Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
కలలు కనడానికి డబ్బు అక్కర్లేదు.. కానీ ఆ కలను సాకారం చేసుకోవడానికి అపారమైన ధైర్యం, కఠోర శ్రమ కావాలి. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనమే 35 ఏళ్ల శ్రవణ్ కుమార్ విశ్వకర్మ జీవిత ప్రయాణం. ఒకప్పుడు జీవనోపాధి కోసం కాన్పూర్ వీధుల్లో టెంపోలు నడిపిన ఆయన, ఇప్పుడు ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు మొట్టమొదటి స్వదేశీ విమానయాన సంస్థ శంఖ్ ఎయిర్(Shankh Air)కు అధిపతిగా మారారు. పేదరికం పీకలదాకా ఉన్నా, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన ఆయన స్ఫూర్తిదాయక కథ ఇప్పుడు చూద్దాం

టెంపో స్టీరింగ్ నుంచి.. విమానాల వరకు
సాధారణంగా ఒక ఎయిర్‌లైన్స్ యజమాని అనగానే కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్తల నేపథ్యం గుర్తుకొస్తుంది. కానీ శ్రవణ్ కుమార్ కథ దానికి పూర్తిగా భిన్నం. కాన్పూర్ లోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన, కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. లోడర్ గా పనిచేశారు..ఫ్రెండ్స్ ఆటోలు, టెంపోలు అద్దెకు తీసుకుని నడిపారు. ఎన్నో చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించి చేతులు కాల్చుకున్నారు. కానీ ఏ వైఫల్యం ఆయనలోని కసితో కూడిన సంకల్పాన్ని చంపలేకపోయింది.
2014.. తలరాతను మార్చిన సంవత్సరం
ఎన్ని పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గని ఆయనకు 2014లో అదృష్టం సిమెంట్, టీఎంటీ (TMT) వ్యాపారం రూపంలో తలుపు తట్టింది. ఈ వ్యాపారంలో ఆయన పెట్టిన పెట్టుబడి, కఠోర శ్రమ అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. క్రమంగా మైనింగ్, రవాణా (లాజిస్టిక్స్) రంగాల్లోకి అడుగుపెట్టారు. వందల కొద్దీ ట్రక్కులతో అతిపెద్ద లాజిస్టిక్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఈ ఆర్థిక స్థిరత్వమే ఆయనలో విమానయాన సంస్థను స్థాపించాలనే కలను చిగురింపజేసింది.

శంఖ్ ఎయిర్ రూపకల్పన
ఏదో డబ్బుంది కదా అని రాత్రికి రాత్రే విమానయాన సంస్థను ప్రారంభించలేదు. నాలుగేళ్ల క్రితం ఈ ఆలోచన రాగానే, విమానయాన రంగానికి సంబంధించిన నిబంధనలు, లైసెన్సింగ్ విధానాలు, ఎన్ఓసి (NOC) ఎలా సాధించాలి వంటి విషయాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. ఆయన శ్రమ ఫలించి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ (NOC) లభించింది.
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2026లో శంఖ్ ఎయిర్ తన సేవలను ప్రారంభించనుంది. లక్నోను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకు తొలుత మూడు అత్యాధునిక ఎయిర్ బస్ విమానాలతో ఈ సంస్థ వికసించనుంది.
విమానం ఏమీ విలాసం కాదు
శ్రవణ్ కుమార్ దృష్టిలో శంఖ్ ఎయిర్ అనేది కేవలం లాభాలు ఆర్జించే వ్యాపారం మాత్రమే కాదు.. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే ఒక బృహత్తర ప్రయత్నం. మేము పెరిగిన వాతావరణంలో రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. రోజువారీ కూలీ దొరికితే చాలనుకునేవాళ్లం. అలాంటిది పెద్ద కలలు కనడం అంటే అసాధ్యమే. కానీ,ః విమాన ప్రయాణం అనేది కేవలం ధనవంతులకే పరిమితం అనే భావనను నేను బద్దలు కొట్టాలనుకుంటున్నాను. నా దృష్టిలో విమానం కూడా బస్సు, టెంపో లాంటి మరో రవాణా సాధనం మాత్రమే. దాన్ని ఒక విలాసంగా చూడకూడదు అని శ్రవణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.



Click it and Unblock the Notifications
