Latest Updates
-
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.!
Assembly election result:ఎలక్షన్ రిజల్ట్ ప్రారంభంలోనే తెలంగాణాలో బ్యాండ్ బాజా మోగిస్తున్న కాంగ్రెస్ ..
Assembly election result 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ట్రెండ్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య 50-50 పోటీ నెలకొంది.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. రాజస్థాన్‌లో బీజేపీ లాభపడగా, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో వస్తున్న ట్రెండ్స్‌లో బీజేపీ ముందుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

మొత్తం మీద రెండు పార్టీల మధ్య 50-50 మధ్య పోటీ కనిపిస్తోంది. బీజేపీ రెండు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉండగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ముందుగా వాలెట్ పేపర్ లెక్కిస్తున్నారు. అలాగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చివరి దశ నవంబర్ 30న ముగిసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 199, తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, శ్రీగంగానగర్‌లోని శ్రీకరణ్‌పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కొన్నూర్ మృతి చెందడంతో 199 స్థానాల్లో మాత్రమే ఓటింగ్ జరిగింది.
ఓటింగ్ మరియు ఫలితాల మధ్య వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో, తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బిజెపి ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో మిగిలిన రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనా. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉండగా, బీజేపీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. రాష్ట్రంలో 42-55 సీట్లు గెలుస్తాం.
పార్టీ కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు పటాకులు కాల్చడంతోపాటు పూజలు, హవనాలు కూడా జరుగుతున్నాయి.



Click it and Unblock the Notifications
