Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
అమెరికాను కుదిపేస్తున్న బాంబ్ సైక్లోన్, మంచు బీభత్సంతో ప్రజలు అతలాకుతలం
బాంబ్ సైక్లోన్ ప్రభావంతో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -40 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతోంది. నప్లెస్‌లో -52 డిగ్రీల చలి నమోదవుతోంది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో 35 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.
అమెరికా, కెనడాల్లో బాంబ్ సైక్లోన్(Bomb Cyclone) బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా, కెనడాల్లోని చాలా ప్రాంతాల్లో మంచు కొన్ని అడుగుల మేర పరుచుకుంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో జనజీవనం స్తంభించిపోయింది. విపరీతమైన చలి కారణంలో పలు ప్రాంతాల్లో జనాలు ప్రాణాలు వదులుతున్నారు. అమెరికాలోని బఫెలో ప్రాంతంలో బాంబ్ సైక్లోన్‌కు అల్లాడిపోతోంది. అమెరికా మొత్తం జనాభాలో మూడింట రెండు వంతుల మంది అంటే సుమారు 20 కోట్ల మంది ప్రజలు బాంబ్ సైక్లోన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచుతో 16వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. చాలా ఎయిర్‌పోర్టులను మూసి వేశారు.

బాంబ్ సైక్లోన్ ప్రభావంతో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -40 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతోంది. నప్లెస్‌లో -52 డిగ్రీల చలి నమోదవుతోంది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో 35 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.

బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి?
చాలా వేగంగా తుపానుగా మారే పరిస్థితి బాంబ్ సైక్లోన్‌గా పిలుస్తారు శాస్త్రవేత్తలు. తుపానుతో ఉండే నష్టం కంటే బాంబ్ సైక్లోన్‌తో ఉండే నష్టం ఎక్కువగా ఉంటుంది. వెచ్చటి గాలి పైకి వెళ్లి తక్కువ పీడనం ఏర్పడుతుంది.వాతావరణంలోని తేమ కారణంగా తుపాను మేఘాలు ఏర్పడతాయి.
వాతావరణ పీడనం చాలా త్వరగా పడిపోయి అంటే 24 గంటల్లో 24 మిల్లీబార్లు పడిపోతే బాంబ్ సైక్లోన్‌గా మారుతుంది. ధ్రువాల నుండి వచ్చే చలిగాలుల కారణంగా వాతావరణ పీడనం కనీసం 962 మిల్లీబార్లు పతనం అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆర్కిటిక్ ప్రాంతం నుండి వీస్తున్న శీతలగాలులు ముందున్న వెచ్చని, తేమతో కూడిన గాలిలోకి నెట్టబడినందున వాతావరణం చాలా త్వరగా విపరీతంగా మారుతుంది.
బాంబ్ సైక్లోన్ అని ఎందుకంటారు?
అల్పపీడనం లేదా తుపాను బాంబోజెనిసిస్‌కు లోనవుతుంది. ఇది అల్పపీడనం అభివృద్ధి చెందే శీఘ్ర రేటును సూచిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
బాంబ్ సైక్లోన్ సమయంలో ఎలా సన్నద్ధంగా ఉండాలి?
- బాంబ్ సైక్లోన్ ప్రభావం ఉంటుందని తెలిసిన వెంటనే చాలా రోజుల వరకు సరిపోయేంత రేషన్ ఇంట్లో ఉంచుకోవాలి.
- ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటామనుకుంటే పర్లేదు లేకపోతే సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వ క్యాంపులకు వెళ్లాలి.
- తీరప్రాంతాలనూ వీలైనంత త్వరగా వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
- బాంబ్ తుపాన్ భారీ వర్షపాతం, వరదలకు కూడా కారణం కావొచ్చు. కాబట్టి వరదలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లాలి.
- మంచు తీవ్రంగా కురుస్తున్నట్లైతే ఇంట్లో నుండి బయటకు రావొద్దు.
- మంచు అడుగుల మేర పేరుకుపోతున్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. వీలైతే అధికారులను సాయం అడగాలి.
- విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సూచనల ఆధారంగానే జనరేటర్‌ను ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications