For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: ఈ టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్తే.. ప్రాణాలు ఫణంగా పెట్టినట్టే..!!

By Swathi
|

వెకేషన్స్ అంటే మనమందరం ఇష్టపడతాం. ముఖ్యంగా.. బిజీ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవడానికి.. కొత్త ప్రదేశాలు, ప్రాంతాలకు వెళ్లాలని ఆరాటపడుతుంటాం. అలాంటప్పుడే.. మనం ఎలాంజ్ చేస్తాం, రిలాక్స్ అవుతాం. మనమందరం జీవితంలో ఎదురుచూసే సమయం ఇలాంటిదే.

కానీ మీకు తెలుసా.. అన్ని ప్రదేశాలు రిలాక్సెషన్ ఇవ్వలేవు. ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి టూరిస్ట్ ప్లేస్ చాలా డేంజరస్ గా మిగిలిపోతున్నాయి. కాబట్టి.. టూర్ ప్లాన్ చేసేటప్పుడు.. కాస్త ఆలోచించి.. అన్ని తెలుసుకున్నాక వెళ్లడం మంచిది.

ప్రపంచవ్యాప్తంగా.. అత్యంత డేంజరస్ టూరిస్ట్ ప్లేస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే.. చాలామంది టూరిస్ట్ లు.. ఈ ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలనే పోగొట్టుకున్నారు. కాబట్టి.. వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం మంచిది.

మౌంట్ హా షాన్

మౌంట్ హా షాన్

మౌంట్ హా షాన్ అనే.. ఈ లోహపు పలక మార్గం.. చైనాలో ఉంది. ఇది.. ప్రపంచంలోనే.. అత్యంత డేంజరస్ ప్రదేశం. ఈ మౌంటెయిన్ ని ఎక్కాల్సి ఉంటుంది. ఈ లోహపు పలకం కేవలం 12 ఇంచుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కేటప్పుడు.. ఎలాంటి పరిస్థితైనా ఎదురవవచ్చు.

విల్లార్రికా మౌంటెయిన్

విల్లార్రికా మౌంటెయిన్

రెగ్యులర్ బంగీ జంప్ తో బోర్ గా ఫీలయ్యేవాళ్లకు ఇది.. పర్ఫెక్ట్ ప్లేస్. ఈ బంగీ జంప్ చేసేటప్పుడు కేవలం ఒక అడుగు దూరంలో మోల్టెన్ లావా ఉంటుంది. భయంకరమైన అనుభవం కావాలంటే.. ఇది ప్రయత్నించవచ్చు. ఇది చిలీలో విల్లార్రికా మౌంటెయిన్.

ఎల్ కామినిటో డెల్ రేయ్

ఎల్ కామినిటో డెల్ రేయ్

స్పెయిన్ లో ఉన్న ఎల్ కామినిటో డెల్ రేయ్ అనేది అత్యంత డేంజరస్ టూరిస్ట్ స్పాట్. దీన్ని కింగ్స్ లిటిల్ పాత్ వే అని పిలుస్తారు. ఇది చాలా సన్నటి మార్గం. ఇక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ప్రాణాలు గల్లంతైపోతాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. ఈ మార్గాన్ని క్లోజ్ చేశారు.

యోస్ మైట్ నేషనల్ పార్క్

యోస్ మైట్ నేషనల్ పార్క్

దీన్ని ఎక్కాలంటే.. రోజంతా పడుతుంది. దీన్ని ఎక్కేటప్పుడు దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. చూశారుగా.. ఇది చూడ్డానికే ఎంత భయంకరంగా ఉందో.

చెర్నోబిల్ టూర్స్

చెర్నోబిల్ టూర్స్

vఇక్కడ మునుపెన్నడూ.. ఎక్కడా జరగని విధంగా న్యూక్లియర్ డిజాస్టర్స్ జరిగాయి. ఈ ప్రదేశానికి చుట్టూ.. యుక్రెయిన్ ప్లాంట్ ఉంది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ.. రేడియేషన్స్ కలిగి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో చూడ్డానికి మాత్రమే.. సందర్శకులు వస్తుంటారు.

మౌంట్ ఎవరెస్ట్

మౌంట్ ఎవరెస్ట్

నేపాల్, టిబెట్ దగ్గర ఈ మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద శిఖరం ఇది. 20 వేల అడుగుల ఎత్తు ఉంటుంది. అడ్వెంచర్స్ ఇష్టపడేవాళ్లు.. ఇదో ఫేమస్ ప్లేస్. కానీ.. అంత సురక్షితం కాదు. ఇది ఎక్కాలని ఆశపడి.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రియా డి బోయ్ వైగమ్

ప్రియా డి బోయ్ వైగమ్

బ్రెజిల్ లోని అత్యంత పాపులర్ టూరిస్ట్ స్పాట్ ఇది. ఇక్కడున్న బీచ్ మొత్తం పాచి, షార్క్స్ తో నిండి ఉంటుంది. తాజాగా 50 షార్క్ ఎటాక్స్ జరిగాయి. మూడో వంతు ఎటాక్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.

English summary

Most Dangerous Places For Tourists

Most Dangerous Places For Tourists. Vacations are something that we all look forward to, especially away from all the hustle and bustle and the routine that we lead in our day-to-day life.
Story first published:Monday, August 22, 2016, 13:51 [IST]
Desktop Bottom Promotion