Latest Updates
-
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే..
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియోలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో సారాంశం ఏంటంటే..రష్యా నుంచి జూలీ అనే ఒక అమ్మాయి తను ప్రేమించిన రాహుల్ అనే యువకుడి కోసం బీహార్ లోని భాగవత్ పూర్ కు వచ్చేసింది.
రష్యాలో నమిత్ ఉద్యోగం చేసే సమయంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడిందని, రాహుల్ ని ఆ రష్యా అమ్మాయి పిచ్చిపిచ్చిగా ప్రేమించిందని, అతడికి ఆస్తి పాస్తులు లేకపోయినా జీవితాంతం అతడితో ఉండాలని నిర్ణయించుకుందని, ఈ క్రమంలో నమిత్ రష్యా నుంచి తిరిగి ఇంటికి వచ్చేయగా..అతడిని వదిలి ఉండలేక జూలీ కూడా బీహార్ లోని అతని ఇంటికి వచ్చేసినట్లు ఆ వీడియోలో చెప్పబడింది.

అంతేకాకుండా ఆమె తన కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చినట్లు చెప్పబడింది. దీంతో మనోడు అదృష్టవంతుడు, రష్యా నుంచి అమ్మాయి ఒక పేదవాడి కోసం వచ్చిందంటే నిజమైన ప్రేమ ఇలాగే ఉంటదని, ఖండాంతరాలు దాటిన ప్రేమ అని, కోట్ల ఆస్తి వదిలి ఆ అమ్మాయి గుడిసెలో తను ప్రేమించినోడితో జీవించేందుకు వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో, రైళ్లల్లో, బస్సుల్లో, ఆటోల్లో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరగుతుంది. అయితే ఈ ప్రేమ కథలొ పెద్ద టిస్ట్ వచ్చిందండోయ్.
ఈ ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్ ఇదే
వాస్తవానికి ఆ వీడియోలో చూపించబడిన అమ్మాయిది రష్యానే కాదు. ఆమె పేరు కూడా జూలీ కాదు. ఆమె అసలు పేరు ఆండ్రియా కొన్నోలీ..పుట్టింది యూకేలో. ఆమె ప్రేమించిందని చెప్పబడుతున్న యువకుడు అసలు పేరు రాహుల్ కాదు నమిత్. రష్యానే వెళ్లలేదు. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ముచ్చటే లేదు.
షివియా(Shivia) అనే బ్రిటిష్ NGO కోసం ఆండ్రియా పనిచేసేది. ఈ సంస్థ.. బీహార్ లోని పూర్నియా కేంద్రంగా సామాజిక అభివృద్ధి, ఆరోగ్య రంగాలపై పనిచేస్తున్న సాథీ(SATHEE)అనే స్థానిక బృందంతో కలిసి పనిచేస్తుంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు సహాయపడే కార్యక్రమాలపై ఈ రెండు సంస్థలు సహకరించుకుంటాయి.

అసలు జరిగిందిందే
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను అర్థం చేసుకోవడాని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య వ్యవస్థల పనితీరును పరిశీలించడం కోసం ఆరుగురు మహిళలతో కూడిన బ్రిటన్ ఎన్జీవో బృందం అక్టోబర్ 7, 8 తేదీల్లో బీహార్ లోని పూర్నియాను సందర్శించింది. ఈ బృందంలో ఆండ్రియా కూడా ఉన్నారు. వారి పర్యటన సందర్భంగా, ఆ మహిళలు స్థానిక మహిళలతో సమావేశాలు నిర్వహించారు. వారు గులాబీల గుత్తితో వారికి స్వాగతం పలికారు. ఆండ్రియా వారి ఇళ్లలో కొన్నింటిని కూడా సందర్శించారు. ఈ సమావేశాలకు సంబంధించిన ఫోటోలను సంస్థ సోషల్ మీడియా ఖాతాలలో అప్ లోడ్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోల్లో ఆ యువతి, యువకుల మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వారిద్దరి మధ్య అనుబంధం ఉందంటూ రకరకాల ఊహాగానాలతో కూడిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమని సథీ సంస్థ స్పష్టం చేసింది. వైరల్ వీడియోలో ఉన్న నమిత్ సాథీ సంస్థ కోసం పనిచేస్తున్నారు. అతనే స్వయంగా ఇదంతా ఫేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.



Click it and Unblock the Notifications
