Latest Updates
-
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం?
మహారాష్ట్ర, ఒడిషాలో అక్షయ తృతీయ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఇవాళ(ఏప్రిల్ 30)అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున ఏదైనా కొత్తగా ప్రారంభించడం, బంగారం కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. నార్త్ ఇండియాలో ఈ పండుగను అఖా తీజ్(Akha Teej)అనే పేరుతో జరుపుకుంటారు. ప్రతి ప్రాంతం ఈ పండుగకు తన సొంత సంస్కృతి,ఫ్లేవర్ ని తీసుకొస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర,ఒడిషాలో ఈ పండుగను ఎలా జరుపుకుంటో ఇప్పుడు చూద్దాం.
ఒడిషాలో అక్షయ తృతీయ పండుగను ఎలా జరుపుకుంటారు
ఒడిషా రాష్ట్రంలో అక్షయ తృతీయను ప్రత్యేక ఆచారాలు,సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ పండుగ వ్యవసాయానికి సంబంధించినది. కొత్త పంటల సీజన్ ప్రారంభానికి సూచనగా భావిస్తారు. రైతులు దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం వంటి వ్యవసాయ పనులను లాంఛనంగా చేస్తారు. మంచి పంట దిగుబడి కోసం భూమి తల్లిని,ప్రకృతిని పూజిస్తారు. లక్ష్మీదేవిని, విష్ణువుని కూడా పూజిస్తారు.
పూరీలో జరిగే ప్రసిద్ధ రధయాత్రకు సన్నాహాలు ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ రోజు నుంచి చందన యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభవ్రుడు, సుభద్రల విగ్రహాలను చందనంతో పూసి ఊరేగిస్తారు. ఈ యాత్ర దాదాపు 21 రోజులు జరుగుతుంది. రథయాత్రకు ముందు జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇదొకటి.

మహారాష్ట్రలో ఈ పండుగను ఎలా జరుపుకుంటారు
మహారాష్ట్రలో అక్షయ తృతీయ ప్రత్యేకమైన సంప్రదాయాలు,ఆచారాలతో జరుపుకుంటారు. ఈ పండుగను ఇక్కడ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది సాడేతీన్ ముహూర్తలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంటే ఇది సంవత్సరంలో అత్యంత శుభప్రదమైన మూడున్నర రోజులలో ఒకటి. ఈ రోజున మరాఠా ప్రజలు బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఏదైనా కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి చాలా అనుకూలమైనదిగా భావిస్తారు. లక్ష్మీదేవి, విష్ణువుని పూజిస్తారు. ముఖ్యంగా ముంబై,పూణే వంటి ప్రాంతాల్లో వ్యాపారస్థులు ఈ రోజున కొత్త షాపుని ప్రారంభించడానికి,కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి అనువైన రోజుగా భావిస్తారు.
ప్రజలు ఇళ్లల్లో ఈ రోజున శ్రీఖండక్ పూరీ అనే ప్రత్యేకమైన తీపి వంటకాన్ని తయారుచేస్తారు. మహిళలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి హల్దీ కుంకుమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒకటి నుదిటిన మరొకరు కుంకుమ పెట్టి బహుమతులు స్వీట్లు పంచుకుంటారు. ఇది సౌభాగ్యాలకు,కుటుంబ బంధాలకు చిహ్నంగా భావిస్తారు. రైతులు తమ వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. రాబోయే వర్షాకాలం కోసం విత్తనాలు విత్తడం ప్రారంభిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారు
ఏపీ,తెలంగాణలో అక్షయ తృతీయను భక్తిశ్రద్దలతో సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఇక్కడ కూడా అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున బంగారం ఎక్కువగా ఎవరైనా కొంటారు అంటే అది తెలుగోళ్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇళ్లల్లో ఈ రోజున లక్ష్మీదేవి,విష్ణువుని పూజిస్తారు. పానకం,వడపప్పు,దేవతలకు నైవేద్యంగా పెడతారు. ఈ రోజున గుళ్లను కూడా సందర్శిస్తారు. కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. పేదవారికి,అవసరమైన వారికి దానాలు చేస్తారు. పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ఈ రోజుని మంచిదిగా భావిస్తారు. ప్రజలు తమ ఇళ్లల్లో పాయసం, పులిహోర,ఇతర తీపి పదార్థాలు తయారుచేస్తారు. కొందరు తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం వారికి తర్పణాలు అర్పిస్తారు.



Click it and Unblock the Notifications