త‌ల మ‌నిషిది... శ‌రీరం పిల్లిది... ఎవ‌రు సృష్టించారో ఈ భ‌యంక‌ర వింత జీవిని!

By: sujeeth kumar
Subscribe to Boldsky

సైన్స్ లో జ‌రిగే ప‌రిశోధ‌న‌లు, ఆవిష్క‌ర‌ణలు ఎంతో ముందుకెళుతున్నాయి. ఎన్నో మార్పులు ఈ లోకంలో చోటుచేసుకున్నాయి. నేటి ప్ర‌పంచంలో ప్ర‌తి నిమిషానికి ఏదో ఒక పరిశోధ‌న‌ల వ‌ల్ల ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుస్తున్నాయి. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి మందులు క‌నిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

జ‌నెటిక్ మ్యూటేష‌న్ల గురించి వినే ఉంటారు. కొన్ని ప‌రిశోధ‌న‌లు విఫ‌ల‌మై జ‌న్యువులు స‌రిగా ప‌నిచేయ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డి ఉండొచ్చు. అలాంటి ఓ విఫ‌ల‌మైన పరిశోధ‌న ఫ‌లిత‌మే ఈ మ‌నిషి త‌ల క‌లిగి ఉన్న పిల్ల‌ది. మాన‌వులు చేసే ప‌రిశోధ‌న‌ల‌కు ఏమాత్రం కంట్రోల్ ఉండ‌ద‌ని తెల‌ప‌డానికి ఈ ఉదాహ‌ర‌ణ చాలు.

దీని గురించి మ‌రింత స‌మాచారం తెలుసుకుందాం...

ఒక వీడియో వైర‌ల్ అయ్యింది...

ఒక వీడియో వైర‌ల్ అయ్యింది...

పిల్లి-మాన‌వుడి హైబ్రిడ్ రూపం క‌లిగిన ఒక వింత జంతువు వికృత చేష్ట‌లు క‌లిగిన వీడియో ఇంట‌ర్నెట్‌ను హ‌ల్‌చ‌ల్‌చేసింది. ఈ వీడియో క్లిప్‌ను మ‌లేషియాలోని ఓ మారుమూల ప్రాంతంలో తీసిన‌ట్టుగా నివేదిక‌లు వెల్ల‌డించాయి.

ఏముంది ఈ వీడియోలో..

ఏముంది ఈ వీడియోలో..

ఈ వీడియోలో ఒక వింత జీవి గులాబీ రంగు దేహంతో బ‌ట్ట‌త‌ల‌తో, రెండు చేతులు, కాళ్లు కలిగి ఉంది. త‌ల మాత్రం మ‌నిషిని పోలి ఉంది. ఈ వీడియో ఈ వింత జీవికి రెండు కాళ్లు, చేతుల‌కు ప‌దునైన గోర్లు ఉన్న‌ట్టు గుర్తించారు. అంతేకాదండోయి కోర‌ల్లాంటి రెండు ప‌దునైన ప‌ళ్లు కూడా ఉన్నాయ‌ట‌. నెత్తిని అక్క‌డ‌క్క‌డా క‌ప్పి ఉంచిన‌ట్టున్న ప‌ల‌చ‌నైన జుట్టు దానికి ఉంద‌ని వీడియో చూసిన‌వారు చెప్పారు.

వాస్త‌వమేమిటి?

వాస్త‌వమేమిటి?

ఈ వీడియో చూసిన‌వారంతా హ‌డ‌లిపోయారు. ఇది ఎక్క‌డ నిజ‌మోన‌ని అలాంటి మ‌రిన్ని పుట్టుకొచ్చి త‌మ మీద దాడిచేస్తాయోన‌ని భ‌య‌ప‌డిపోయారు. అయితే ఆ త‌ర్వాత అది కేవ‌లం సిలికాన్ తో చేసిన బొమ్మ అని అమ్మ‌కానికి ఆన్‌లైన్‌లో ఉంచిన‌ట్టు దాన్ని త‌యారుచేసిన‌వారు చెప్పారు.

అంత‌కు ముందూ ఇలాంటివి జ‌రిగాయి!

అంత‌కు ముందూ ఇలాంటివి జ‌రిగాయి!

ఇలాంటి భ‌యంక‌ర‌మైన బొమ్మ ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చేసింది. ఇలాంటివి కొత్తేమీ కాదంటారు నెటిజ‌న్లు. ఇంత‌కు ముందు కూడా మ‌న దేశంలో మ‌నిషి త‌ల క‌లిగిన ఒక మేక ఉన్న‌ట్టు పుకారు లేపారు. అది ఇంట‌ర్నెట్‌లో బాగా పాపుల‌ర్ అయ్యింది.

కొస‌మెరుపు

కొస‌మెరుపు

ఇలాంటి ఎన్నో అబ‌ద్ధ‌పు వార్త‌లు ప్ర‌చారం అవుతుంటాయి. అవ‌న్నీ నిజాలు కావొచ్చు, కాక‌పోవ‌చ్చు. వాటి వెనుక నిజ‌మైన మూలాల‌ను, వాటి అస్థిత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే అవి నిజాలుగా నమ్మాల‌ని నిపుణులు చెబుతారు. ఇలాంటివి చూసి ఆందోళ‌న ప‌డ‌వ‌ద్ద‌ని మాన‌సిక వైద్యులు ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల‌కు సూచించారు. ఈ క‌థ‌నంపై మీ అభిప్రాయ‌మేమిటి? మీ ఆలోచ‌న‌ల‌ను కామెంట్ సెక్ష‌న్‌లో తెల‌పండి.

All images Source: Asiawire.com

English summary

The Mysterious Cat With A Human-like Face Found!!

With science researches and inventions reaching a new level, there is a lot that is changing and evolving around us.With genetic mutations and genes going wrong in a few cases, there is just anything that one can expect from and this example of a cat-human creature would prove it right that humans have no control on the gene mutations that can take place, which is the result of all the scientific experiments being done.
Story first published: Sunday, November 5, 2017, 15:00 [IST]
Subscribe Newsletter