Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
LIVE VIDEO: చైనాలో ప్రస్తుతం పరిస్తతి ఎలా ఉందో చూడండి.. కచ్చితంగా షాక్ అవుతారు
చైనాలో వ్యాపిస్తున్న HMPV వైరస్ కేసులో మన దేశంలో కూడా నమోదవుతుండడంతో ప్రజలందరూ భాయాందోళనలు చెందుతున్నారు. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఈ వైరస్ ప్రమాదకరమైనదని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ నివశిస్తున్న మన భారతీయులు ఏమంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రశాంతంగా..
మన దేశంలో HMPV వైరస్ గురించి అవసరమైన చర్చ జరుగుతుంది. చైనాలో చాలా వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుందని, పదుల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారని చెబుతున్నారు. కానీ రియాలిటీ అలా లేదు. అక్కడ నివసిస్తున్న మన భారతీయులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోలను బట్టి చూస్తే అక్కడ అంతా ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు చైనాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే?
కేరళకు చెందిన పలువురు, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి, అలాగే ఉత్తర భారత దేశానికి చెందిన మరికొందరు చైనాలో ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నాలు చేశారు. చైనాలో ప్రస్తుతం ఎలాంటి భయాందోళనలు లేవని, ప్రశాంతమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ బయటికి వచ్చి తమపని తాము చేసుకుంటున్నారని, చిన్న పిల్లలు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయట తిరుగుతున్నారని వివరించారు.
ఈ మేరకు మాల్స్, ఆఫీస్, బయటి రోడ్లన్నీ తిరుగుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. ఏమి లేని దానికి ఎందుకంత పుకారు సృష్టిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కావాలనే కొందరు ఈ పనులు చేస్తున్నారని, ప్రజలు ఈ వైరస్ గురించి వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకూడదని చెబుతున్నారు. కాకపోతే ముందస్తు జాగ్రత్తగా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులను శుభ్రం చేసుకుంటూ మాస్కులు వినియోగించాలని కోరుతున్నారు. చికిత్స కంటే నివారణ మంచిదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల లోపు ఈ లక్షణాలు బయటపడతాయి. ఒకవేళ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉంటే కొంత జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరగడం మంచిది. అలాగే స్వయం శుభ్రత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకుంటే చాలు.



Click it and Unblock the Notifications