Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
30ప్లస్ లో యువతను వెర్రెక్కిస్తూ చరిష్మా చూపిస్తున్న సెలబ్రెటీలు..!
అందానికి కొలమానం వయస్సు అనుకుంటే అది పొరపాటే అంటున్నారు ఈ సుందరాంగులు. ఎంతో మంది కొత్త వారు వస్తున్నా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సత్తా చాటుతున్నారు 30 ప్లస్ బాలీవుడ్ రాణులు.
హిందీ చిత్ర సీమను ఇప్పటికీ ఏలుతున్న తారల్లో ఎక్కువ మంది 30ఏళ్లకు అటు ఇటుగా ఉన్నవారే. అయినా కుర్ర హీరోలతో నటిస్తూ మెప్పిస్తున్నారు. కొత్తవారు ఎందరున్నా తమకు సాటిరారని నిరూపిస్తున్నారు.
వయసు మీద పడుతున్నా అందాన్ని పరిరక్షించుకుంటూ విన్నూత చిత్రాల్లో నటిస్తూ చరిష్మా చూపిస్తున్నారు. ఐటం సాంగ్‌లకు ముందుంటాం అంటూ వచ్చి యువతను వెర్రెక్కిస్తున్నారు. ఈ బాలీవుడ్ భామల్లో 30ప్లస్ వారిని కొందరి చూద్దాం రండి...

కరీనా కపూర్(32): కరీనా కపూర్ చలచిత్ర కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రులు రణ్‌ధీర్‌కపూర్, బబితాలు. అక్క కరిష్మా కూడా పేరున్న నటి. 21 ఆగస్టు 1980న పుట్టిన కరీనాను ముద్దుగా బెబో అని కూడా పిలుస్తారు. 2000లో రెఫ్యూజీ చిత్రం ద్వారా చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఇందులో నటనకు ఆమె ఫిల్‌మఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబిట్ అవార్డ్‌ను గెల్చుకుంది. రీసెంట్ గా నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది.

ప్రియాంక చోప్రా(30): ఈమె బాలీవుడ్ నటి మాత్రమే కాదు మాజీ ప్రపంచ సుందరి కూడా. నటన జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్‌గా పని చేసింది. 18 జులై 1982న జార్ఖండ్‌లోని జంషడ్‌పూర్‌లో పుట్టింది. 2003లో అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో, లవ్ స్టొరీ ఆఫ్ ఎస్పై చిత్రంతో బాలీవుడ్ రంగపవ్రేశం చేసింది. 2008వ సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుని తన హవాను కొనసాగిస్తోంది.

ఐశ్యర్య రాయ్(38): కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరానికి చెందిన ఐశ్వర్యా రాయ్ 1 నవంబర్ 1973లో జన్మించింది. 1994లో ప్రపంచ సుందరి కిరీటం నెగ్గి భారత దేశమంతటా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 1996లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ తమిళ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలోకి ప్రవేశించింది. తెలుగులో ఈమె కనిపించిన ఒకే ఒక చిత్రం రావోయి చందమామా. ఆ చిత్రంలో ఈమె నాగార్జున సరసన ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈమె 2007లో అభిషేక్ బచ్చన్‌ని పెళ్లిచేసుకుంది. వీరికి ఒక పాప. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు గెలుచుకుంది. అందులో భారత అత్యున్నత పురస్కారం పద్మ శ్రీ ప్రముఖమైంది.

బిపాసా బసు(33): 7 జనవరి 1979లో న్యూ ఢిల్లీలో పుట్టింది. సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా పనిచేసింది. అభిషేక్ బచ్చన్ నటించిన ఆఖరి మొగల్ అనే చిత్రంలో తొలిసారి నటించింది. 2001లో అజనబీ చిత్రంలో నెగిటీవ్ రోల్ చేసింది. ఇందులో నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది. 2002లో వచ్చిన రాజ్ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టి గుర్తింపునిచ్చింది. 2003లో విడుదలై కుర్రకారును మత్తెక్కించిన చిత్రం జిస్మ్, ‘రేస్' ఈమె కెరీర్‌లో అత్యధిక కమర్షల్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది. తెలుగులోనూ టక్కరి దొంగ చిత్రంలో మహేశ్‌లో కలిసి ఆంధ్రలో అభిమానులను సంపాదించుకుంది. ఐటమ్ సాంగ్స్‌లోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్న బిపాసా ఇప్పటికి పలు అవార్డులను సొంత చేసుకుంది.

విద్యా బాలన్(34): 1 జనవరి 1978న కేరళలోని ఒట్టపాలెంలో జన్మించింది. హిందీ, బెంగాళీ, మళయాళం చిత్రాల్లో నటించింది. పరనీత చిత్రంలో భారతీయత ఉట్టిపడే స్త్రీలా నటించి మెప్పించారు. తరువాత వచ్చిన లగే రహో మున్నాభాయ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. మన తెలుగు నటి స్కిల్ జీవితం ఆధారంగా రూపొందించిన డర్టీ పిచ్చర్ యువతను వెర్రెత్తించింది. తెలుగు పేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరించారు. తరువాత నటనకు ప్రాధాన్యమున్న విభిన్న పాత్రలను ఎంచుకుని మరీ చిత్రాల్లో నటిస్తున్నారు విద్యాబాలన్. రీసెంట్ గా నిర్మాత సిద్దార్థ రాయ్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు.

చిత్రాంగద సింగ్: బాలీవుడ్ చిత్రసీమలోకి హాజరాన్ క్వాయిషే ఐసీ తో అడుగుపెట్టింది. ఈ చిత్రం ద్వారా విమర్శకులచే పలు ప్రశంసలు పొందింది. తర్వాత జ్యోతీ రాంధవా ను వివాహం చేసుకొని తర్వాత తల్లై కొన్ని సంవత్సరాల పాటు వెండితెరకు దూరంగా గడిపింది. ఈమె నటించిన ఏ సాలీ జిందగి మరియు సారీ భాయ్ వంటి చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చిన ఆ చిత్రాలు అంతటి ప్రజాదరణ పొందలేదు. తర్వాత తన ఆకర్షణీయమైన అందంతో దేసీ బాయ్స్, రేస్ 2లో నటించింది.

రాణీ ముఖర్జీ: రాణీ ముఖర్జీ అంటే చాలా మందికి ఇష్టం ఎందుకంటే ఆమె నవ్విందంటే వెయ్యి ఓల్ట్ ల బల్బ్ బెలిగనట్లే. అంత కళగా కనబడుతారామె. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఈమె వయస్సు 34సంవత్సరాలు అనురాగ్ కాషప్ చిత్రం ‘అయ్యా'చిత్రంలో లావని పాత్రలో మెరిపిస్తోంది.

కాజోల్: కాజోలో మరియు షారుఖ్ కాన్ జంటగా నటించిన దిల్ వాలే దులియా లేజాయింగే?చిత్రంతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో వీరిద్దరి మద్య రొమాన్స్ కుర్రకారుకు ఓ రొమాంటిక్ మూవీని అంధించారు. తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. తర్వాత బాలీవుడ్ నటుడు హీరో అజయ్ దేవగన్ తో వివాహం చేసుకొని ఓబ్యూటీఫుల్ కపుల్స్ గా బాలీవుడ్ లో నిలిచింది. తను ఇద్దరి పిల్లలకు తల్లైనా కూడా తన ఫిజిక్ ను అలాగే మెయింటైన్ చేస్తోంది.

లారా దత్తా: ఈమె మాజీ మిస్ యూనివర్స్. ఈమె చాలా సినిమాల్లో నటించి తర్వాత మహేష్ భూపతిని పెళ్ళాడి. ఓ బిడ్డకు తల్లైంది. అయితే ఈమె ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం ఫిట్ నెస్ పరంగా అంతగా ఎదగలేదు. అయినా కూడా తను తరువాతి చిత్రానికి సైన్ చేయడం జరిగింది.



Click it and Unblock the Notifications
