For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవలింతల వెనుకున్న అసలు రహస్యం..!!

కొన్ని సార్లు ఎవరైనా ఆవలిస్తుంటే చూసినా కూడా మనకి ఆవలింత వస్తుంది.అవును ఇది అంటువ్యాధి లాంటిది. ఈ అర్టికిల్ చదివేలోపు మీరు ఖచ్చితంగా 2-3 సార్లు ఆవలిస్తారు కూడా.

|

మధ్యాహ్నాలు మెలకువగా ఉండటం మనందరికీ చాలా కష్టమైన పని. నిజం చెప్పాలంటే మనకే కాదు జంతువులకైనా సరే.వరుసగా ఆవలిస్తున్నారంటే మీరు అలసిపోయారనో లేదా బోర్ కొడుతోందనడానికో సంకేతం.అసలు మనం ఎందుకు ఆవలిస్తామో ఎప్పుడైనా ఆలోచించారా?

Ever Wondered Why We Yawn?

ఈ ఆర్టికిల్ ద్వారా మనం ఎందుకు ఆవలిస్తామో వివరించాము.కొన్ని సార్లు ఎవరైనా ఆవలిస్తుంటే చూసినా కూడా మనకి ఆవలింత వస్తుంది.అవును ఇది అంటువ్యాధి లాంటిది. ఈ అర్టికిల్ చదివేలోపు మీరు ఖచ్చితంగా 2-3 సార్లు ఆవలిస్తారు కూడా.

అసలు మనం ఎందుకు ఆవలిస్తామో చదివి తెలుసుకోండి.

ఆవలింత అన్ని చోట్లా ఉంటుంది:

ఆవలింత అన్ని చోట్లా ఉంటుంది:

11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.అంటే మనం గర్భం లోంచి బయటకి రాక మునుపే ఆవలించామన్నమాట.అసలు ఆవలింత మానవ జీవితంలో ఒక విడదీయరాని భాగం కదా.

ఆవలింత మేకొలుపుకి కూడా సంకేతం:

ఆవలింత మేకొలుపుకి కూడా సంకేతం:

ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. మనలో చాలా మంది ఆవలింత రాగానే వెంటనే నిద్ర పోవాలనుకుంటారు.కానీ ఆవలింతలు మనల్ని మేల్కొలిపి ఉంచుతాయి అని అధ్యయన రిపోర్టులు నిరూపొస్తున్నాయి.అసలు ఇలాంటి అధ్యయనాలు ఎలా చేస్తారో కదా.

కానీ అసలు మనకి ఆవలింత ఎందుకొస్తుంది:

కానీ అసలు మనకి ఆవలింత ఎందుకొస్తుంది:

మనకి బోర్ కొట్టినప్పుడు లేదా నిద్రొచ్చినప్పుడు ఆవలిస్తాము.ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ జరిగి మరింత శ్రద్ధగా పనిచేస్తుంది.మనకి ఎక్కువ ఆవల్లింతలు వస్తున్నయంటే అర్ధం,తనని తాను చురుకుగా ఉంచుకోవడానికి మెదడు బాగా కష్టపడుతోందన్నమాట.

ఆవలింత ఎంత సేపు ఉంటుంది:

ఆవలింత ఎంత సేపు ఉంటుంది:

సగటున ఒక్కో ఆవలింత 6 సెకన్ల వరకూ ఉంటుంది.మరి ఈసారి ఆవలించినప్పుడు టైమర్ పెట్టుకుని చూసుకుందామా?

జీవిత కాలంలో ఎన్ని సార్లు ఆవలిస్తాము:

జీవిత కాలంలో ఎన్ని సార్లు ఆవలిస్తాము:

సగటున మనిషి జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి ఉపయోగిస్తాడు. ఇది జోక్ కాదు సుమా.

ఆవలించడానికి మరిన్ని కారణాలు:

ఆవలించడానికి మరిన్ని కారణాలు:

మనకి బోర్ కొట్టినప్పుడు, అలసటగా ఉన్నప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు మనం ఆవలిస్తామని పరిశోధకులు నిరూపించారు.శరీరం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మెదడుకి తక్కువ ఆక్సిజన్ అందుతుంది. అందువల్ల మన మెదడు ఆవలింతల ద్వారా ఎక్కువ గాలి పీల్చుకునేటట్లు చేసి తక్కువైన ఆక్సిజన్ సమస్యని ఎదుర్కొంటుంది.దీని ఫలితమే హాయిగా మెల్లిగా వచ్చే ఆవలింత.

English summary

Ever Wondered Why We Yawn?

Usually, each noon struggling to stay awake is a task for most of the humans, or be it any species. Yawning continuously can be a sign that you are bored or are feeling sleepy! But on a serious note, have you ever thought why do we even yawn?
Desktop Bottom Promotion