Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
బంగారం రేట్లు మరింత తగ్గుతాయా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి అంచనా!
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పసిడి అంటే వారికి ప్రాణం. అంతేకాకుండా సామన్య భారతీయులు దీనిని ఒక ఆస్తిగా కూడా భావిస్తారు. ఏదైనా అనుకోని ఆర్థిక అవసరాలు లేదా ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుకుపెట్టుకొని లోన్స్ తెచ్చుకుంటారు.
అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయి. రోజుకో కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు చేరాయి. కానీ ఎప్పుడైతే అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయో అప్పటి నుంచి ఈ పసిడి పరుగుకు కాస్త బ్రేక్ పడింది.

ముఖ్యంగా గత వారం రోజులుగా బంగారం ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? మరింత తగ్గుతాయా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని చెప్పిన ఓ సంచలన జోస్యం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రశాంత్ కిని అంచనాలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయి. గత జనవరి నెలలో పసిడి ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. ఆయన చెప్పినట్లే బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగాయి.
అయితే ప్రస్తుత పరిస్థితులపై ఆయన మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరల హెచ్చుతగ్గుల గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే గోల్డ్ రేట్లు ఒక దారికి వస్తాయి. రాబోయే నెలలో ధరలు తగ్గి, ఒక నిర్దిష్టమైన రేటు వద్ద పసిడి స్థిరపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు.
ఆయన అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 11,000 నుంచి రూ. 12,000ల వద్ద స్థిరపడే అవకాశం ఉందని తెలిపారు.
ఇదే క్రమంలో అమెరికా గురించి కూడా ఆయన కీలక హెచ్చరికలు చేశారు. అమెరికాను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. ప్రపంచ మార్కెట్లను శాసించే సత్తా వారికి ఉంది. వారు తలచుకుంటే నిమిషాల్లో ఏదైనా చేయగలరు. అవసరమైతే బంగారం ధరను అట్టడుగు స్థాయికి పడగొట్టే శక్తి సామర్థ్యాలు అగ్రరాజ్యం వద్ద ఉన్నాయి అని ప్రశాంత్ కిని విశ్లేషించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
బంగారం సంగతి పక్కన పెడితే.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే, ఈ భయంకరమైన ఇంధన సంక్షోభం గురించి ప్రశాంత్ కిని గతేడాదే ఆయన అంచనా వేశారు.



Click it and Unblock the Notifications
