Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
Womens day 2025: సమాజమే కుటుంబంగా, లా ఫీల్డ్ లో ఎందరికో ప్రేరణగా నిలుస్తున్న అడ్వకేట్ మాధురి
పుట్టింది ఓ మధ్య తరగతి కుటుంబంలో. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. నూరేళ్లు తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్త కొన్నాళ్లకే మనసు మార్చుకొని తన దారిన తాను వెళ్లిపోయాడు. పేరేంట్స్ లేరు, భర్త అండ లేదు, ఒంటరిగా ఎదిగింది. నిలబడి కొట్టాడింది. సమాజంలో వివక్షతలు, అవమానాలను ఎదిరించింది. సమాజానికి ఏదో చేయాలన్న తపన ఆమెను ముందుకు నడిపించింది. తాను అనుకున్న లక్ష్యం దిశగా ఒక్కో అడుగు వేసి తనను తాను నిర్మించుకుంటూ సమాజానికి తాను ఉపయోగపడుతూ ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు అడ్వకేట్ జాజుల మాధురి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాజధాని అయిన ఒంగోలు జిల్లా కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఉన్న మాధురి..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాధురిగారు బోల్డ్ స్కైతో మాట్లాడారు. ఆమె ఏం చెప్పారో ఆమె మాటల్లోనే ఇక్కడ చూడండి.
బాల్యం, విధ్యాభ్యాసం
తాను పుట్టిపెరిగింది అంతా ఒంగోలులోనే అని మాధురి తెలిపారు. ఒంగోలులోనే తన చదువులు అన్నీ తన లా కోర్సు కూడా పూర్తి చేసినట్లు మాధురి తెలిపారు.

లా ఫీల్డ్ కి రావాలని ఎందుకు అనిపించింది
చిన్నప్పటి నుంచి సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని తనకు ఉండేదని మాధురి తెలిపారు. కాలేజ్ డేస్ లో అయితే తాను చాలా యాక్టివ్ గా ఉండేదాన్నని,ఏదైనా సమస్య అంటే అందరి వాయిస్ తానే అయ్యి అడ్రెస్ చేసేదాన్ని అని మాధురి తెలిపారు. ఆ సమయంలో లా అనేది తనకు సూటయ్యే బెస్ట్ ప్రొఫెషన్ అని భావించానని చెప్పింది. అయితే 8వ తరగతి ఆ సమయంలో తనకు సాఫ్ట్ వేర్ అయ్యి విదేశాల్లో స్థిరపడాలి,బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేదని,అయితే ఆ తర్వాత అలా అనిపించలేదని, లా పీల్డ్ లో ఉంటూ సమాజానికి తన వంతు చేతనైనంత సాయం చేయాలనే ఆలోచన ఉందని మాధురి తెలిపింది. డబ్బులు ఏమీ రావు అని తెలిసినా కూడా నా ద్వారా నలుగురికి మేలు జరిగితే అదే చాలు అని లా ఫీల్డ్ లోకి వచ్చినట్లు తెలిపింది. 2009లో లా ఫీల్డ్ లోకి వచ్చినట్లు చెప్పారు. అప్పటి నుంచి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు.
మహిళకు ఇచ్చే సందేశం
ఏ సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉంటుందని మాధురి తెలిపారు. పురుషులకన్నా సైకలాజికల్ గా ఆడవాళ్లే పవర్ ఫుల్ గా ఉంటారని, అయితే మహిళలు వీక్..వాళ్లు ఇంట్లోనే ఉండాలి అని సొసైటీలో ఉండిదని..దీంతో తాము ఏం చేయలేం అనే వీక్ మైండ్ సెట్ లో మహిళలు ఉండిపోయారని మాధురి చెప్పారు. దాన్ని అధిగమిస్తే ఆడవాళ్లను ఏ రంగంలో అయినా బాధ్యతగా, విజయాలతో దూసుకెళ్లగరని మాధురి చెప్పారు.
జడ్జి అవ్వాలనుకొని కెరీర్ బ్రేక్
తాను జడ్జి అవ్వాలనుకొని రెండేళ్లు మధ్యలో కెరీర్ బ్రేక్ తీసుకున్నట్లుు మాధురి తెలిపారు. అది కూడా ఒక ప్రయత్నంలో క్వాలిఫై అయ్యానని,కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్లలేకపోయినట్లు చెప్పింది. ఆ తర్వాత తాను మనసు మార్చుకున్నానని,జడ్జి అయితే జనాలకు కొంచెం దూరం అవుతానేమో అని భావించి,అడ్వకేట్ అయితే జనాలకు దగ్గరగా ఉంటూ సాయం చేయగలనని భావించి మళ్లీ తిరిగి అడ్వకేట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్లు మాధురి తెలిపారు.
ఎక్కువగా ప్రభావితం చేసిన మహిళ ఎవరు
తన జీవితంలో తనను ఎక్కువగా ప్రభావితం చేసిన మహిళ తన తల్లి అని మాధురి తెలిపారు. తన తల్లి చాలా ధైర్యవంతురాలని, ఆమె ఏడ్వటం తానెప్పుడూ చూడలేదని..ఎన్ని కష్టాలు ఉన్నా అలా నవ్వుకుంటూ ఉండేదని..తన జీవితంలో చూసి శక్తివంతమైన మహిళ తన తల్లేనని,ఆమెలా స్ట్రాంగ్ గా ఉండాలి ఏ మహిళ అయినా అని తనకు అనిపించేదని మాధురి చెప్పారు. తన 16ఏళ్ల వయస్సులో తల్లిని, 23 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయానని మాధురి చెప్పారు.
తన తండ్రి కూడా తన జీవితాన్ని చాలా ప్రభావితం చేశారని, ఆమె చెప్పిన మాటలను తాను ఇప్పటికీ ఆచరిస్తున్నట్లు మాధురి చెప్పారు. ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు, ఏదైనా సమస్య ఉందని వస్తే వారికి ఎలాంటి సహాయం చేయగలనని తాను ఆలోచిస్తాను అని, తన తండ్రి తనకు అదే చెప్పేవాడని మాధురి తెలిపారు.
ప్రొఫెషనల్ గా ప్రేరణ పొందింది వారి నుంచే
2017 నుంచి 2019 వరకు ఒంగోలు జిల్లా కోర్టు జడ్జిగా..ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న గౌరవనీయ జస్టిస్ ఎంజీ ప్రియదర్శని తనను ప్రొఫెషనల్ గా బాగా ప్రభావితం చేసిన వ్యక్తి అని మాధురి తెలిపారు. ఒక జడ్జి ఏం చెయ్యగలరు,మానవత్వంతో ఉండగలరు,ఎంత పెద్ద హోదాలో ఉన్నా నలుగురికి ఎలా సాయపడవచ్చు అనేది ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నట్లు మాధురి తెలిపారు.
కెరీర్ లో అత్యంత గర్వపడే విజయం
ఇటీవల కాలంలోనే ఓ చిన్న గొడవ విషయంలో ఏళ్ల పాటు సాగుతున్న కేసులో తాను బాధితులకు న్యాయం చేయగలిగానని, ఆ కేసులో బాధితులను గెలిపించానని, ఆ సమయమే తనకు అత్యంత గర్వపడే విజయమని మాధురి తెలిపారు. అంతేకాకుండా చాలామంది విడాకులు తీసుకొని బాధపడుతున్న సమయంలో తాను చెప్పిన సలహాల వల్ల వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి రెండో పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా ఉంటూ ఇప్పటికీ మీ వల్లే మేం ఇలా ఉన్నాం అంటూ తనకు ఆ దంపతులు కలిసి దిగిన ఫొటోలును కూడా పంపుతూ చెప్తుంటే తనకు చాలా సంతోషం వేస్తుందని మాధురి చెప్పారు.
వాళ్లు కూడా
తనను చూసి తన చుట్టూ ఉన్న కొంతమంది అమ్మాయిలు కూడా లా ఫీల్డ్ లోకి వచ్చారని, తన కుటుంబ సభ్యల్లో ఒక అమ్మాయి కూడా తనను చూసి ప్రేరణ పొందిన లా కోర్స్ చేస్తున్నట్లు మాధురి తెలిపారు. తనను చూసి మరికొందరు మహిళలు ప్రేరణ పొందడం తనకు చాలా సంతోషాన్నిస్తున్నట్లు మాధురి చెప్పారు.



Click it and Unblock the Notifications











