Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కేరళ బీచ్ రాళ్ల మధ్యలో పడ్డ ఐఫోన్.. పోలీసులు 7 గంటల ఆపరేషన్ తరువాత..!
ఐఫోన్‌కు విలువ మనిషికి లేదనే కొత్త సామెతను మనం ఎక్కడో వినే వుంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనే కేరళలో జరిగింది. ఓ మహిళక సంబంధించిన ఐఫోన్ సముద్రం వల్ల రాళ్లమధ్యలో ఇరుక్కుపోయి ఎక్కడో పడిపోయింది. విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు, 7 గంటల ప్రత్యేక ఆపరేషన్ తరువాత ఆ ఐపోన్‌ను బయటకు వెలికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్లు కూడా ఈ సంఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
కర్నాటకకు చెందిన ఓ మహిళు కేరళ సముద్ర తీరంలో వుండే వర్కాలాకు వచ్చింది. అక్కడ వర్కాలాలో వుండే బీచ్‌లో ఎంజాయ్ చేసింది. ఆమె తనవెంట రూ,1,50,000 ల విలువ చేసే ఐఫోన్‌ను కూడా బీచ్ వద్దకు తెచ్చింది. బీచ్‌లో అడుకుంటూ వుండగా ఆ ఐఫోన్ అక్కడ వున్న రాళ్ల మధ్యలో పడిపోతంది. దీంతో ఆమె వెంటనే కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె కాల్ చేయడంతో కేరళ పోలీసు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తాళ్లు, కట్టెల సాయంతో పోలీస్ సిబ్బంది రాళ్లమధ్యలోంచి ఐఫోన్ తీయడానికి అష్టకష్టాలు పడ్డారు. దీనికోసం అక్కడ వున్న రిసార్ట్ సిబ్బంది సాయాన్ని కూడా తీసుకున్నారు. దాదాపు ఏడుగంటల పాటు రాళ్ల మధ్యలోంచి ఐఫోన్‌ను తీయడానికి కృషి చేశారు. ఫోన్ పడిన రాళ్ల వద్దకు సముద్రం అలలు వచ్చి తాకడం, ఈదురు గాలులు వీయడం, ఈ పరిస్థితుల మధ్య ఐఫోన్‌ను వెతకడం కేరళ ఫైర్ సిబ్బందికి పెద్ద చాలెంజ్‌గానే పరిణమించింది.
ఈ సంఘటనను అక్కడ వున్న రిసార్ట్ తన అధికారిక సోషల్ మీడియా ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయడంతో బాగా వైరల్‌గా మారింది. అయితే దీనిపై నెజిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఐఫోన్ కోసం కేరళ ఫైర్ సిబ్బందిని వాడుకోవడమంటే ప్రజల డబ్బులను, సమయాన్ని వృదాచేయడమేనని అన్నారు. ఇలాంటి పనుల వల్ల ప్రజలు కట్టిన ట్యాక్ష్ మొత్తం వృధాగా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొక యూజర్ స్పందిస్తూ తనకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని అన్నాడు. ప్రజలు తప్పిపోతే ఇంత శ్రద్ధ పెట్టని కేరళ ఫైర్ సిబ్బంది, ఒక ఐఫోన్ పోతే ఇంతగా శ్రమించడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
ఈ సంఘటనలో పోలీసులు కొంచం అతిగా ప్రవర్తించారని కొందరు నెటిజెన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తున్నారు. రూ.1 లక్షా 50 వలే ఐఫోన్ కోసం పోలీసులు ఫైర్ సిబ్బందిని వెంటవేసుకొని రావడం, తాళ్ల సాయంతో 7 గంటలపాలు అప్పటికప్పుడు ఆపరేషన్ చేపట్టడం వల్ల ఆమెకు తప్ప ఎవరికీ లాభం లేదని అంటున్నారు. దీని వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, అనవసరంగా ప్రజల పన్నుల డబ్బు వృధా అవడం తప్పితే ఇందులో హర్షించదగ్గ విషయమం ఏదీ లేదని వారంటున్నారు.
ఈ మధ్య చాలా మంది చిన్నారులు, ఆడపిల్లలు తప్పిపోతున్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు. ఇలాంటి కేసుల్లో పోలీసులు అంత శ్రద్ధ ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు. ఐఫోన్ విషంలో స్పందించినట్లు పోలీసులు మనుషులు తప్పిపోయిన విషయంపై స్పందిస్తే చాలా మంది ప్రాణాలు దక్కుతాయని నెటిజెన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications