For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉమెన్స్ డే స్పెషల్: 21వ సెంచురీ మోడ్రన్ ఉమెన్ పవర్ ఏంటో తెలుసా ?

21వ శతాబ్ధపు మహిళ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

By Swathi
|

మార్చి 8.. సంవత్సరంలో ఇది అత్యతం అందమైన రోజు. ఎందుకంటే.. మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. పుట్టుక, పవిత్రత, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు చిహ్నమైన అందమైన అమ్మలు, అమ్మాయిలకు ప్రత్యేకమైన రోజు ఇది.

స్వచ్ఛమైన మనసుతో.. అన్ని బాధ్యతలు ఆత్మీయంగా స్వీకరించే మహిళ గొప్పదనం అంతా ఇంతా కాదు. ఇండియాలో మహిళలకంటూ.. ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. అయితే ప్రాచీన కాలంలో మహిళలకు చాలా ప్రత్యేక స్థానం ఉండేది. కుటుంబంలో ఆమెదే నిర్ణయంగా ఉండేది.

ఫిట్ గా మరియు హెల్తీగా కనిపించే మహిళల సీక్రెట్స్ ఏంటి...? ఫిట్ గా మరియు హెల్తీగా కనిపించే మహిళల సీక్రెట్స్ ఏంటి...?

ఇప్పటికీ.. మగవాళ్ల జీవితంలో ఆడవాళ్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి మగవాళ్లు మహిళ లేకుండా బతకలేడు. అలాగే మహిళ లేకుండా.. మగవాళ్ల జీవితం కూడా పూర్తికాదు. కాబట్టి 21వ శతాబ్దపు మహిళ ఎవరు ? ప్రాచీన కాలంలో ఉన్న మహిళ స్థానాన్ని ఈ శతాబ్ధపు మహిళలు పూర్తి చేయగలుగుతున్నారా ?

2021 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే స్పెషల్ గా .. నేటి మహిళ గురించి తెలుసుకుందాం. ఉమెన్స్ డే స్పెషల్ గా.. మగవాళ్లందరూ.. తమ జీవితంలో మహిళలను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలి. మహిళ గురించి తెలుసుకోవాలి. మరి ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోదామా..

పవర్ ఫుల్

పవర్ ఫుల్

మహిళలంటేనే పవర్ ఫుల్. 21వ శతాబ్ధంలో మహిళలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నారు. ఎలాంటి టాస్క్ నైనా తీసుకుని సక్సెస్ అయ్యే సత్తా ఉంది నేటి మహిళల్లో.

ప్రపంచాన్ని పాలిస్తున్నారు

ప్రపంచాన్ని పాలిస్తున్నారు

ఈ ప్రపంచాన్ని పాలించే సత్తా ఈతరం మహిళల్లో ఉంది. ఇతర మహిళలతో ఎలాంటి ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా.. ఇతరులతో పోల్చుకోవాల్సి వస్తే.. గుణం విషయంలో.. సెల్ఫిష్ గా ఫీలవుతారు. చర్మ సౌందర్యంలో మోడ్రన్ ఉమెన్.. చాలా అందంగా, ప్రపంచాన్ని పాలించే సత్తా కలిగి ఉంది.

కుటుంబ పెద్ద

కుటుంబ పెద్ద

మహిళలే కుటుంబ పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయానికి మగవాళ్లతో పని లేదని నిరూపిస్తున్నారు. పిల్లలు, ఫుడ్ వంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కుటుంబానికి అవసరమైన బేసిక్ నీడ్స్ నుంచి అన్ని రకాల అవసరాలు వాళ్లే పూర్తి చేస్తున్నారు. అలాగే తమ భాగస్వామిని కూడా సంతోషపెడుతున్నారు.

స్వతంత్రత

స్వతంత్రత

21 వ శతాబ్ధంలో మహిళలు ఇండిపెండెంట్స్ గా ఉంటున్నారు. తన సొంత కాళ్లపై నిలబడే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారు. ఇవాళ్టి మహిళలు.. రాబోయే తరం అమ్మాయిలకు ప్రోత్సహకరంగా ఉంటున్నారు.

ప్రొటెక్షన్

ప్రొటెక్షన్

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరువవుతోంది. అలాగే మగవాళ్ల రక్షణ కూడా అవసరమవుతోంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. మహిళలు తమను తామే రక్షించుకుంటున్నారు. మోడ్రన్ మహిళలు.. తమను తాము రక్షించుకోవడానికి కొన్ని రకాల విద్యలు కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

పెయిన్

పెయిన్

ఎలాంటి ఎమోషన్ ని అయినా, శారీరక బాధనైనా, మానసిక క్షోభనైనా.. మహిళలు ఓర్చుకోగలుగుతున్నారు. కానీ మగవాళ్లు శారీరక పెయిన్ భరించలేరు. ఎందుకంటే.. వాళ్లు ఈ ప్రపంచంలోకి ఒక బిడ్డను తీసుకురాలేరు. కాబట్టి ఈ ప్రపంచానికి మరో ప్రాణాన్ని ప్రసాదించే తల్లులకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మగవాళ్లకు లైఫ్

మగవాళ్లకు లైఫ్

మగవాళ్లకు లైఫ్ ని ఇచ్చేది మహిళలే. కాబట్టి.. ఉమెన్స్ కి గౌరవించండి. ప్రేమించండి. అలాగే జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ ఇంటర్నేషన్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి మహిళకు శుభాకాంక్షలతో పాటు, మీకు జీవితాన్నిచ్చిన అమ్మకు పెద్ద థ్యాంక్స్ చెప్పండి.

English summary

International Womens Day 2021: Do You Know The 21st Century Woman?

International Womens Day 2016: Do You Know The 21st Century Woman? The 8th of March is a most beautiful day in the year, as it celebrates the existence of a woman. So, read on, as we unveil the traits of a 21st century woman.
Desktop Bottom Promotion