తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది!

ఇల్లంతా శోక సంద్రంలో మునిగిపోయింది. అందరి కళ్లల్లో నీళ్లు వస్తన్నాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ సంప్రదాయల ప్రకారం మహిళలు తుది సంస్కరాలు నిర్వహిస్తున్నారు. అయితే చనిపోయిన మహిళ నోట్లో తులసి నీళ్లు పోయగానే ఆమెకు ప్రాణం తిరిగొచ్చింది. ఇదంతా చూసి అక్కడున్నవాళ్లు షాక్ అయ్యారు, క్షణం తర్వాత తేరుకొని సంతోషపడ్డారు. సాధారణంగా సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ లో నిజంగానే జరిగింది.

అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌ పూర్‌ లో బర్హల్‌ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా దఖిలి గ్రామానికి చెందిన శివమూర్తి యాదవ్ భార్య లలితా దేవి (56)కి తీవ్ర జ్వరం వచ్చింది. ఏం కాదులే అనుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంట్లోనే ఉండిపోయింది. వారం రోజులకి ఆమె పరిస్థితి తీవ్రతరమైంది. దీంతో కుటంబసభ్యులు ఆమెను పిధాని కూడలి సమీపంలోని ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. మంగళవారం నాటికి పరిస్థితి విషమించడంతో బర్హల్‌ గంజ్‌లోని మరో హాస్పిటల్ కు తరలించారు.

Gorakhpur Miracle Woman Declared Dead Wakes Up After Tulsi Water Poured in Mouth

ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) జరిగి ఉండొచ్చని అనుమానించిన డాక్టర్లు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను మెరుగైన ట్రీట్మెంట్ కోసం గోరఖ్‌ పూర్‌ నగరంలోని ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత, బుధవారం నాడు ఆమెకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లు.. లలితా దేవి అప్పటికే మరణించిందని నిర్ధారించారు. అంత్యక్రియల కోసం భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. ఈ పిడుగు లాంటి వార్తతో బంధువులంతా కన్నీరుమున్నీరవుతూ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం నాడు దహన సంస్కారాల కోసం కట్టెలు కూడా తీసుకొచ్చారు.

Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..

అయితే హిందూ సంప్రదాయం ప్రకారం నోట్లో గంగాజలం, తులసి ఆకులు వేయగానే ఆమె దగ్గడం ప్రారంభించింది. ఆమె కడుపులో ఊపిరి తీసుకుంటున్నట్లుగా స్పష్టమైన కదలికలు కనిపించాయి. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యంతో పాటు, ఆనందంతో ఉప్పొంగిపోయారు. బతికిందన్న ఆశతో, క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను బీఆర్డీ (BRD) మెడికల్ కాలేజీకి పరుగులు తీశారు.

ప్రస్తుతం లలితా దేవికి బీఆర్డీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుతోంది. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. నోట్లో పోసిన తులసి తీర్థమే ఆపద్బాంధవిలా ఆమెకు ప్రాణం పోసిందని కొందరు అంటుంటే.. ఇది ముమ్మాటికీ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ల ఘోర నిర్లక్ష్యమేనని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలతో ఉన్న మహిళను ఏ రకమైన పరీక్షలు చేసి చనిపోయిందని ప్రకటించారోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజంగా ఆమెకు తులసి ఆకు వల్లే ప్రాణాలు తిరిగొచ్చాయా అనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగని, అసలు ప్రాణాలతో ఉన్న ఆమెను మృతపడినట్లు ఎందుకు ప్రకటించారన్న దానిపై ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Story first published: Friday, October 16, 2026, 18:39 [IST]
Desktop Bottom Promotion