Latest Updates
-
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా..
Happy Bakrid 2026: బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు? మీ ముస్లిం ఫ్రెండ్స్ కు బక్రీద్ విషెస్ ఇలా చెప్పండి!
దేశవ్యాప్తంగా ముస్లింలు గురువారం(మే 28) బక్రీద్ పండుగను అధికారికంగా జరుపుకోకుండగా బుధవారం సాయంత్రం నుంచే సెలబ్రేన్స్ స్టార్ట్ అవుతాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో వచ్చే పవిత్రమైన పండుగ బక్రీద్. దీనినే ఈద్ ఉల్ అధా అంటారు. అంటే అరబిక్ భాషలో త్యాగాల పండుగ లేదా బలిదాన పండుగ అని కూడా పిలుస్తారు. ఇస్లాం మత ప్రవక్త అయిన ఇబ్రహీం, అల్లా పట్ల తనకు ఉన్న అపారమైన భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అతని అచంచలమైన భక్తికి మెచ్చిన అల్లా..బలిపీఠంపై ఉన్న కుమారుడి స్థానంలో ఒక పొట్టేలుని బలి ఇవ్వమ్మని ఆదేశిస్తాడు.

ఆ నాటి ఇబ్రహీం ప్రవక్త గొప్ప త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఖుర్బానీ(జంతుబలి) ఇవ్వడం ప్రధాన ఆచారం. అయితే ఇది కేవలం బలి ఇవ్వడం మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప దాతృత్వం దాగి ఉంది. ఖుర్బానీ ఇచ్చిన మాంసాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని పేదలకు దానంగా ఇస్తారు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు పంచుతారు, మూడో భాగాన్ని మాత్రమే తమ కుటుంబం కోసం ఉంచుకుంటారు. తోటి మానవులకు సహాయం చేయడం, దానం చేయడం, అందరూ సమానమే అని చాటడం ఈ పండుగ విశిష్ఠత.
బక్రీద్ విషెస్ ఇలా చెప్పండి
-ఈ బక్రీద్ 2026 మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. ఈద్ ముబారక్!
-మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు.
-ఈ త్యాగాల పండుగ మీ ఇంట సిరిసంపదలు, సంతోషాలను తీసుకురావాలి. బక్రీద్ ముబారక్.
-అల్లా కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని ప్రార్థిస్తూ..ఈద్ అల్ అధా శుభాకాంక్షలు.
-పవిత్రమైన ఈ పర్వదినం మీ ఆశలన్నీ నెరవేర్చాలని ఆశిస్తున్నాను. హ్యాపీ బక్రీద్ 2026.
-మీ త్యాగాలను, దానధర్మాలను అల్లా స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈద్ ముబారక్ 2026.
-బక్రీద్ పండుగ తెచ్చిన సంతోషం మీ ఇంట కలకాలం నిలవాలి.
-ఆ అల్లా దీవెనలు మీకు, మీ కుటుంబానికి సదా రక్షగా ఉండాలి. ఈద్ ముబారక్.
-ఈ పండుగ మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించి, విజయాలను అందించాలి.
-శాంతి, ఆనందం, సౌభాగ్యాలతో ఈ బక్రీద్ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బక్రీద్ 2026.
-ఈద్ అల్ అధా పర్వదినాన అల్లా మీకు ఉత్తమమైన ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించుగాక. హ్యాపీ బక్రీద్.
-మీ హృదయాల్లో ప్రేమను, ఇళ్లలో సంతోషాన్ని నింపే పండుగే ఈ బక్రీద్. ఈద్ ముబారక్.
-దానగుణానికి, సోదరభావానికి ప్రతీక అయిన బక్రీద్ శుభాకాంక్షలు.
-మీకు సుఖసంతోషాలు, విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. బక్రీద్ ముబారక్.
-ప్రతి రోజూ పండుగలా గడవాలని కోరుకుంటూ.. 2026 ఈద్ అల్ అధా శుభాకాంక్షలు.
-ఈ పవిత్ర దినాన మీ కోరికలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఈద్ ముబారక్.
-మనసులన్నీ ఏకమయ్యే ఈ పండుగ రోజున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
-మీరు చేసే నమాజును అల్లా సంతోషంగా స్వీకరించాలని కోరుకుంటూ బక్రీద్ ముబారక్.
-ఎల్లప్పుడూ దేవుని దయ మీతో ఉండాలని ఆశిస్తూ.. హ్యాపీ బక్రీద్.

బక్రీద్ మెసేజ్ లు ఇలా పంపుకోండి
-ప్రవక్త ఇబ్రహీం గారి త్యాగాన్ని స్మరించుకుంటూ, పేదలకు సహాయం చేద్దాం. అందరికీ బక్రీద్ ముబారక్.
-పంచుకుంటే పెరిగేది ప్రేమే కాదు, ఆనందం కూడా.. ఈ బక్రీద్ కు మీ ఆనందాన్ని అందరితో పంచుకోండి.
-స్వార్థాన్ని వీడి, త్యాగనిరతితో జీవించడమే బక్రీద్ మనకు నేర్పే సందేశం. ఈద్ ముబారక్.
-అల్లా మీకు శాంతి, దయ, సుఖశాంతులను ప్రసాదించుగాక. మీకు, మీ ఆత్మీయులకు బక్రీద్ శుభాకాంక్షలు.
-మీ ప్రార్థనలు ఎప్పటికీ వృథా కావు. ఆ అల్లా మీకు అనుకున్నవన్నీ ఇస్తాడు. బక్రీద్ ముబారక్.
-ఈ పవిత్రమైన పండుగ నాడు మీరు చేసే ప్రతి మంచి పనికి అల్లాహ్ రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు.
-కష్టాలు తొలగిపోయి, మీ జీవితంలో ఆనందపు వెలుగులు నిండాలని ఆశిస్తూ.. హ్యాపీ బక్రీద్.
-తోటివారికి సాయం చేయడంలో ఉన్న సంతృప్తిని ఈ బక్రీద్ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఈద్ ముబారక్.
-మీరు చేసే పనుల్లో అల్లా తోడుగా నిలిచి, మిమ్మల్ని సదా కాపాడుగాక. బక్రీద్ శుభాకాంక్షలు.
-పండుగ అంటే కేవలం విందు కాదు, మంచి మనసుతో ఇతరులకు అండగా నిలవడం. ఈద్ ముబారక్
-జీవితమనే ఈ ప్రయాణంలో దేవుని ఆశీస్సులు మీకు దారిచూపాలని ఆకాంక్షిస్తూ బక్రీద్ శుభాకాంక్షలు.
-ఖుర్బానీ అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మన దైవభక్తికి నిదర్శనం. అందరికీ బక్రీద్ ముబారక్.
-సర్వమానవాళికి శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటూ.. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
-ఈ పవిత్ర మాసంలో మీరు చేసిన ప్రార్థనలన్నీ ఫలించి, మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలి.
స్ఫూర్తిదాయకమైన బక్రీద్ కోట్స్
-నిజమైన ఖుర్బానీ అనేది మాంసాన్ని ఇవ్వడం కాదు, మనలోని అహంకారాన్ని దేవుని ముందు వదిలెయ్యడం.
-పేదవాడికి నువ్వు చేసే దానమే రేపు అల్లాహ్ దర్బారులో నిన్ను కాపాడుతుంది.
-కష్టాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు, దానగుణమున్న వాడే నిజమైన భక్తుడు.
-సంతోషాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. మీ ఆనందాన్ని ఈద్ నాడు పేదలతో పంచుకోండి.
-త్యాగం లేకుండా దైవ ప్రేమను పొందలేము. ఇబ్రహీం ప్రవక్త జీవితం మనకు అదే చెబుతుంది.
వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లు
-ఈద్ అల్ అధా 2026 శుభాకాంక్షలు. దేవుని దయ అందరిపై ఉండాలి.
-త్యాగానికి, దాతృత్వానికి ప్రతిరూపం బక్రీద్. అందరికీ శుభాకాంక్షలు.
-మీ ప్రార్థనలను అల్లా ఆమోదించుగాక. ఆమీన్. బక్రీద్ ముబారక్.
-ప్రేమను పంచుదాం, శాంతిని వెతుకుదాం. హ్యాపీ బక్రీద్.
-అల్లా నా తోడున్నాడు, నాకే భయం లేదు. అందరికీ ఈద్ ముబారక్.
-దానం చేద్దాం, దైవానుగ్రహం పొందుదాం. బక్రీద్ శుభాకాంక్షలు.
-అల్లా దీవెనలు ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉండాలి. హ్యాపీ బక్రీద్.



Click it and Unblock the Notifications
