Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
బెండకాయ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బెండకాయ ఫ్రై, పులుసు లేదా సాంబార్. ఎప్పుడూ ఇవే తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి బెండకాయతో ఒక సరికొత్త, అత్యంత రుచికరమైన వంటకాన్ని ప్రయత్నించండి. అదే పెరుగు బెండకాయ మసాలా గ్రేవీ. సాధారణంగా బెండకాయలోని జిగురు వల్ల కొంతమంది, ముఖ్యంగా పిల్లలు దీన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఒక్కసారి మీరు ఈ స్టైల్ లో పెరుగుతో గ్రేవీ చేసి పెట్టారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. వేడి వేడి అన్నంలోకే కాకుండా చపాతీ, రోటీ, నాన్, పూరీల్లోకి అద్భుతమైన కాంబినేషన్.

బెండకాయ గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
బెండకాయలు - పావు కిలో
నూనె - 2 టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - పావు టీస్పూన్
పెరుగు- 100 గ్రాములు
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
గ్రేవీ తయారీకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్ చొప్పున
కరివేపాకు - ఒక రెమ్మ
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - ఒక గ్లాసు
కొత్తిమీర - కొద్దిగా
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
బెండకాయ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేయాలి. అందులోనే కొద్దిగా పసుపు, పావు టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. బెండకాయలోని జిగురు పోయి, ముక్కలు కాస్త మెత్తబడే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో పుల్లగా లేని చిక్కటి పెరుగును తీసుకోండి. అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు దోరగా వేయించాలి.
-ఇప్పుడు అందులో ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. మంటను పూర్తిగా సిమ్ లో పెట్టి, ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని అందులో పోసి గరిటెతో కలుపుతూనే ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూతపెట్టి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మూత తీసి ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసి బాగా కలపండి. గ్రేవీకి తగినట్లుగా ఒక గ్లాసు నీళ్లు పోసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి, నూనె పైకి తేలి గ్రేవీ చిక్కబడే వరకు మీడియం మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించండి.
-చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే పెరుగు బెండకాయ మసాలా గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
