Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 లో ఆకట్టుకొన్న ట్రైబల్ డిజైన్స్
ప్రతి సంవత్సరలో వచ్చే లాక్మే ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ క్యాలెండర్ లో ఒక పెద్ద ఈవెంట్. ఈ ఫ్యాషన్ వీక్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఎందుకంటే ఈ ఫ్యాషన్ వీక్ కోసం చాలా మంది ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. వివిధ రకాల డిజైన్లను కంపేర్ చేయడానికి, ఆకట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 మొదటి రోజున ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్స్ తో మెస్మరైజ్ చేశారు. మనం ముందుగా అనుకున్నట్లే అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో సిల్హౌట్టే డిజైన్స్ ఎక్కువగా కనబడుతాయనుకున్నాము.
కానీ ఈ సారి మాత్రం అతను డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వీటిలో దుస్తులను కాకుండా వాటి యొక్క స్ట్రక్చర్ ను మనం గమనించవచ్చు, అలాగే యాక్ససరీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ లో అమిత్ అగర్వాల్ ఉపయోగించిన యాక్ససెరీస్ 3డికి సంబంధించినవి. వీటిలో నిజంగా బటర్ ఫ్లై ఇయర్ మఫ్స్ చాలా అందంగా అలంకరించారు. ట్రైబల్ ట్రైబల్ ట్రెడిషన్ ను తలపిస్తుంది.
లాక్మే ష్యాషన్ వీక్ లో :సుస్మితా సేన్ స్టన్నింగ్ డ్రెస్:క్లిక్ చేయండి
అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో ఎక్కువగా బ్లాక్ మరియు బ్లూ మరియు గ్రీన్ మెజారిటి ఎక్కువగా ఉంది. మిగిలిన సిల్హౌట్టే డ్రెస్సు కూడా అతని స్టైల్ కు తగ్గట్లుగా డిజైన్ చేయబడింది . అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా సిల్క్, టుల్లే, మ్యాట్ సిల్క్ , క్రిప్ మరియు సాటిన్ ను ఎక్కువగా ఉపయోగించాడు . ఈ మెటీరియల్స్ ట్రైబల్ ఫ్యాషన్ ను తలపిస్తున్నది.
అతని కలెక్షన్స్ లో వివిధ రకాల శారీ స్టైల్ గౌన్స్, ప్లగ్గింగ్ నెక్ లైన్స్, పెప్లమ్ ఫినిష్ మరియు స్ట్రక్చర్డ్ గౌన్స్ , షీర్ బాడీ సూట్స్ , మెష్ డీటైల్స్ అమిత్ కలెక్షన్స్ కు మరింత గ్లామర్ ను జోడించాయి. అయితే మొత్తం అతని కలెక్షన్స్ లో షోస్టాపర్ గా సుస్మితా సేన్ ర్యాంప్ వాక్ లో మెస్మరైజ్ చేసింది...

శారీ స్టైల్ గౌన్:
అమిత్ అగర్వాల్ శారీ స్టైల్ గౌన్స్ లో డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేయబడింది.

వ్రాప్ బస్ట్ గౌన్:
కొన్ని షీర్ గౌన్ ఫిట్ గా మరియు ఫ్లవర్ డిజైన్స్ తో ఉన్నాయి. ఈ గౌన్స్ చాలా అందంగా డిజైన్ చేయడంతో పాటు మెరిసేలా ఉండే మెటీరియల్ సెలక్ట్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది.

వింగ్ స్లీవ్స్:
రెక్కలాంటి స్లీవ్స్ తో నియాన్ పింక్ డ్రెస్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ స్ట్రక్చర్డ్ గౌన్ ఆఫ్రికన్ ట్రైబల్ ఫ్యాషన్ నుండి తీసుకురావడం జరిగింది.

ఫ్రింజ్ బురక:
ఫ్యాషన్ షోలో బరుకాలు కూడా ప్రదర్శిస్తారని మీరు ఊహించారా?అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో ఈ ప్రింజ్ బురకలను చాలా మంది ఇష్టపడ్డారు.

షోస్టాపర్:
షీర్ బ్లాక్ గౌన్ ధరించిన సుస్మితా సేన్ అమిత్ కలెక్షన్స్ తో షో స్టాపర్ గా నిలిచింది.

పెప్లమ్ ఫినిష్:
అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో చాలా వరకూ పెప్లమ్ ఫినిష్ తో గౌన్స్ ను డిజైన్ చేశారు.

వ్రాప్ గౌన్స్:
అమిత్ కలెక్షన్స్ లో వివిధ రకాల పీస్ లున్నాయి. వాటితో వ్రాప్స్ లా గౌన్స్ ను డిజైన్ చేశారు.

షీర్ బాడీ సూట్ :
అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో షీర్ బాడీ సూట్స్ అద్భుతంగా ఉన్నాయి.

ప్లగ్గింగ్ నెక్ లైన్:
అమిత్ అగర్వాల్ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాడు. అలా ప్రయోగించన డిజైన్సే ఇవి.

3డి జువెలరీ:
అమిత్ కలెక్షన్స్ లో ఉపయోగించిన 3డి జువెలరీస్ అదనపు ఆకర్షణ.

మెష్ హెడ్గీర్:
ట్రైబల్ థీమ్ ను ఉంచడానికి, అమిత్ అగర్వాల్ కొన్ని మనోహరమైన హెడ్గీర్ ను ఉపయోగించి మెరుగులు జోడించాడు.



Click it and Unblock the Notifications











