For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Sanskrit Day 2021: సంస్కృత భాష స్పీచ్ థెరపీలా పని చేస్తుందట...ఎలాగో మీరే చూడండి...

ప్రపంచ సంస్కృతిక దినోత్సవం 2021 తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రాచీన భారతీయ భాషపై అవగాహన, ప్రచారం మరియు పునరుద్ధరణ కోసం సంస్కృతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజేనే ప్రపంచ సంస్కృతిక దినోత్సవం లేదా విశ్వ సంస్కృత దినోత్సవం అని కూడా అంటారు.

World Sanskrit Day 2021: date, history and significance in Telugu

ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మూడో తేదీన జరుపుకుంటారు. సంస్కృత దివాస్ అనేది సంస్కృతం యొక్క ప్రాచీన భారతీయ భాష చుట్టూ కేంద్రీక్రుతమై ఉన్న వార్షిక కార్యక్రమం. దీన్ని పునరుద్ధరణ మరియు దీని నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. సంస్కృత భాష ఉత్తరాఖండ్ యొక్క రెండో అధికార భాషగా ప్రకటించబడింది. సంస్కృత భాషలో 102 అరబ్ 78 కోట్ల 50 లక్షల పదాల అతి పెద్ద పదజాలం ఉంది.

World Sanskrit Day 2021: date, history and significance in Telugu

సంస్కృత దినోత్సవ చరిత్ర..
ప్రపంచ సంస్కృత దినోత్సవం లేదా సంస్కృత దివాస్ ను 1969 సంవత్సరంలో తొలిసారి జరుపుకున్నారు. ఇది ప్రాచీన భారతీయ భాషపై అవగాహన, ప్రచారం మరియు పునరుద్దరణ కోసం జరుపుకుంటారు. ఇది భారతదేశ సంపన్న సంస్కృతికి ఆపాదించబడింది.

సంస్కృత దివాస్ లో అనేక సంఘటనలు, సెమినార్లు ఉన్నాయి. ఇవి సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత, దాని ప్రభావం మరియు ఈ అందమైన భాష సంస్కృతాన్ని ప్రోత్సహించాయి.

మనకు తెలిసినట్లుగా హిందూ సంస్కృతిలో పూజ మరియు మంత్రాలను సంస్కృతంలో చదువుతారు. సంస్కృత భాష దాదాపు 3,500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిందని నమ్ముతారు. సంస్కృతం యొక్క ప్రారంభ రూపాలు క్రీస్తు పూర్వం 1,500 సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చాయని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలో అన్ని భాషలలో 97 శాతం కంటే ఎక్కువ సంస్కృతం ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమయ్యాయి.

సంస్కృత భాషను దేవ్ వాణి అంటే దేవుని భాష అని కూడా అంటారు. సంస్కృత భాష రెండో సహస్రాబ్ది క్రీస్తు పూర్వం నాటిది. రుగ్వేదం శ్లోకాల సేకరణ కోసం ఇది రాయబడిందని చాలా మంది భావిస్తారు.

సంస్కృత దివాస్ ప్రాముఖ్యత..
ప్రాచీన భారతీయ భాషపై అవగాహన, ప్రచారం మరియు పునరుద్ధరణ కోసం సంస్కృత దివస్ జరుపుకుంటారు. సంస్కృతం భారతీయ భాషలకు తల్లి వంటిది. భారతదేశంలో మాట్లాడే ప్రాచీన భాషలలో మొదటిది. సంస్కృతం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష. ఎందుకంటే కంప్యూటర్ అల్గారిథమ్ ను సులభమైన రీతిలో రాయడంలో సహాయపడుతుంది.

సంస్కృతంలో ప్రతి దానికి పర్యాయపదాలు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క దానికి పర్యాయపదం కచ్చితంగా ఉంటుంది. 'సుధర్మ' అనే సంస్కృత వార్తాపత్రిక 1970లలో ప్రచురించబడుతోంది. ప్రస్తుతం, ఈ వార్తాపత్రిక అందుబాటులో ఉంది కానీ ఆన్ లైన్ లో మాత్రమే. అరబ్ దండయాత్రకు ముందు, సంస్కృతం భారత ఉపఖండంలో అధికారిక జాతీయ భాషగా ఉండేది.

సంస్కృత భాష చాలా మందికి స్పీచ్ థెరపీలా పని చేస్తుంది. కర్నాటకలోని మాటూర్ అనే గ్రామం రాష్ట్రంలో సంస్కృతం మాట్లాడే ఏకైక గ్రామంగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు సంస్కృత భాష కోసం అంకితమైన కోర్సులను కలిగి ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని భవిష్యత్ భాష గా భావిస్తారు. సంస్కృతంలో అత్యంత కచ్చితమైన ధ్వనిశాస్త్రం ఒకటి ఉంది. సంస్కృతంలో 49కి పైగా విభిన్న శబ్దాలు ఉన్నాయి. ఇవి విభిన్న పదాలను మాట్లాడటంలో సహాయపడతాయి. విద్యార్థుల ఏకాగ్రత స్థాయిని మెరుగుపరచడంలో సంస్కృతం సహాయపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ సంస్కృతంలో చదవడం మరియు రాయడం నేర్చుకుంటే సైన్స్, మ్యాథ్స్ లో సులభంగా రాణించొచ్చు.

నాసా ప్రకారం, సంస్కృతం ప్రపచంలో అత్యంత స్పష్టమైన భాష. సంస్కృత లాంటి కచ్చితమైన భాష మరొకటి లేదు. సంస్కృతంలో ఒక వాక్యం లేదా పదానికి ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యనాలు ఉండవని అర్థం.

English summary

World Sanskrit Day 2021: date, history and significance in Telugu

world sanskrit day, world sanskrit day 2021, sanskrit diwas, sanskrit day 2021 date, sanskrit day history, sanskrit day significance, sanskrit day facts
Story first published:Tuesday, August 3, 2021, 12:03 [IST]
Desktop Bottom Promotion