Latest Updates
-
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే..
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం!
మన సమాజంలో సాధారణంగా ఒక బలమైన అపోహ ఉంటుంది. తరగతి గదిలో ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చుని, మంచి మార్కులు లేదా ర్యాంకులు తెచ్చుకునే వారే జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు అని చాలామంది నమ్ముతారు. కానీ మార్కులకు, కెరీర్ విజయానికి ఎలాంటి సంబంధం లేదని, వెనుక బెంచీలో కూర్చుని అల్లరి చేసే ఒక సగటు విద్యార్థి కూడా చరిత్ర సృష్టించగలరని గతంలో అనేకమంది నిరూపించూరు.

ఇప్పుడు ఆ జాబితాలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన త్రిప్తి కల్హన్స్ చేరింది. భారతదేశంలోనే అత్యంత కఠినమైన యూపీఎస్సీ (UPSC) పరీక్షను ఛేదించి, ఒక బ్యాక్ బెంచర్ సివిల్ సర్వెంట్‌గా ఎలా ఎదిగిందో తెలిపే ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం.
ఎవరీ త్రిప్తి కల్హన్స్?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాకు చెందిన త్రిప్తి కల్హన్స్ నేపథ్యం చాలా సాధారణమైనది. ఆమె తన స్కూల్ ఎడ్యుకేషన్ ని ఫాతిమా సీనియర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్లి, ప్రసిద్ధ ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కమలా నెహ్రూ కాలేజి నుంచి బీకామ్ పట్టా అందుకుంది.
స్కూల్, కాలేజీ రోజుల్లో త్రిప్తి ఎప్పుడూ పుస్తకాల పురుగు కాదు. తరగతి గదిలో ఎప్పుడూ వెనుక బెంచీలో కూర్చుని స్నేహితులతో కబుర్లు చెప్పడం, ఆటల మీద ఆసక్తి చూపడం ఆమె నైజం. చదువులో ఆమె ఒక సగటు విద్యార్థిని మాత్రమే. కానీ త్రిప్తి ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉండేది. వెనుక బెంచీలో కూర్చునే వారికి కోల్పోవడానికి ఏమీ ఉండదనే ధైర్యం ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, భయం లేని తత్వం వారిలో పుష్కలంగా ఉంటాయి అని ఆమె బలంగా నమ్మేది. ఆ ధైర్యమే ఆమె చేత ఐఏఎస్ అవ్వాలనే అతిపెద్ద కలను కనేలా చేసింది.

ఓటముల పరంపర.. విజయ గర్జన
సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత త్రిప్తికి ఆ ప్రయాణం పూలపాన్పు కాలేదు. ఒక సగటు విద్యార్థినిగా యూపీఎస్సీకి సన్నద్ధం కావడం అంత సులువైన విషయం కాదు. ఆరంభంలో ఆమె ఏకంగా వరుసగా నాలుగు సార్లు పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఈ వరుస వైఫల్యాలతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. నా లాంటి యావరేజ్ స్టూడెంట్ కు ఇంత పెద్ద సాహసం అవసరమా? నా వల్ల అవుతుందా? అని తనను తాను ప్రశ్నించుకుని కుంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అపజయం ఆమెను ఆపలేకపోయింది. ప్రతి ఓటమి, దేశానికి సేవ చేయాలనే ఆమె పట్టుదలను, సంకల్పాన్ని మరింత రగిలించింది.
విజయాన్ని తెచ్చిపెట్టిన వ్యూహం ఇదే..
నాలుగుసార్లు విఫలమైన తర్వాత త్రిప్తి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా టాపర్లు చెప్పే మూస పద్ధతులను గుడ్డిగా అనుసరించే విధానాన్ని విడిచిపెట్టింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని రచించుకుంది.
క్వాంటిటీ కాదు.. క్వాలిటీ: రోజుకు 15-16 గంటలు చదివేయాలనే ఒత్తిడిని పక్కనపెట్టి, చదివే కొద్ది గంటలైనా పూర్తి ఏకాగ్రతతో, నాణ్యమైన పద్ధతిలో చదవడం ప్రారంభించింది.
బట్టీ పట్టడం మానేసింది: పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లుగా కంఠస్థం చేయడం మానేసి, ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. దానిని తన సొంత మాటల్లో రాయడం అలవాటు చేసుకుంది.

డిజిటల్ డిటాక్స్: యూపీఎస్సీకి ఏకాగ్రత ప్రాణం లాంటిది. అందుకే త్రిప్తి తన పక్కన మొబైల్ ఫోన్ లేకుండా జాగ్రత్తపడింది. సోషల్ మీడియా అనే పరధ్యానానికి ఆమడ దూరంలో ఉండి తన లక్ష్యంపై మాత్రమే గురి పెట్టింది.
ఈ క్రమశిక్షణ, మారిన వ్యూహమే ఆమెను ఐదో ప్రయత్నంలో 2023లో ఆల్ ఇండియా 199 ర్యాంక్ తో విజయతీరాలకు చేర్చాయి. ఐఏఎస్ సాధించి సగర్వంగా నిలబడేలా చేశాయి.
గతం ఎలా ఉన్నా, మీరు టాపర్ అయినా లేదా బ్యాక్‌బెంచర్ అయినా... చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, సరైన వ్యూహం ఉంటే ఏ శిఖరాన్నైనా చేరుకోవచ్చు. అకడమిక్ మార్కులు మీ భవిష్యత్తును నిర్ణయించలేవు, మీ సంకల్ప బలం మాత్రమే మీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది అనడానికి త్రిప్తి జీవితమే సజీవ సాక్ష్యం.



Click it and Unblock the Notifications
