Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి

మన ఇంటికొచ్చిన అతిథిని దేవుడిలా చూడటం మన భారతీయ సంస్కతిలోనే ఉంది. మనదేశంలో అతిథి దేవో భవ అనే సంస్కతి ఉంది కాబట్టే ప్రపంచం నలుమూలల నుంచి మనదేశాన్ని నిత్యం లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే మనదేశంలోని కొంతమంది వ్యక్తులు చేసే పనుల కారణంగా విదేశాల్లో భారతీయుల పట్ల ద్వేషం, చులకన భావం పెరిగిపోతుంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మనదేశ సంస్కృతి, సాహిత్యాన్ని, గొప్పతనం తెలసుకునేందుకు వచ్చిన ఒక మహిళా అతిథిని నలుగురు కుర్రాళ్లు ఘోరంగా అవమానించి, వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ek shot ka kitna legi pooch 4 arrested for harassing israeli tourist in rajasthan watch viral video

మనదేశంలో విదేశీ పర్యాటకులు ఎక్కువగా వెళ్లేది రాజస్థాన్ కే. అద్భుతమైన, రాజసం ఉట్టిపడే కోటలు, అక్కడి సంస్కృతి, గొప్ప చరిత్ర, అందమైన పర్యాటక ప్రదేశాలను కలిగి ఉన్న రాజస్థాన్ కి నిత్యం పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు వెళ్తుంటారు. అయితే ఇదే క్రమంలో ఇజ్రాయెల్ కు చెందిన గల్ యాకోవ్(Gal Yakoov)అనే మహిళా పర్యాటకురాలు రాజస్థాన్ వెళ్లింది. అక్కడ ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలోని కిషన్ గర్ డంపింగ్ యార్డ్ దగ్గర ఆమె తన కెమెరాతో వీడియో తీసుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న నలుగురు స్థానిక యువకులు అసహ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు..ఒక్క షాట్ కి ఎంత తీసుకుంటావో చెప్పు అంటూ చాలా నీచంగా ప్రవర్తిస్తూ గల్ యాకోవ్ ని అడిగారు. అయితే గల్ యాకోవ్ కి హిందీ భాష రాక వాళ్లు ఏం అంటున్నారో అర్థం కాలేదు. సెల్ఫీ కావాలి అని అడుగుతున్నారేమో అని అనుకొని నో నో అని గల్ యాకోవ్ చెబుతున్నా కూడా ఆమె చుట్టూ చేరి షాట్ కి ఎంత చెప్పు అంటూ దారుణంగా ప్రవర్తించారు.

అయితే గల్ యాకోవో ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఇది జరిగింది 2022లో కాగా, తాజాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫారిన్ టూరిస్ట్ తో ఈ దరిద్రులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది,వీళ్లని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. దీంతో రాజస్థాన్ పోలీసులు దీనిని సుమోటోగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోలో మహిళా టూరిస్ట్ తో అసభ్యంగా ప్రవర్తించిన నలుగురిని మొహమ్మద్ ఫర్హాన్, మొహమ్మద్ ఆసిమ్, ఫర్హాన్, అక్తర్ అలీగా పోలీసులు గుర్తించి వారిని తాజాగా అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఒక్క ఘటనతో భారత్ పై అన అభిప్రాయం ఏం మారదని, తాను మళ్లీ ఇండియాకు వస్తా అని, భారత్ అంటే తనకు ఎంతో ఇష్టం అని గల్ యాకోవ్ చెబుతోంది. రాజస్థాన్ పోలీసులకు కూడా గల్ యాకోవ్ థాంక్స్ చెప్పింది.

Story first published: Thursday, October 1, 2026, 15:44 [IST]
Desktop Bottom Promotion