Latest Updates
-
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది?
కన్న కూతురికి పంగనామం పెట్టి అల్లుడిని పెళ్లాడిన అత్త..టీవీ సీరియల్స్ ను మించిన మసాలా లవ్ స్టోరీ!
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయని అంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ వింత వివాహ బంధం గురించి వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. భార్యతో మనస్పర్థలు వస్తే విడిపోవడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ ఒక అల్లుడు మాత్రం భార్యను వదిలేసి ఏకంగా కన్న అత్తగారినే కోర్టులో వివాహం చేసుకున్నాడు. ఎక్కడో సినిమాల్లో, సీరియల్స్‌లో కూడా ఊహించని ఈ అసాధారణ ఘటన ఇప్పుడు స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

వైరల్ వీడియోలో ఏముందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ పరిధిలో ఉన్న అక్బర్ పూర్ ప్రాంతానికి చెందిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. అసలేం జరిగిందంటే.. ఒక యువకుడు, అతని అత్తగారు ఒకరి మెడలో మరొకరు పూలమాలలు వేసుకుని, చేతిలో మ్యారేజ్ సర్టిఫికెట్ పట్టుకుని ఫోజులిచ్చిన వీడియో ఒకటి ఆన్ లైన్‌లో ప్రత్యక్షమైంది.
ఆ వీడియోలో వాళ్లు నవ దంపతుల్లా ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించారు. దానికి తోడు ఒక రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ యాడ్ చేసి, అక్బ ర్ పూర్ లో అత్తను పెళ్లాడిన అల్లుడు అనే క్యాప్షన్‌తో నెట్టింట వదిలారు. అంతేకాదు, తమది పరస్పర అంగీకారంతో జరిగిన వివాహమని, ఈ సమాజం తమ బంధాన్ని అంగీకరించి, మనసారా ఆశీర్వదించాలని ఆ అత్తాఅల్లుళ్లు నెటిజన్లను కోరడం ఈ వ్యవహారంలో మరో కొసమెరుపు.
అల్లుడికి అత్తపై మనసెలా మళ్లింది?
స్థానికులు, నివేదికలు చెబుతున్న వివరాల ప్రకారం.. సదరు యువకుడికి ముందుగా ఆ మహిళ కూతురితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అత్తగారి ఇంటికి రాకపోకలు సాగిస్తున్న క్రమంలో అత్తాఅల్లుళ్ల మధ్య చనువు పెరిగి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసిందని సమాచారం. చాలాకాలంగా వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారని స్థానికులు గమనించారు. క్రమంగా ఆ బంధం ముదిరి, సొంత భార్యను వదిలించుకుని కన్న అత్తను కోర్టులో పెళ్లి చేసుకునే స్థాయికి చేరింది.
సోషల్ మీడియాలో భగ్గుమంటున్న నెటిజన్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ విపరీత చర్యను చూసి నవ్వుకుంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమాజం ఎటు పోతోంది? వావి వరసలు లేకుండా ఇదేం దిక్కుమాలిన బంధం? అంటూ నైతికతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అలీ గఢ్ లో జరిగిన ఇలాంటి ఘటనే ఇప్పుడు కాన్పూర్‌లో పునరావృతం కావడం అందరినీ కలవరపెడుతోంది.
పోలీసుల దర్యాప్తు.. ఆధారాల అన్వేషణ
వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మోసపోయిన భార్య (ఆ మహిళ కూతురు) వైపు నుంచి గానీ, ఇతర కుటుంబ సభ్యుల నుంచి గానీ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. ఈ కోర్టు వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు, అధికారిక పత్రాలు ఇంకా వెలుగులోకి రాలేదు.



Click it and Unblock the Notifications