Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.!
వర్షాకాలం ప్రారంభమైంది. ప్రకృతి పచ్చదనం అనే చీరను కట్టుకుని.. ఉవ్వెత్తున ఎగసిపడే జలపాతాలతో సరికొత్త అందంతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆ అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు టూర్ ప్లానింగ్ చేసుకుంటుంటారు. దేశవిదేశాల్లో నచ్చిన ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో మీతో పాటు టూర్‌లో ఒక ఐదు ఉత్తమ ప్రయాణ పరికరాలను తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంతకీ ఆ పరికరాలేంటి.. కారణాలేంటి.. ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా లాంగ్ టూర్‌లో మన లగేజీలో ఎన్నో సర్దుకుంటాం. కానీ రిటర్న్ అయి ఇంటికి వచ్చాక అందులో కొన్ని ఖచ్చితంగా మిస్ అవుతాయి. లేదంటే వెళ్లేటప్పుడే లగేజ్‌లో కొన్ని అత్యవసరమైనవి పెట్టుకోవడం మర్చిపోతాం. దీనివల్ల కాస్త అసహనానికి, బాధకి గురవడం కామన్. ఒక్కోసారి వీటిని మర్చిపోవడం వల్ల విహారయాత్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఇలాంటి అవాంతరాలు ఏమీ లేకుండా మీ టూర్ సంతోషంగా, చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకుంటే మీ లగేజ్‌లో ఈ ఐదు ప్రయాణ పరికరాలను సిద్ధం చేసుకోండి. ఇవి చిన్నగా ఉండటంతో పాటు మీకు జర్నీలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ ప్రయాణాన్ని సులభతరం, సురక్షితంగా మారుస్తాయి.
విహారయాత్రకు వెళ్లేటప్పుడు లగేజ్‌లో బట్టలు, టిక్కెట్లు ఇలా వీటితో పాటు ట్రావెల్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి. మీరు ఒకవేళ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నట్లయితే విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం పవర్ బ్యాంక్ సామర్థ్యాన్ని పరిశీలించుకోవాలి. క్వాలిటీ ఉన్న, తక్కువ బరువుతో పాటు బ్రాండెడ్ గ్యాడ్జెట్స్‌ను ఎంచుకోండి. తద్వారా వాటిని క్యారీ చేయడం ఈజీగా ఉండటంతో పాటు ట్రావెలింగ్‌లో ఇబ్బందులు పడరు.

ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఎప్పుడూ ఆన్‌లో ఉండటం తప్పనిసరి. తరచుగా బ్యాటరీ పవర్ అయిపోతుంది. అందుకే తప్పనిసరిగా ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌ను మీ లగేజ్‌లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి చిన్న పరికరాలను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. రైలు, విమానంలో లాంగ్ జర్నీకి ఈ గ్యాడ్జెట్ దోహదరపడుతుంది.
విహార యాత్రలో భాగంగా మీరు వేరే రాష్ట్రానికి లేదంటే విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీతో పాటు యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ చాలా ముఖ్యం. దీనికి వివిధ రకాల ప్లగ్‌లు, యూఎస్‌బీ పోర్టులు ఉండటం వల్ల ఒకేసారి అనేక పరికరాలకు ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇది మీ బ్యాగ్‌లో చాలా తక్కువ ప్లేస్‌ను తీసుకుంటుంది.
విమాన ప్రయాణంలో లగేజ్ బరువు తనిఖీ తప్పనిసరిగా ఉంటుంది. అందుకే మీరు ఇంటి వద్ద నుంచే లగేజీ బరువు తనిఖీ చేసుకునేందుకు డిజిటల్ లగేజ్ స్కేల్ ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లోనే వెయిట్ చేసుకోవచ్చు. ఇది విమానాశ్రయంలో మీరు అదనంగా సామాను ఛార్జీలు చెల్లించకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ట్రాలీ బ్యాగ్‌లో దీనిని సులభంగా క్యారీ చేయవచ్చు.

ట్రావెల్ ఆర్గనైజర్ పౌచ్ ఒకటి మీ లగేజ్ బ్యాగ్‌లో ఉండటం ద్వారా మీ పని సులువుగా ఉంటుంది. ఆ పౌచ్‌లో మొబైల్ ఛార్జర్లు, యూఎస్‌బీ కేబుల్స్, మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, పవర్ బ్యాంకులు, ఇయర్ బడ్స్ వంటి చిన్న చిన్న వస్తువులు ఈజీగా ఇమిడిపోతాయి. దీంతో అవసరమైనప్పుడు వాటిని వెతుక్కునే పని లేకుండా సులభంగా గుర్తించవచ్చు. ఇది ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తుంది.
విహారయాత్రలో చాలా ప్రాంతాలు తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఎక్కడోచోట బ్యాగ్, తాళాలు, పర్సులు పోగొట్టుకునే సందర్భాలు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాయి. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు బ్లూటూత్ ట్రాకర్ ఉత్తమంగా పనిచేస్తుంది. మీ లగేజీ బ్యాగ్‌కి దీనిని తగిలించవచ్చు. మొబైల్ యాప్ ద్వారా బ్యాగ్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు. దీని ద్వారా రద్దీ ప్రాంతాల్లో మీ బ్యాగ్ పోతుంది అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. వర్షాకాలంలో మీ టూర్‌ను ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆస్వాదించేందుకు ఈ గ్యాడ్జెట్స్ తప్పనిసరిగా మీ బ్యాగ్‌లో పెట్టుకోవడం మరిచిపోవద్దు.



Click it and Unblock the Notifications
