Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
రామాయణంలో శ్రీరాముడు లంకలో ఉన్న సీతను కలవడానికి సముద్రం మధ్యలో వారధి కట్టాడని పురాణాలు స్పష్టం చెబుతున్నాయ్. ఆ వారదే ఇప్పుడు మనము చెప్పుకుంటున్న శ్రీలంకకు, భారత్‌కు మధ్యనున్న ఆడమ్స్ బ్రిడ్జ్. వందల సంవత్సరాలను దీనిపై అనేక చర్చ జరుగుతోంది. ఈ ఆడమ్స్ బ్రిడ్జ్‌నే మనము రామసేతుగా గుర్తిస్తాము. ఈ ఆడమ్స్ బ్రిడ్జ్‌ను పాక్ స్ట్రెయిట్ అని కూడా పిలుచుకుంటాం. ఇది నిజంగా శ్రీరాముడే కట్టాడా, మనుషులు నిర్మించినదా లేక సహజంగా ఏర్పడిందా అనే దానిపై వివాదాలు, గొడవలు చెలరేగుతూనే ఉన్నాయ్.

కార్బన్ డేటింగ్ మిస్టరీ
ఆడమ్స్ బ్రిడ్జ్‌గా చెప్పబడే రామసేతుపై పరిశోధకులు కార్బన్ డేటింగ్ పరీక్షను చేపట్టారు. కార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణాల వయసు తెలుస్తోంది. ఆ రిపోర్టులో రామసేతును క్రీస్తు పూర్వం 5వేల సంవత్సరం క్రితం నిర్మించినట్లు బయటపడింది. రామాయణం కూడా సరిగ్గా అప్పుడే జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయ్. సీతను విడపించడానికి కట్టిందే రామసేతు అని అందుకే రామభక్తులు బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు.
రామసేతు నిర్మాణం
రామాయణం కేవలం కల్పితమే రాముడు సీత కోసం తేలియాడే రాళ్లతో వారధిని నిర్మించలేదని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న వారధిని కాదని అనలేము. అయితే ఈ రామసేతు నిర్మాణం అసలు ఎలా జరిగిందనేదానిపై మరింత స్పష్టత రావలసి ఉంది.
నడవగలిగేలా రామసేతు వారధి
16వ శతాబ్దం వరకు కూడా రామసేతు వారధిపై మనుషులు సురక్షితంగా నడిచే పరిస్థితి ఉండేదని చరిత్ర చెబుతోంది. సముద్ర మట్టం కొంత పెరగడం వల్ల మూడు ఫీట్ల లోతులో ఉన్న రామసేతు బ్రిడ్జ్ ఇప్పుడు 30 ఫీట్ల లోతులో ఉందని అంటున్నారు.
ఫిప్స్ వెళ్లే పరిస్థితి లేదు
రామసేతు బ్రిడ్జ్ చుట్టుపక్కల నుంచి షిప్స్ వెళ్లే పరిస్థితి లేదు. సముద్రంలో రామసేతు బ్రిడ్జ్ తక్కువ లోతులో ఉండడం వల్ల ఓడల రవాణాకు అంతరాయం కలుగుతోంది. కాబట్టి భారత్, శ్రీలంకకు సంబంధించిన ఓడలు రామసేతు గుండా ప్రయాణించడానికి వీలు లేకుండా ఉంది.
సేతు సముద్రం ప్రాజెక్టు
సేతు సముద్రం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని రామభక్తులు కోరుకుంటున్నారు. భారత్‌లోని పంబన్ దీవి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలిపే సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామభక్తులుఈ ప్రాజెక్టును చేపట్టవద్దని, ప్రాజెక్టు వల్ల రామసేతును కూల్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తేలియాడే రాళ్లు
రామాయణంలో శ్రీరాముడి నామం రాళ్లపై రాసినప్పుడు ఆ రాళ్లు తేలి అవే రాళ్లు సముద్రంపై వారధిగా నిలిచాయని పురాణం చెబుతోంది. అలాంటి తేలియాడే రాళ్లు ఎన్నో మనము రామేశ్వరం వద్ద చూడవచ్చు. అయితే అగ్ని పర్వతానికి సంబంధించిన కొన్ని రాళ్లకు శాస్త్రీయంగా తేలియాడే సామర్ధ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
