Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి!
ఉరుకుల పరుగుల సమయంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం చేయాలంటే సమయం సరిపోదు. ముఖ్యంగా ఇడ్లీ, దోశ లేదా వేడి వేడి అన్నంలోకి సాంబార్ ఉంటే ఆ మజాయే వేరు. కానీ సాంబార్ అనగానే చాలా సమయం పడుతుందని అనుకుంటారు. కానీ కేవలం 15 నిమిషాల్లో, మీ సమయాన్ని ఆదా చేస్తూ అద్భుతమైన రుచితో కూడిన సాంబార్ ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఇన్ స్టంట్ సాంబార్ తయారీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు (లేదా త్వరగా ఉడికే పెసరపప్పు) - అర కప్పు
లేత మునగకాడ - 1
వంకాయ - 1
పెద్ద ఉల్లిపాయ - 1
సాంబార్ ఉల్లిపాయలు - 4 లేదా 5
టమాటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 3
సాంబార్ పొడి - 2 టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్, ఇంగువ - చిటికెడు
నూనె- 1 టేబుల్ స్పూన్
ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్ చొప్పున
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు -తగినంత
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే..
ఇన్ స్టంట్ సాంబార్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో పప్పును తీసుకుని, నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి, అందులో కడిగిన పప్పు, కొన్ని చిన్న ఉల్లిపాయలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి, మూతపెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-కుక్కర్ ప్రెషర్ తగ్గేలోపు, పక్కన మరో స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేయండి. నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి మారగానే, తరిగిన టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వండి. టమాటాలు మెత్తబడి గుజ్జులా మారుతున్న సమయంలో ముందుగా సిద్ధం చేసుకున్న మునగకాడ, వంకాయ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు కలపండి. ఇప్పుడు కూరగాయలకు సరిపడా కొద్దిగా ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ముక్కలను బాగా ఉడకనివ్వండి.
-కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి, పప్పుగుత్తితో పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఉడుకుతున్న కూరగాయల మిశ్రమంలో ఈ రుబ్బిన పప్పును వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్లుగా సాంబార్ పొడి, పసుపు, అవసరమైతే మరికాస్త ఉప్పు, నీళ్లు పోసి మంటను మీడియంలో పెట్టి మరిగించండి.
-సాంబార్ మరుగుతున్నప్పుడు వెలువడే సువాసనలకే మీ ఇంట్లో వారి కడుపు నిండిపోతుంది. కూరగాయలు పప్పుతో కలిసిపోయి సాంబార్ చిక్కబడిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో గుమగుమలాడే రుచికరమైన ఇన్ స్టంట్ సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
