Latest Updates
-
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు!
మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు
పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి.
శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు.

చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక నిజమైన వాస్తవం. ఎప్పుడు జన్మిస్తారో, ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. చావు అనివార్యమైనది. మరణం గురించి మనకు వింత విషయం ఏముంది. మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది. మరణం తర్వాత ప్రపంచం ఉందా లేదా మరణం తర్వాత మనం కేవలం అదృశ్యమవుతామా?ఇటువంటి ప్రశ్నలతో మనం ఎప్పుడూ భయపడుతుంటాం అందుకు మానవులు ఎల్లప్పుడూ మణం నివారించడానికి ఎన్నో మార్గాలకోసం చూస్తుంటారు.
కానీ మరణం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు మరణించబోతున్నారన్న మీకు కూడా తెలియంత విధంగా నిశ్శద్దంగా వస్తుంది మరణం. అయితే మన ఇండియన్ గ్రంధాలలో ఒక వ్యక్తి వెంటనే లేదా త్వరలో చనిపోతాడని సూచించే కొన్ని లక్షణాలను నమోదు చేయడం జరిగింది.
మరణించబోతున్నారన్న సంకేతాలను శివ పురాణంలో వివరించడం జరిగింది. శివ పురాణం ప్రకారం, ఒక సారి పార్వతీ దేవి మరణం యొక్క సంకేతాల గురించి లార్డ్ శివను కోరినట్లు తెలుపుతున్నాయి. ఒక అతను/ఆమె చనిపోబోతున్నారని ఎలా తెలుస్తుంది?తర్వాత మరణం గురించి ప్రతిదీ పార్వతీ దేవికి వివరించాడాని శివ పురాణంలో తెలుపుతున్నది. లార్డ్ శివ పార్వతి దేవికి వివరించిన వాటిలో 10 లక్షణాలను కొద్ది రోజుల్లో లేదా కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిలో చూడవచ్చు అని మాట్లాడం జరిగింది. మరి మీరు కూడా మరణం యొక్క లక్షణాలను తెలుసుకోవాలనుందా? అయితే ఈ క్రింది స్లైడ్ ను పరిశీలించండి...

మరణానికి మొదటి లక్షణం:
ఒక వ్యక్తి యొక్క చర్మం యొక్క రంగు లేత పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతుంది మరియు కొద్దిగా ఎరుపు రంగులోకి కూడా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే ఆ వ్యక్తి మరో 6నెల్లల్లో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

మరణానికి రెండవ లక్షణం:
ఒక వ్యక్తి అతను/ఆమె తన ప్రతిబింబంను నీటిలో లేదా అద్దంలో చూడటానికి కుదరు లేదా కనబడకపోవడం వంటి లక్షణాలు కలిగిన వ్యక్తి మరో 6 నెలల్లో మరణించబోతున్నారని అర్థం.

మరణానికి మూడవ లక్షణం:
ఒక వ్యక్తి ఏది చూసిన బ్లాక్ గా కనబడుట ప్రారంభమైనప్పుడు, ఆ వ్యక్తి త్వరలో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

మరణానికి నాల్గవ లక్షణం:
ఒక వ్యక్తిలో ఎడమ చేయి ఒక వారం నుండి సంకోచిస్తున్నట్లు(సలుపుతున్నట్లు లేదా నరాలు లాగుతున్నట్లు) అనిపించడం. అది ఆ వ్యక్తి ఒక నెల రోజులు జీవించవచ్చు అని అర్థం.

మరణానికి ఐదవ లక్షణం:
ఒక వ్యక్తి అతను/ఆమె యొక్క సెన్స్ ఆర్గాన్స్ (జ్ఞానేంద్రియాలు)రాళ్ళులాగే కఠినంగా మారుతాయి. అంటే దాని అర్ధం ఆమె/అతను మరో 6నెలల్లో చనిపోబోతున్నారని అర్ధం.

మరణానికి ఆరవ లక్షణం:
ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని నుండి వెలువడే కాంతిని చూడలేనప్పుడు, ఆ వ్యక్తి వెంటనే చనిపోతారని సూచిస్తుంది.

మరణానికి ఏడవ లక్షణం:
ఒక వ్యక్తి యొక్క నాలుక అకస్మాత్తుగా ఉబ్బడం లేదా చిగుళ్ళ నుండి చీము స్రవించడం మొదలైన లక్షణాలు కనబడితే , ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బ్రతకరని నమ్ముతారు.

మరణానికి ఎనిమిదవ లక్షణం:
ఒక వ్యక్తి ఆకాశంలో ధ్రువ నక్షత్రంను చూడలేనప్పుడు, అది ఆ వ్యక్తి 6నెలల్లో మరణించబోతున్నారని అర్ధం.

మరణానికి తొమ్మిదో లక్షణం:
ఒక వ్యక్తి సూర్యుడుని, చంద్రుడిని మరియు ఆకాశాన్ని ఎరుపు రంగులో చూడగలిగినప్పుడు, అది ఆ వ్యక్తి త్వరలో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

మరణానికి పదో లక్షణం:
ఒక వ్యక్తి తన కలలో గుడ్లగూబను చూసినట్లు లేదా ఖాళీగా మరియు నాశనం అయిన గ్రామాన్ని కలలో చూసినప్పుడు అతడు/ఆమె యొక్క మరణం సమీపంలో ఉన్నదని అర్ధం.



Click it and Unblock the Notifications
