Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
కారులో ఇరుక్కున్న ఒంటె..దోమలతో కుట్టించుకుంటున్న పరిశోధకుడు.. వైరల్ వీడియోలు..
కొన్ని విచిత్ర సంఘటనలు చూసినప్పుడు బాధపడాలా, నవ్వాలా అర్థం కాని పరిస్థితి ఎదురౌతుంది. ఇలాంటి ఓ వింత పరిస్థితే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కారులో ఒంటె ఇరుక్కుపోయింది. ఎంటె వున్న సైజును బట్టి కారులో పట్టదు. కానీ హనుమాన్‌గర్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఒంటె ఒక్కసారిగా కారులోపల ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇరుక్కున్న కారులోంచి ఒంటె బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. కారులోంచి ఒంటె బయటకు రావడానికి వీలుపడటం లేదు. దీంతో ఒంటె బాధతో గాయాలతో అరుస్తూ వుంది. అయితే కారులోపల వున్నవారికి ఎలాంటి హానీ జరగలేదు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దృష్యాలు చాలా భయంకరంగా వున్నాయని కామెంట్ చేస్తున్నారు. మనుషులకు భాద తెలపడానికి నోరు, మాట వుంటుంది కానీ మూడ జీవాలకు ఆ అవకాశం వుండదని నెటిజెన్లు బాధపడుతూ కామెంట్ చేస్తున్నారు.
హైవేలపై వెళ్తుండగా ఎన్నో మూగజీవాలు రోడ్డు దాటుతుంటాయ్. అలాంటి సమయంలో జంతువులను చూసుకొని రోడ్డు దాటాలని చెబుతున్నారు.
కొందరు పరిశోధకులు చరిత్రలో నిలిచిపోతారు, మరికొందరు స్పూర్తిదాయకంగా వుంటారు. డాక్టర్ రాస్ అనే పరిశోధకుడు కావాలని దోమలతో కరిపించుకొని వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధకుడి పేరు డాక్టర్ పెర్రన్ రాస్.. తన చేతిని దోమలు వున్న డబ్బాలో పెడతాడు. అప్పుడు దోమలు వచ్చి అతని చెయ్యిని విపరీతంగా కుడతాయ్. దోమలు కుట్టిన తరువాత వాటితో ఈ డాక్టర్ పరిశోధనలు చేస్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
దోమలు అలా కుడుతూవుంటే తనకు చాలా ఆనందం కలుగుతుందని డాక్టర్ రాస్ చెబుతున్నారు. ఇప్పటి వరకు 15వేల దోమకాట్లు పడినట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మలేరియా అతన్ని ఏమీ చేయలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందరూ మలేరియాను చూసి భయపడతారు కానీ మలేరియానే అతన్ని చూసి భయపడుతుందని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఎలాన్ మస్క్ కలలు గ్రహాలను దాటి వెళ్లిపోతాయ్. మార్స్‌పైన ల్యాండ్ అవ్వడానికి ఇప్పటికే స్పేస్ ఎక్స్‌కు రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్స్ మాత్రమే కాదు యురేనస్ గ్రహాన్ని రీచ్ కావడమే తన లక్ష్యమని ఎలాన్ మస్క్ చెబుతున్న వీడియోను స్వయంగా ఎలాన్ మస్క్ తన అధికారిక ఎక్స్ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మస్క్ తలచుకుంటే ఏదైనా సాద్యమని అంటున్నారు.



Click it and Unblock the Notifications
