For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెయిల్యూర్ అయిన సెలబ్రెటీల ఫేమస్ లవ్ స్టోరీస్

By Swathi
|

నిజమైన ప్రేమను పొందినా.. లైఫ్ లాంగ్ దాన్ని సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు కొంతమంది సెలబ్రెటీస్. ఆ ప్రేమ పక్షులను చూస్తే.. ఎంతో ప్రేమగా ఉన్నారని, వాళ్ల ప్రేమ చాలా స్ట్రాంగ్ గా ఉందని మనం భావించినా.. వాళ్లు ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకోలేకపోవడం చాలా బాధాకరం.

ఎక్కువగా సెలబ్రెటీల పెళ్లిళ్లు ఫెయిల్ అవడానికి కారణాలేంటి ?

సెలబ్రెటీలను చూస్తే.. వాళ్లకేం తక్కువ అన్నీ ఉన్నాయి అనుకుంటూ ఉంటాం. ఫ్యాన్సీ కార్స్, లక్షరీ విల్లాస్, గ్లామరస్ లైఫ్ స్టైల్, రెడ్ కార్పెట్ హుందాతనం ఇవన్నీ.. బయట కనిపించే హంగులు మాత్రమే. వాళ్ల మనసుదాకా వెళ్తే.. చాలా బాధాకరమైన విషయాలు కూడా ఉంటాయి. వాళ్లు కూడా మనలాంటి వాళ్లే అనిపిస్తుంది.

వాళ్లకు కావాల్సింది ప్రతిసారీ పొందలేకపోతారు. హ్యాపీగా లవ్ లైఫ్ ఎంజాయ్ చేసినప్పటికీ.. దాన్ని జీవితాంతం పొందలేని వాళ్లు కూడా ఉన్నారు. ప్రేమ జీవితానికి మధ్యలోనే వీడ్కోలు పలకాల్సి వచ్చినవాళ్లు ఉన్నారు. మరి ఎంతగానో ప్రేమించి, వాళ్లే తమ జీవితం అనుకున్న వాళ్లను పెళ్లి చేసుకోలేకపోయిన సెలబ్రెటీస్ ఎవరో మీరే చూడండి..

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్

సల్మాన్, ఐష్ ల లవ్.. చాలా ఫేమస్ అయింది. వీళ్ల లవ్ స్టోరీ సంజయ్ లీలా బన్సాలీ హమ్ ది చుప్కే సనమ్ సినిమా సెట్స్ లో మొదలైంది. వీళ్లిద్దరూ 1999 నుంచి 2001 వరకు డేటింగ్ కూడా చేశారు. కానీ ఈ లెజండ్రీ లవ్ కి ఎవరూ ఊహించని విధంగా మధ్యలోనే బ్రేక్ పడింది. సల్మాన్ ప్రవర్తన బాగోలేదని.. సల్మాన్ తనకు సరైన వాడు కాదని.. ఐష్ ఈ కండలవీరుడితో ప్రేమకు గుడ్ బై చెప్పేసింది.

కరిష్మా, అభిషేక్

కరిష్మా, అభిషేక్

కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్ ల ప్రేమ చాలా కాంట్రవర్సీకి దారితీసింది. అమితాబ్ 60వ బర్త్ డే ఫంక్షన్ ని ముంబైలోని 5స్టార్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. అప్పుడే అభిషేక్, కరిష్మాలకు ఎంగేజ్మెంట్ కూడా చేశారు. కానీ.. కొన్ని నెలల తర్వాత వీళ్ల పెళ్లి క్యాన్సెల్ అయింది. దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి. కరిష్మాకి సహారా యజమాని సుబ్రతో రాయ్ తో ఎఫైర్ ఉందని గాసిప్స్ తో.. వీళ్ల పెళ్లి జరగలేదని.. వార్తలు వచ్చాయి.

హృతిక్ రోషన్, కరీనా కపూర్

హృతిక్ రోషన్, కరీనా కపూర్

2000 సంవత్సరంలో.. హృతిక్, కరీనాల ప్రేమ వ్యవహారం.. చాలా హాట్ టాపిక్ గా ఉండేది. ఎందుకంటే.. హృతిక్ తన స్వీట్ హార్ట్ సుసానా ఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడు. కానీ కరీనాతో ఎఫైర్ నడపడంతో.. చాలా వివాదాస్పదమైంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. ఆ వెంటనే కొంతకాలానికే హృతిక్ సునానేని పెళ్లి చేసుకుంటే.. కరీనా కపూర్ షాహిద్ కపూర్ తో డేటింగ్ చేసింది. కానీ సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుంది.

షాహిద్ కపూర్, కరీనా కపూర్

షాహిద్ కపూర్, కరీనా కపూర్

షాహిద్ కపూర్ పై మనసు పారేసుకున్న కరీనా.. ప్రేమాయణం నడిపింది. అతని వెనక రెండు నెలలపాటు తిరిగి.. రిలేషన్ షిప్ కి ఒప్పించింది. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం డేటింగ్ లో ఉన్నారు. కానీ మళ్లీ కరీనా కపూర్ సైఫ్ తో సినిమా తీసి.. అతనితో కెమిస్ట్రీ కుదరడంతో.. సైఫ్ తో 4ఏళ్లు డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంది.

బిపాసా, జాన్ అబ్రహాం

బిపాసా, జాన్ అబ్రహాం

బిపాసా బసు, జాన్ అబ్రహాం హాటెస్ట్ కపుల్. కానీ.. వీళిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోకుండానే లవ్ స్టోరీకి శుభం పలికేశారు. కానీ వీళిద్దరూ మోడలింగ్ రోజుల్లోనే దగ్గరై.. దాదాపు ఎనిమిదేళ్లు డేటింగ్ చేశారు.

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్

సంజయ్ దత్ రిచా శర్మను పెళ్లి చేసుకున్నాడు, ఒక కూతురు ఉంది. కానీ ఆమె క్యాన్సర్ తో చనిపోయింది. ఆ తర్వాత సంజయ్ దత్.. మాధురీ దీక్షిత్ తో ఎఫైర్ నడిపాడు. సాజాన్ సెట్స్ లో వీళ్లిద్దరూ క్లోజ్ అయ్యారు. కానీ వీళ్లిద్దరి మధ్య ఈ ఎఫైర్ తో.. బాలీవుడ్ లో సంజయ్ బ్యాడ్ బోయ్ గా మారిపోయాడు. అయితే రిచా మరణానికి ముందే వీళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే.. సంజయ్ ఒక కేసులో అరెస్ట్ కావడంతో.. ఈ లవ్ స్టోరీస్ కి ఫుల్ స్టాప్ పడింది.. మాధురీ తప్పుకుంది.

అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి

అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి

అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి చాలా సినిమాల్లో నటించారు. అదే సమయంలో.. వీళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అక్షయ్ కుమార్ తనని చీట్ చేస్తున్నాడని.. అక్షయ్ ట్వింకల్ కన్నాతో ఎఫైర్ నడుపుతున్నాడని భావించింది శిల్పాశెట్టి. ఇదంతా తెలిసేలోపే అక్షయ్ కుమార్ ట్వింకల్ కన్నాని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.

మధుబాల, దిలీప్ కుమార్

మధుబాల, దిలీప్ కుమార్

ఆ రోజుల్లో క్రేజీ బ్యూటీ అయిన మధుబాలతో.. దిలీప్ కుమార్ ప్రేమలో పడ్డాడు. కానీ వాళ్లిద్దరి మధ్య ఇగో ప్రాబ్లమ్ రావడంతో.. బ్రేకప్ అయ్యారు. సినిమాలు మానేసి.. తనను పెళ్లి చేసుకోమని దిలీప్ అడగటంతో.. మధుబాల క్షమాపణ చెప్పాలని దిలీప్ ని డిమాండ్ చేసింది. ఇలా వీళ్ల ప్రేమ విఫలమయింది.

రాజ్ కుమార్, నగ్రీస్

రాజ్ కుమార్, నగ్రీస్

ఇదో ట్రాజిక్ లవ్ స్టోరీ. రాజ్ కుమార్ అద్భుతమైన నటుడు. అలాగే నర్గీస్.. టాలెంటెడ్ బ్యూటిఫుల్ హీరోయిన్. అయితే వీళ్లిద్దరి మధ్య కొన్ని గొడవల కారణంగా.. ప్రేమ మధ్యలోనే బ్రేక్ అయింది.

English summary

Celebs who could not marry their love!

Celebs who could not marry their love! There are so many Bollywood celebrities who have found true love but failed to keep it for long.
Desktop Bottom Promotion