Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఎటు చూసినా కష్టాలే..జేబులో రూ,50తో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు..నేడు వేల కోట్లకు ఓనర్
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. బాల్యంలోనే తండ్రి మరణం. తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది. ఎటు చూసినా కన్నీళ్లు,కష్టాలే. అయినా మనసులో ఏదో తపన..గట్టిగా సాధించాలి అని. కష్టీలను భరిస్తూ,కన్నీళ్లను దిగమింగుకుంటూ ఇంట్లో రూ.50 తీసుకొని వెళ్లిపోయాడు. కట్ చేస్తే నేడు రూ.17వేల కోట్ల కంపెనీకి ఓనర్ అయ్యాడు. వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అతడే పుట్టన్ నడువక్కట్ చంతమారక్ష మీనన్. షార్ట్ కట్ లో P.N.C మీనన్ అని ఇతడిని పిలుస్తారు.
కేరళ రాష్ట్రంలోని పాల్ఘాట్ లో వ్యవసాయ కుటుంబంలో 1948 నవంబర్ 17న జన్మించిన మీనన్..10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఐదుగురి సంతానంలోని నాలుగోవాడైన మీనన్..ఆర్థిక కష్టాల మధ్యనే ఎలాగోలా ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. అయితే కుటుంబ పరిస్థితి కారణంగా కాలేజీ చదువులు చదలేక పోయాడు. బీకాం మధ్యలో డ్రాపవుట్ అయ్యాడు. అయితే మీనన్ లోని ఆశలు మాత్రం చావలేదు. తనకు ఇష్టమైన ఇంటీయర్స్, డిజైనింగ్ కి సంబంధించి చిన్న చిన్న సంస్థల్లో జాబ్ చేస్తుండేవాడు. 1970ల ప్రారంభంలో ఉడెన్ ఫర్నీచర్ తయారుచేసే షాపు పెట్టాడు.

మీనన్ కి 28 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కొచ్చిలోని ఓ హోటల్ లో ఒమాన్ ఆర్మీలో కెప్టెన్ అయిన సులైమాన్ అల్ అద్వాయిని కలిసే అవకాశం వచ్చింది. ఓ ఫిషింగ్ బోటు కొనేందుకు అద్వాయి కేరళకు వెళ్లాడు. ఆ సమయంలో అతడిని మీనన్ కలిశాడు. ఒమాన్ వచ్చెయ్యి అక్కడ బాగుంటుంది అని మీనన్ ని అద్వాయి ఎంకరేజ్ చేశాడు. ఆ ఆహ్వానం మీనన్ లైఫ్ ని మార్చేసింది. జేబులో రూ.50 రూపాయలతో ఒమాన్ లో మీనన్ అడుగుపెట్టాడు. ఎలాగోలా ఓ ఇంటీరియర్ డెకోర్ సంస్థను ప్రారంభించిందేకు బ్యాంకు నుంచి రూ. 3వేల రియాల్స్ లోన్ పొందాడు. 4-5 ఏళ్లలోనే పెద్ద పెద్ద క్లయింట్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి.
ఒమన్ దేశంలో చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టాడు. రాయల్ ప్యాలెస్ లకు ఇంటీరియర్ చేపట్టే స్థాయికి ఎదిగాడు. ఆయన డిజైన్ నైపుణ్యం.. ఒమన్ లోని సుల్తాన్ ఖబస్ మసీదు, అల్ బస్తాన్ ప్యాలెస్ వంటి ల్యాండ్ మార్క్ నిర్మాణల సృష్టికి దోహదపడటంతో ఆయన విజయం ఉన్నత శిఖరాలకు చేరింది. ఇంటీరియర్ డిజైన్ లో ఎలాంటి కోర్సు చేయకపోయినప్పటికీ మీనన్ ఆర్కిటెక్చరల్ నైపుణ్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి విస్తరించింది.
తర్వాత ఆయన కన్ను రియల్ ఎస్టేట్ మీద పడింది. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉందని గ్రహించాడు. 1995లో సౌతిండియాలో తన భార్య పేరు మీద శోభా డెవలపర్స్(శోభా లిమిటెడ్) అనే కంపెనీ పెట్టాడు. 2008లో బెంగళూరులో మొట్టమెదటి ఇన్ఫోసిస్ క్యాంపస్ డిజైన్ కోసం నారాయణ మూర్తి మీనన్ ని సంప్రదించాడు. భారత్ లోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఇదొకటి. ప్రస్తుతం శోభా లిమిటెడ్ మార్కెట్ క్యాపిటైజేషన్ రూ. 17,225గా ఉంది.
మీనన్ తన సొంతరాష్ట్రంలో పలు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రఖ్యాత ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని కూడా మీనన్ అందుకున్నారు.



Click it and Unblock the Notifications
