Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
రూ.10వేల జీతంతో కెరీర్ స్టార్ట్..నేడు వందల కోట్ల కంపెనీకి అధిపతి..ఒక చిన్న ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది
ఎవరి జీవితం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ రోజు పేదవాడుగా ఉన్న వ్యక్తి సడెన్ గా రేపు కోటీశ్వరుడుగా మారవచ్చు..ఈ రోజు కోటశ్వరుడుగా ఉన్న వ్యక్తి రేపటికి బికారిగా కూడా మారవచ్చు. బలమైన సంకల్పం ఉండే ఐదైనా సాధించవచ్చు అని మన పెద్దలు తరచూ చెబుతుంటారు. దానికి పర్ఫెక్ట్ ఉదారహణ నిలుస్తాడు బ్యాంకిట్ వ్యవస్థాపకుడు అమిత్ నిగమ్. కేవలం 10వేల రూపాయల జీతంతో కెరీర్ ప్రారంభించిన అమిత్.. వందల కోట్ల రూపాయల కంపెనీకి ఓనర్ గా మారాడు. అసలు ఇదెలా సాధ్యం అయ్యిందో ఇప్పుడు చూద్దాం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కు చెందిన అమిత్ నిగమ్ ఒక ఉన్నత కుటుంబంలోనే జన్మించారు. అమిత్ కుటుంబంలో బ్యూరోక్రాట్స్, లాయర్స్,జడ్జిలు ఉన్నారు. అమిత్ నాన్న అలహాబాద్ హైకోర్టులో సీనియర్ లాయర్. దీంతో అమిత్ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని ఇంట్లో వాళ్లు కోరుకునేవాళ్లు. అయితే అమిత్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండేవి. మేనేజ్ మెంట్ రంగంపై అమిత్ కు ఇంట్రెస్ట్ ఉండేది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు.

అలహాబాద్ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడైన అమిత్ నోయిడాలోని IIPM నుంచి మార్కెటింగ్ లో PGDM పూర్తి చేశాడు. 1993లో కేవలం రూ.10000 జీతంలో మేనేజ్ మెంట్ ట్రైనీగా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎస్కోటెల్, ఉష వంటి కంపెనీల్లో పనిచేసి తన స్కిల్స్ ను చాలా పెంచుకున్నాడు. ఎయిర్ టెల్ లో చేరిన తర్వాత ఆయన జీవితం మలుపుతిరిగింది. ఎయిర్ లెట్ లో ఎనిమిదేళ్ల పాటు సేల్స్ అండ్ మార్కెంట్ డిపార్ట్ మెంట్ కి హెడ్ గా పనిచేశాడు. ఎయిర్ టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్ తో కలిసి పనిచేయడం అమిత్ కు చాలా అనుభవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత స్పైస్ మనీ అనే ఫిన్ టెక్ కంపెనీని మరికొందరితో కలిసి స్థాపించి వ్యవస్థాపక ప్రయాణానికి బీజం వేశారు.
అయితే 10 ఏళ్ల క్రితం దాకా మనదేశంలో చాలామంది గ్రామీణులు,పేదవాళ్లు బ్యాంకు సేవలకు దూరంగానే ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం, బ్యాంకులకు వెళ్లే సౌకర్యాలు లేకపోవడం వంటివి కారణాలుగా ఉండేటివి. అయితే ఈ సమస్యను అమిత్ నిగమ్ గుర్తించారు. టెక్నాలజీ ద్వారా వారికి సర్వీప్ అందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2016 స్పైస్ మనీ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు. 2017లో తన సొంత సంస్థ బ్యాంకిట్ ను ప్రారంభించాడు.
కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఈ చిన్న ఆలోచన నేడు వేల మందికి ఉద్యోగాలకు కల్పిస్తూ లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అమిత్ స్థాపించిన బ్యాంకిట్ కంపెనీ..డిజిటల్ చెల్లింపులు, మనీ ట్రాన్స్ ఫర్, ఇతర ఆర్థిక సేవలకు ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కేవలం 5 ఏళ్లలోనే ఈ కంపెనీ అద్భుమైన వృద్ధి సాధించింది నేడు రూ.150 కోట్ల టర్నోవర్ అందుకుంది. సరైన ఆలోచన, పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని చెప్పేందుకు అమిత్ గొప్ప ఉదాహరణగా నిలిచారు.



Click it and Unblock the Notifications