకా మరికొన్ని ఆలయాలు బ్యాంకే విహారీ ఆలయం, కృష్ణ బలరాం మందిరం, ఇస్కాన్ దేవాలయం, గోవింద రాజ ఆలయం, మదన మోహన ఆలయం చాలా ప్రసిద్ది

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

జుగల్ కిషోర్ ఆలయం: మధుర నగరం( (కృష్ణుడు జన్మస్థలం) లో జుగల్ కిషోర్ ఆలయం కలదు. ఈ శాంతియుత పవిత్ర పుణ్యస్థలాన్ని సందర్శించి ఉపశమనం పొందవచ్చు. జుగల్ కిషోర్ ఆలయము మథుర లో కృష్ణుడు అత్యంత ప్రాచుర్యం పొందినది మరియు ఇది పురాతన ఆలయాలల్లో ఒకటి. శ్రీ కృష్ణుడు దేవాలయాన్ని కేసి ఘాట్ దేవాలయం ( శ్రీ కృష్ణుడు నరకాశురున్ని సంహరించిన ప్రదేశం)అంటారు. నరకాశురున్ని సంహరించిన తర్వాత ఘాట్ అటువైపు వున్న నదిలో స్నానం ఆచరించాడని ప్రసిద్ది. ప్రతి రోజూ సాయంత్రంలో ఇక్కడ యమునా దేవికి ఒక హారతిని అందించబడుతుంది.

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

జగన్నాథ ఆలయం: దేశంలోని ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయం ఒకటి. ఇది పేరు ప్రఖ్యాతలకే కాకుండా.. సంపన్నతకు, అలంకారానికి, ఆధునికతకు ప్రత్యేక స్థానం ఉంది. అహ్మదాబాద్‌ నగరంలోని జమల్‌పూర్ అనే ప్రాంతంలో వెలసి వున్న ఈ ఆలయం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కృష్ణుడు మరియు విష్ణువు యొక్క భక్తులు తరచుగా జగన్నాథుని యొక్క దీవెనలు పొందాలనుకుంటే ఈ పవిత్ర పుణ్య క్షేత్రాన్ని సందర్శించండి.

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

గురువాయూర్: తెలుగువారికి తిరుపతి ఎంతటి పవిత్ర పుణ్యక్షేత్రమో... కేరళీయులకు శబరిమల, గురువాయూర్‌లు అంతటి పవిత్ర పుణ్యక్షేత్రాలు. అయ్యప్ప కొలువైన శబరిగిరి సంవత్సరాని ఒక్కసారి మాత్రమే రద్దీగా ఉంటుంది. కానీ చిన్ని కృష్ణుడు కొలువైన గురువాయూర్‌లో సంవత్సరం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ దేవాలయానికి దక్షిణ ద్వారకా అని కూడా పేరు ప్రసిద్ది. ఈ దేవాలయంలో ఏనుగుతు కూడా ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్లకు ఈ దేవాలయం చాలా ప్రసిద్ది.

భారత్ లో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు

ఉడిపి కృష్ణ మందిరం: విశ్వవిక్యత కృష్ణుని మందిరం దక్షిణ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలలో ఉంది.

శ్రీకృష్ణుడు అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ దేవాలయాలను సందర్శించి, ఆయను అనుగ్రహం పొందండి...

Story first published: Tuesday, February 5, 2013, 13:41 [IST]
Desktop Bottom Promotion