Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
కరెంటు లేకుండా పని చేసే ట్రెడ్ మిల్ ను రూపొందించిన తెలుగు వ్యక్తి.. కేటీఆర్, ఆనంద్ మహేంద్రా ఆసక్తి..
కరెంట్ లేకుండా నడిచే ట్రేడ్ మిల్ ను కనిపెట్టిన తెలంగాణ కార్పెంటర్... ఆ విశేషాలేంటో మీరూ చూడండి.
కరోనా పుణ్యమా అని ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మంచి బాడీ కోసం యూత్ జిమ్ లలో గంటలకొద్దీ గడుపుతున్నారు.

ఫిట్ నెస్ గురించి అవగాహన ఉన్నవారందరికీ ట్రెడ్ మిల్ గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. మనలో చాలా మంది మార్కెట్లో ట్రెడ్ మిల్ ను కొనుక్కొని ఇళ్లలోనూ లేదా వరండాలో వర్కౌట్లు చేస్తుంటాం. అయితే ఈ ట్రెడ్ మిల్ కు కరెంట్ అవసరం కచ్చితంగా ఉంటుంది.
కరెంట్ లేకుంటే అది అస్సలు పని చేయదు. అయితే ట్రెడ్ మిల్ అనేది కరెంట్ లేకుండా పని చేస్తుందని తెలుసా.. దాన్ని కూడా ఓ తెలుగు వ్యక్తి తయారు చేశాడని తెలుసా...
పర్యావరణ హిత ట్రెడ్ మిల్..
తెలుగు కార్పెంటర్ రూపొందించిన పర్యావరణ హిత ట్రెడ్ మిల్ ను చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇది తెలంగాణ మంత్రి కేటీఆర్ ను, ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుంది. అంతే ఆ ఇద్దరూ దీని ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్ అయిపోయింది. ఆ వివరాలేంటో మీరూ చూడండి...

ఆటోమేటిక్ గా..
ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే మన దేశంలో కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కరెంట్ అవసరం లేకుండానే నడిచే ట్రెడ్ మిల్ ను రూపొందించాడు. చెక్క కర్రల సాయంతో కరెంట్ అవసరం అనేదే లేకుండా ఆటోమేటిక్ గా పని చేసేలా తయారు చేశాడు. ఈ ట్రెడ్ మిల్ పై నడుస్తున్నప్పుడు, అందులో అమర్చిన ప్రత్యేక స్ప్రింగుల ద్వారా దానికదే రోల్ అవ్వడం దీని ప్రత్యేకత.

మరింత డెవలప్ చేయాలని
తను రూపొందించిన ట్రెడ్ మిల్ ను ట్విట్టర్లో షేర్ చేయగా.. దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ ఇన్నోవేషన్ అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది తెలంగాణ మంత్రి కేటీఆర్ ను బాగా ఆకర్షించింది. దీన్ని పరిశీలించి తనకు సాయం చేయాలని టీఎస్ వర్క్స్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ కి ట్యాగ్ చేశారు. దీన్ని మరింత డెవలప్ చేయాలని ఓ నెటిజన్ సలహా ఇవ్వగా.. ఈ ట్రెడ్ మిల్ ను ఒకసారి చూడండి అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర విన్నవించడం విశేషం. అంతేకాదు తనకు కూడా అది ఒకటి కావాలని కోరుకున్నారు.

తొలి భాగంలో..
ఒక నిమిషం లోపు ఉన్న ఈ వీడియోలో తొలి భాగం చెక్క ట్రెడ్ మిల్ తయారీ గురించి ఉంది. చెక్క కర్రలను అనుసంధానించడం, చైన్ ఏర్పాట్లు చేయడం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక చివర్లో తను తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ పై తనే స్వయంగా నడుస్తూ డెమో ఇస్తూ కనిపిస్తాడు.

గొప్ప నైపుణ్యం..
ఈ వీడియో చూసిన నెటిజన్లు తన నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం దీనిపై కొన్ని డౌట్స్ ఉన్నాయన్నారు. అది అంత పర్ఫెక్ట్ గా పని చేయకపోవచ్చని చెప్పారు. ఇంకా కొందరు మాత్రం హైదరాబాదులో ఇప్పటికే కరెంట్ లేకుండా ట్రెడ్ మిల్ ను చాలా మంది వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎవరు ఏమనుకున్నా.. తన నైపుణ్యం చాలా గొప్పదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ.. దీన్ని మార్కెట్లో పోటీకి అనుగుణంగా ప్రవేశపెడితే, కచ్చితంగా ఇది టాప్ లో ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలుగు కార్పెంటర్ రూపొందించిన పర్యావరణ హిత ట్రెడ్ మిల్ ను చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ను బాగా ఆకర్షించింది. దీన్ని పరిశీలించి తనకు సాయం చేయాలని టీఎస్ వర్క్స్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ కి ట్యాగ్ చేశారు. దీన్ని మరింత డెవలప్ చేయాలని ఓ నెటిజన్ సలహా ఇవ్వగా.. ఈ ట్రెడ్ మిల్ ను ఒకసారి చూడండి అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర విన్నవించడం విశేషం. అంతేకాదు తనకు కూడా అది ఒకటి కావాలని కోరుకున్నారు.



Click it and Unblock the Notifications