Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
కనే ముందు నా అనుమతి ఎందుకు తీసుకోలేదు..? తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన టిక్‌టాకర్..!
మొన్నటి తరం కంటే రాబోయే తరం చాలా చురుకుగా ఉంటారని నానుడి. కానీ ప్రతీ కొత్త తరం మరింత చురుకుగా ఉండడానికి ఇదే మంచి ఉదాహరనేమో. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ మహళ తన అనుమతి లేకుండా జన్మనిచ్చినందుకు తల్లిందండ్రలపైనే కేసు పెట్టింది. సదరు కంప్లెయింట్ చేసిన మహిళ ఓ టిక్ టాకర్. ఆమె చేసిన వాదనలు, పెట్టిన కంప్లెయింట్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
థియాజ్ అనే ప్రముఖ టిక్‌టాకర్ ఇలా తల్లిదండ్రులపై కేసు వేయడంతో ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్‌కు గురికావడమే కాకుండా సోషల్‌మీడియాలో ఆమె పోస్టు కూడా బాగా వైరల్ అయింది. తాను చేసిన కామెంట్స్, కేసుకు సంబంధించిన మొత్తం విషయాన్ని వీడియో రూపంలో పెట్టారు.

రిలీజ్ చేసిన వీడియోలో థియాజ్ మాట్లాడుతూ... నేను ఈ భూమిపైకి రావడానికి మానసికంగా సిద్ధాంగా లేను, పెరిగి ఉద్యోగం సంపాదించి పనిచేసుకునే ఆసక్తి కూడా లేదు. కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా, నా అనుమతి తీసుకోకుండా నా తల్లిదండ్రులు నన్ను ఈ భూమిమీదికి ఎలా తీసుకొస్తారని ఆమె సదరు వీడియోలో ప్రశ్నంచింది. తప్పకుండా ప్రతీ తల్లి దండ్రీ పిల్లల అనుమతి తీసుకొని కనాలని ఆమె వాదించింది.
నేను పిల్లలందరికీ ఇదే విషయంపై ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. అందరు పిల్లలు వారి తల్లిదండ్రులపై నన్నెందుకు కన్నావు, నా అనుమతి లేకుండా ఈ భూమిపై ఎందుకు తీసుకొని వచ్చావో అందరి తల్లిదండ్రులను అదగాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలందరినీ అడిగేలా తాను తయారు చేస్తానన్నారు.
పిల్లలను దత్తతు తీసుకుంటే పరిస్థితి వేరేలా వుంటుందని అంటున్నారు. పిల్లలకు సహాయం చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో అలాంటివి వర్తించవని చెబుతున్నారు. అయితే టిక్‌టాకర్ థియాజ్ చేసిన కామెంట్లకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు తాను ఏది చెప్పాలనుకుందో స్పష్టత లేదని అనుకుంటున్నారు.
థియాజ్ పెట్టిన పోోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. థియాజ్ చేసిన పోస్ట్‌కు హెడ్‌లైన్ కూడ్ వ్యంగ్యం అని వుండడం విశేషం. నెటిజన్లు చేస్తున్న కామెంట్లు మాత్రం పలువురిని షాక్‌కు గురిచేయగా చాలా మందికి వినోదాన్ని తీసుకొస్తున్నాయ్.
థియాజ్ చెప్పినట్లుగానే పిల్లలు తల్లిదండ్రులపై కేసు పెడితే, మళ్లీ తల్లిదండ్రు పిల్లలు వయసు పెరిగిన తరువాత తాము పెంచినందుకు అయిన ఖర్ఛు మొత్తం పిలల నుంచి సేకరిస్తారని కామెంట్ పెట్టారు.
థియాజ్ పెట్టిన పోస్టులో అటు వ్యంగ్యం, హాస్యంతో పాటు ఓ మానసిక ఘర్షణను కూడా చూడవచ్చు. నేటి సమాజంలో చాలా మంది పిల్లలు తమను ఎందుకు పుట్టించారనే ప్రశ్నలను వేస్తున్నారు. ప్రపంచంలో జనాభా కూడా విచ్చల విడిగా పెరిగిపోతుంది. కరోనా సమయంలో చాలామంది పిల్లలు అనాధలుగా అయిపోయారు. ప్రపంచంలో పుట్టిన పిల్లలకు భద్రత లేకుండా పోతోంది. జనాభా ఎక్కువ కావడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతోంది. పోటీ తత్వం కూడా ఎక్కువ కావడం, ఆహార ఉత్పత్తి తక్కువ కావడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. టిక్‌టాకర్ థియాజ్ పెట్టిన పోస్టు దాన్ని ప్రతిబింబిస్తోంది. పుట్టిన పిల్లలు తల్లిదండ్రులపై అనుమతి లేకుండా ఎందుకు కన్నావని కేసు పెట్టడం పరిస్థితి తెలియజేస్తుంది.



Click it and Unblock the Notifications