Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
అజిత్ పవార్ మరణంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం అనూహ్యమైl, అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. బారామతి గడ్డపై జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కన్నుమూశారు.
ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు కూడా చనిపోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన కేవలం ఒక ప్రమాదమేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియో
విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇవి చూసిన వారి గుండెలు బరువెక్కుతున్నాయి. బారామతి ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ కోసం సిద్దమవుతున్న టైంలో విమానం అకస్మాత్తుగా అదుపు తప్పినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
గాల్లోనే బ్యాలెన్స్ కోల్పోయిన విమానం భారీ శబ్దంతో నేలను ఢీకొట్టింది. ఆ మరుక్షణం అది ఒక పెద్ద అగ్నిగోళంగా మారిపోయింది. మంటల తీవ్రత ఎంతలా ఉందంటే..సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఎవరూ సాహసించలేకపోయారు.
ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే
ఈ ప్రమాదాన్ని దగ్గరి నుండి చూసిన ప్రత్యక్ష సాక్షుల మాటలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. విమానం ల్యాండింగ్ కు ముందే గాల్లో అస్థిరంగా చక్కర్లు కొట్టడం తాము గమనించామని ఒక మహిళ తెలిపారు. విమానం రన్ వేపై దిగడానికి వస్తుండగా ఒక వైపుకు వంగిపోయింది.
నేలను తాకగానే పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే మంటలు చెలరేగి, వరుసగా నాలుగైదు పేలుళ్లు సంభవించాయి. విమాన శకలాలు గాల్లోకి ఎగిరి మా ఇంటి ఆవరణలో పడ్డాయి అని ఆమె భయంతో వణికిపోతూ చెప్పారు.
మరో సాక్షి మాట్లాడుతూ..విమానం కిందకు దిగుతున్న తీరు చూస్తేనే ఏదో ప్రమాదం జరగబోతోందని మాకు అనిపించింది. రన్ వేకి దాదాపు 100 అడుగుల దూరంలో ఉండగానే అది కూలిపోయింది. మేము కాపాడడానికి పరుగెత్తే లోపే మంటలు చుట్టుముట్టాయి. అజిత్ పవార్ అందులో ఉన్నారని తెలిసి మేము షాక్ కి గురయ్యాము అని ఆవేదన వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఈ విషాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ తన పాత గూటికి (శరద్ పవార్ వర్గంలోకి) తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఆ నిర్ణయం అమల్లోకి రాకముందే ఈ ఘోరం జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితమే అజిత్ పవార్ బీజేపీని వీడబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన తిరిగి సొంత పార్టీకి వెళ్లేలోపే ఈ సంఘటన జరిగింది. దేశంలో ఎవరికీ భద్రత లేదు అని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి
కేంద్ర దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం లేదని,అవి పూర్తిగా అమ్ముడుపోయాయని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మాత్రమే సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇది సాధారణ ప్రమాదం కాదు అని ఆమె తెలిపారు. అజిత్ పవార్ కుటుంబానికి, శరద్ పవార్‌కు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాంగ్రెస్ డిమాండ్
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ..ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. అజిత్ పవార్ మరణం తీరని లోటు. ఈ ప్రమాదం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలంటే నిష్పాక్షిక దర్యాప్తు జరగాల్సిందే అని డిమాండ్ చేశారు.



Click it and Unblock the Notifications
