Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అద్భుతమైన తీపి పదార్థాలలో వేరుశెనగ మిఠాయి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. స్కూల్ వదిలిన వెంటనే పిల్లలు షాప్ కి పరుగెత్తి కొనుక్కునే ఇష్టమైన స్వీట్ ఇది. అప్పట్లో పల్లి పట్టీ కొరుక్కుంటూ తింటే వచ్చే మజానే వేరు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ మిఠాయి పోషకాల గని. పల్లీలలో ప్రోటీన్లు మెండుగా ఉంటే,ఇందులో వాడే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బయట దొరికే రంగుల స్వీట్ల కంటే, ఇంట్లో మన చేతులతో స్వచ్ఛంగా చేసుకునే పల్లి మిఠాయి ఎంతో బెటర్.

వేరుశెనగ మిఠాయి తయారీకి కావలసిన పదార్థాలు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - అర కిలో
బెల్లం - 200 గ్రాములు
నీళ్లు - పాకానికి సరిపడా
నెయ్యి - కొద్దిగా
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి!
వేరుశెనగ మిఠాయి తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో వేరుశెనగ గుళ్ళను వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. పల్లీలు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. పల్లీలు బాగా వేగాక స్టవ్ ఆపేసి, వాటిని చల్లారనిచ్చి, చేత్తో నలుపుతూ పొట్టు మొత్తం తీసేసి శుభ్రం చేసుకోవాలి.
-ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా కాకుండా, కొద్దిగా బరకగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మిఠాయి తినేటప్పుడు పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటుంది.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టి అందులో బెల్లం తురుము వేయాలి. బెల్లం కరగడానికి తగినన్ని నీళ్లు పోసి, మధ్యస్థ మంట మీద ఉడికించాలి. బెల్లం కరిగి పాకం చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి.
-పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఉడుకుతున్న బెల్లం పాకం ఒక చుక్క వేయండి. ఆ పాకం నీటిలో కరిగిపోకుండా, చేత్తో పట్టుకుంటే ఒక ఉండలా గట్టిగా వస్తే పాకం రెడీ అయినట్లే.
-పాకం రాగానే మంట తగ్గించి, ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వేరుశెనగ పొడిని అందులో వేసి బాగా కలపాలి. పాకం పల్లీలకు పూర్తిగా పట్టేలా కలుపుకుని స్టవ్ ఆపేయాలి.
-ఈ మిశ్రమాన్ని వేరొక వెడల్పాటి పళ్ళెంలోకి మార్చుకోండి. మీ రెండు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన ఆకారంలో గుండ్రటి లడ్డూల్లా లేదా చదునుగా బిళ్ళల్లా చేసుకోవాలి.
-తయారు చేసుకున్న వేరుశెనగ మిఠాయిలను ఒక అరగంట పాటు గాలికి ఆరనివ్వాలి. అవి చల్లబడి గట్టిపడిన తర్వాత కరకరలాడే వేరుశెనగ మిఠాయిలు తినడానికి రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
