Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: ఈ వ్యక్తులకు ఎవరి బాధ పట్టదు, స్వార్థంతో నిండిపోయి ఉంటారు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
కొంత మంది వ్యక్తులు ఎదుటివారి బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని, వారు ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఆలోచిస్తారని చాణక్యుడు చెప్పాడు.ఒక వ్యక్తి బాధను అర్థం చేసుకోని ఆ కొంత మంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరు ఎవరి గురించీ ఆలోచించరు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారు ఎవరినీ పట్టించుకోరని, ఎదుటి వారి బాధ, సుఖం వారికి పట్టదని చెప్పాడు చాణక్యుడు. నిత్యం మత్తులోనే ఉండటం వల్ల ప్రపంచంతో సంబంధం తెంచేసుకుంటారని అన్నాడు ఆచార్యుడు.
వీరికి ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచన:
ఆచార్య చాణక్యుడి ప్రకారం కొంత మంది వ్యక్తులు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారికి మరో పేరే స్వార్థపరులు. అలాంటి వారు తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారికి తమ స్వార్థం ముందు ఎదుటివారి బాధలు పట్టవు, పట్టించుకోరు. అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలని, అలాంటి వారిని ఎప్పుడూ దగ్గరికి రానివ్వొద్దని చెప్పాడు ఆచార్య చాణక్యుడు.
ఇలాంటి వ్యక్తులు ఎదుటివారు ఏమైపోయినా పట్టించుకోరు:
దొంగలు, దోపిడీ దారులు ఎప్పుడూ ఎదుటివారి బాధలను పట్టించుకోరని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు. వీరికి ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉంటుందని చెప్పాడు. దొంగతనం చేయడం వల్ల ఎదుటివారు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించరని అన్నాడు ఆచార్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications