Latest Updates
-
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.?
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
దక్షిణ భారత వంటకాలలో దోసెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా, మధ్యాహ్న భోజనమైనా, రాత్రి డిన్నర్ అయినా సరే.. వేడి వేడి దోసె కనిపిస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. బియ్యం, మినపప్పుతో తయారుచేసే ఈ వంటకం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇన్నాళ్లూ మీరు కరకరలాడే తెల్లటి,పసుపు కలర్ దోసెలను మాత్రమే చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా నల్ల దోసె(బ్లాక్ దోసె) గురించి విన్నారా?
ఇప్పుడు నల్ల దోసెలు ఫుడ్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ తినే సాధారణ దోసెలకు భిన్నంగా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలని మీరు అనుకుంటే నల్ల దోసె మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది చూడటానికి చాలా వెరైటీగా ఉండి, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది.

బ్లాక్ దోసె తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒకటిన్నర కప్పులు
మినప పప్పు - అర కప్పు
మెంతులు - అర టీస్పూన్
యాక్టివేటెడ్ చార్‌కోల్ పౌడర్ - 1 టీస్పూన్
నీరు-తగినంత
ఉప్పు-రుచికి సరిపడా
నూనె లేదా వెన్న- దోసెలు కాల్చడానికి
బంగాళాదుంప మసాలా కుర్మా- స్టఫింగ్ కోసం
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
బ్లాక్ దోసె తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినపపప్పు, మెంతులు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి.
-నానిన పదార్థాలను మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిపై మూత పెట్టి రాత్రంతా లేదా సుమారు 8-10 గంటల పాటు పులియనివ్వాలి.
-ఉదయాన్నే బాగా పులిసిన పిండి నుండి ఒక 2 కప్పుల పిండిని వేరే గిన్నెలోకి తీసుకోండి. అందులో 1 టీస్పూన్ యాక్టివేటెడ్ చార్ కోల్ పౌడర్, తగినంత ఉప్పు వేసి పిండి మొత్తం నల్లగా మారేలా బాగా కలుపుకోవాలి. చార్ కోల్ పౌడర్ మోతాదుకు మించి వేయకూడదు, ఎక్కువైతే రుచి మారిపోతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసెల పెనం పెట్టి వేడిచేయాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె లేదా వెన్న రాసి, గరిటెతో పిండిని తీసుకుని పలుచగా దోసెలా పోయాలి. దోసెను మీడియం మంటపై రెండు వైపులా కరకరలాడేలా కాల్చుకోవాలి.
-దోసె మధ్యలో కమ్మని ఆలు మసాలాను పెట్టి మడిస్తే మసాలా బ్లాక్ దోసె రెడీ. దీనిని వేడివేడిగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్ తో వడ్డిస్తే రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications