Latest Updates
-
బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా.. -
భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు! -
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి -
చికెన్ కబాబ్ బిర్యానీ..ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎప్పుడూ తిని ఉండరు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
మూత్ర విసర్జన చేసిన వెంటనే మళ్లీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అసలు కారణాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే -
ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్ జెండర్ -
ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! -
చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి!
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే!
భూమి మీద మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయని అడిగితే, అధికారిక రికార్డుల ప్రకారం 195 దేశాలు ఉన్నాయని ఎవరైనా టక్కున సమాధానం చెబుతారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం వీటిలో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉండగా, వాటికన్ సిటీ, పాలస్తీనా సభ్యత్వం లేని రెండు దేశాలు.
కానీ ఈ విశాల ప్రపంచంలో కొన్ని దేశాలు దేశాలకు వరల్డ్ మ్యాప్ లో స్థానమే లేదు. మీరు బహుశా ఎప్పుడూ విని ఉండని, ప్రపంచ పటంలో కనిపించని ఆ ఆసక్తికరమైన దేశాలు ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ చూడండి.

ట్రాన్స్ నిస్ట్రియా
అధికారికంగా ప్రిడ్నెస్ట్రోవియన్ మోల్డావియన్ రిపబ్లిక్ అని పిలువబడే ట్రాన్స్ నిస్ట్రియా.. గుర్తింపు లేని ఒక విడిపోయిన దేశం. అంతర్జాతీయంగా దీనిని మోల్డోవాలో భాగంగానే పరిగణిస్తారు. 1990లో ఏర్పడిన ఈ దేశం ప్రపంచ పటంలో ఎక్కడా లేదు, కానీ దీనికి సొంత సైన్యం, కరెన్సీ, జెండా ఉండటం విశేషం.
సోమాలిలాండ్
1990వ దశకం ప్రారంభంలో సోమాలియాలో తలెత్తిన రాజకీయ గందరగోళం, పౌర అశాంతి తర్వాత, దేశంలోని వాయువ్య భాగం తనను తాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. దీనినే సోమాలిలాండ్ అంటారు. ఈ దేశానికి కూడా స్వంత కరెన్సీ, జెండా ఉన్నాయి. అయినా ఇది ఏ ప్రపంచ పటంలోనూ కనిపించదు.
ఇరాకీ కుర్దిస్తాన్
1970 నుండి ఇరాక్ లో భాగంగా ఉంటూనే, ఒక స్వతంత్ర దేశంలా ఉనికిలో ఉన్న ప్రాంతం ఇరాకీ కుర్దిస్తాన్. ఈ దేశం ఇరాక్ లోపలే ఉన్నప్పటికీ, దీనికి సొంత ప్రభుత్వం, సైన్యం, జెండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం.
పశ్చిమ సహారా
మనలో చాలా మందికి సహారా ఎడారి గురించి తెలుసు. కానీ పశ్చిమ సహారా అనేది ప్రపంచ దృష్టికి కనపడని ఒక చిన్న దేశం. ఆఫ్రికన్ యూనియన్ లో భాగమైన ఈ దేశం ఎన్నో ఏళ్లుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నా, ఏ వరల్డ్ మ్యాప్ లోనూ కనిపించదు.

అబ్ఖాజియా
ఒకప్పుడు జార్జియాలో భాగంగా ఉన్న ఈ దేశం.. సోవియట్ యూనియన్ పతనం తర్వాత స్వాతంత్ర్యం పొందింది. ఫలితంగా, ఇది 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినప్పటికీ, ప్రపంచ పటంలో దీనికి ఎక్కడా చోటు దక్కలేదు.
సెబోర్గా
ఇటలీలో వాటికన్ సిటీ వంటి అనేక చిన్న దేశాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ పరిమాణంలో మాత్రమే వైశాల్యం ఉన్న సెబోర్గా అనే అతి చిన్న దేశాన్ని ఈ పటాలలో ఏవీ చేర్చలేదు.స
పుంట్ లాండ్
సోమాలిలాండ్ లాగానే, పుంట్ లాండ్ కూడా సోమాలియా నుండి విడిపోయిన మరో చిన్న దేశం. సోమాలిలాండ్ మాదిరిగానే, ఈ దేశం కూడా ఏ ప్రపంచ పటంలోనూ కనిపించదు.



Click it and Unblock the Notifications
