Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
పవన్ కళ్యాణ్ అనే నేను.. వైరల్ అవుతోన్న పవన్ ప్రమాణ స్వీకార వీడియో..!
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల ప్రమాణస్వాకార సమయంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రమాణ స్వీకారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పవన్ కళ్యాన్ అనే నేను హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా వేధికల్లో ట్రెండ్ అవుతోంది. పవన్ ప్రామణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకావడం, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కావడం విశేషం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
కొన్ని సంఘటనల్లో వచ్చే ట్విస్టును చూసని తరువాత నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది, కొన్ని సార్లు కడుపు నొప్పి కూడా వస్తుంది. అలాంటి సంఘటనే తెలంగాణలోని హన్మకొండలో జరిగింది. హన్మకొండలో కోవెలకుంట రెడ్డోపురం వద్ద ఒక చెరువు వుంది. ఆ చెరువు ఒడ్డు దగ్గర నీళ్లల్లో ఎవరో శవం తేలుతున్నట్టు స్థానికులకు అనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ సంఘటనా ప్రదేశానికి వెళ్లారు.
చెరువు ఒడ్డ దగ్గర తేలుతున్న అతని శరీరం చేతులు పట్టుకొని బయటకు లాగడానిక ప్రయత్నించారు, అప్పుడే శవమనుకున్న అతను ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. దీంతో అక్కడ పోలీసులతో పాటు అందరూ షాక్‌కు గురయ్యారు. కొందరు ఒక్కసారిగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
చెరువులో అలా పడిపోయిన వ్యక్తి నెల్లుూరుకు చెందిన వాడిగా గుర్తించారు. క్వారీలో 12 గంటలు పనిచేసి బాగా అలసిపోయానని, అందుకే నిద్రకోసం నీళ్లల్లో చల్లా పడుకున్నట్లు అతని పోలీసులకు చెప్పాడు. ఈ వీడియో అప్‌లోడ్ అయిన కొన్ని నిమిశాల్లోనే లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజెన్లు విచిత్రంగా కామెంట్ చేస్తున్నారు. తాగిన వ్యక్తి ఎప్పుడూ మునిగిపోడని భావించాలని ఒకరు, అందరికీ పెద్ద సినిమా చూపించాడని మరొకరు కామెంట్ చేశారు.
బయట ఎండలు భరించలేక ముగ్గురు ఏసీ వున్న ఎస్బీఐ ఏటీమ్‌లో నిద్రపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. నెటిజెన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం విద్యుత్తును సరిగ్గా సరఫరా చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని కాబట్టి పంజాబ్ ప్రభుత్వం విద్యాత్తును సకాలంలో అందించాలని కామెంట్ చేశారు.
చాలా ఏటీఎంలో సెక్యురిటీ గార్డులను పెట్టకోవడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మరో యూజర్ కామెంట్ చేశారు. అయితే కొంతమంది ఈ వీడియోను ఎస్బీఐ సిబ్బందికి ట్యాగ్ చేయడంతో ఎస్పీఐ అధికారులు స్పందించారు. పంజాబ్‌లోని ఈ ఏటీఎం ఎక్కడుందో చెబితే దగ్గరలోని బ్రాంచ్ వారికి తగిన చర్యలు తీసుకోవాలని అదేశిస్తామని ఎస్బీఐ స్పందించింది.



Click it and Unblock the Notifications
