Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా?
ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వయసు పైబడిన వారు లేదా సిగరెట్లు గుప్పుగుప్పున తాగేవాళ్లు. కానీ ఇప్పుడు నలభై ఏళ్ల లోపు ఉన్న యువతీయువకులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడుతున్న రోగులలో చాలామంది తమ జీవితంలో ఎప్పుడూ ఒక్కసారి కూడా సిగరెట్ ముట్టని వారే ఎక్కువగా ఉంటున్నారట.

అతిపెద్ద ముప్పు.. రోగ నిర్ధారణలో జాప్యమే
యువతలో ఈ వ్యాధి పట్ల ఉన్న అతిపెద్ద ప్రమాదం నిర్లక్ష్యం, అపోహ. యువకులు వారం వారం దగ్గుతో బాధపడుతున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, లేదా ఛాతీ నొప్పితో సతమతమవుతున్నా.. దానిని సాధారణ సమస్యగా కొట్టిపారేస్తారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చిన అలర్జీ అనో, ఆస్తమా అనో లేదా వైరల్ ఫీవర్ అనో తమకు తాము సర్దిచెప్పుకుంటారు. ఈ ఆలస్యం వల్ల క్యాన్సర్ లోపల సైలెంట్ గా శరీరమంతా ముదిరిపోతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వాల్సిందే
మూడు వారాలకు మించి ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్న దగ్గు.
దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం పడటం లేదా నోటి ద్వారా రక్తస్రావం.
ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా శరీర బరువు తగ్గిపోవడం.
తగినంత నిద్ర, విశ్రాంతి ఉన్నప్పటికీ విపరీతమైన అలసట, నీరసం ఆవహించడం.
ఛాతీలో ఏదో బరువు పెట్టినట్లు, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించడం.
స్మోక్ చేయకపోయినా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సిగరెట్ తాగడం అనేది ఒక ప్రధాన కారణమే కానీ అదొక్కటే కారణం కాదు. ఇతరులు వదిలే సిగరెట్ పొగను పీల్చడం, కలుషిత గాలిని పీల్చడం లాంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అంతేకాకుండా పని ప్రదేశాల్లో రసాయనాలు, హానికరమైన దుమ్ము, ధూళికి గురికావడం కూడా ముప్పును పెంచుతుంది.
వీటికి తోడు జన్యుపరమైన మార్పులు, కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉండటం కూడా యువతలో ఈ క్యాన్సర్ కు దారితీస్తున్నాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు ఖచ్చితమైన ట్రీట్మెంట్ కోసం మాలిక్యులర్ టెస్టింగ్ తప్పనిసరి అవుతోంది. దీని ద్వారా రోగికి సరిపోయే టార్గెటెడ్ ట్రీట్మెంట్ అందించి మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
ఆరోగ్యంగా ఉన్నామని నిర్లక్ష్యం వద్దు..
నేను రోజూ ఎక్సర్ సైజ్ చేస్తాను, మంచి పౌష్టికాహారం తీసుకుంటాను, కాబట్టి నాకు క్యాన్సర్ రాదు అనుకోవడం పొరపాటే. మంచి జీవనశైలితో ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోగలం కానీ వంద శాతం ముప్పును తప్పించుకోలేము. కాబట్టి శ్వాసకోశ సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే వయసును సాకుగా చూపి డాక్టర్ ను సంప్రదించడం మానకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
