మీ రాశి ప్ర‌కారం మీ లైఫ్ లో మ్యారేజ్ ఎప్పుడు జ‌రుగుతుంది ??

By Swathi

మీరు బ్యాచిలరా ? ఈ ఇయర్ లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే మీ రాశిని బట్టి మీకు ఈ ఇయర్ పెళ్లి అవుతుందా ? మీ సోల్ మేట్ మీకు దొరుకుతుందా ? ఏ నెలలో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ మీ రాశిని బట్టే చెప్పేయచ్చు. మీ రాశి తెలిస్తే చాలు మీ పెళ్లి విశేషమేంటో ఇప్పుడు తెలుసుకోవచ్చు.

సీక్రెట్ గా మన లైఫ్ లో వచ్చే భవిష్యత్ ఒక మిస్టరీ లాంటిది. రేపు ఎలా ఉంటుంది.. ఏ నెల ఎలా ఉంటుంది. వచ్చే సంవత్సరం మన లైఫ్ లో ఎలా ఉంటుంది. ఏం మార్పులు తీసుకొస్తుంది అని ప్రతి ఒక్కరూ కొద్దో గొప్పో అంచనాలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ గా ఉంటుంది. అయితే మన తలరాతను ఎవరూ మార్చలేరు. కానీ.. చెడు కంటే మంచి ఎక్కువ ఆహ్వానించడం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మీ రాశిని బట్టి మీకు ఎప్పుడు నెలలో మీకు పెళ్లి కాబోతుంది ? మీ ఇంట్లో పెళ్లిభాజాలు ఎప్పుడు మోగుతాయో తెలుసుకుందాం..

మేషరాశి:

మేషరాశి:

మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎనర్జిటిక్ గా ఉంటుంది. గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో మీ పెళ్లికి శుభముహూర్తం కుదురుతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేవాళ్లు మీ పార్టనర్ ని వెతకడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభ రాశి:

వృషభ రాశి:

వృషభ రాశివాళ్లకు ఈ ఏడాది బాగా కలిసొస్తుంది. గుడ్ లక్, హ్యాపీనెస్ మీ వెంటే ఉంటాయి. పెళ్లికావాల్సిన వృషభ రాశి వాళ్లకు ఖచ్చితంగా ఈ ఇయర్ లో పార్టనర్ ని కలుస్తారు. అయితే త్వరగా పెళ్లి అయ్యే అవకాశముంది. కానీ పెళ్లి అయిన వెంటనే సమస్యలు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి ధైర్యంగా ఉండాలి. అలాగే మార్చి నుంచి జూన్ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి.

మిధునరాశి:

మిధునరాశి:

మిధునరాశి వాళ్లు ఈ ఇయర్ సెటిల్ అయిపోతారు. బ్యాచిలర్స్ కి కెరీర్, హెల్త్ బాగుంటాయి. అయితే బ్యాచిలర్ లైఫ్ నే ఈ ఏడాది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. 2016లో మీకు పెళ్లి భాజా మోగే అవకాశం లేదు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వాళ్లకు ఈ ఏడాది ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవాళ్లకు ఈ ఇయర్ మొదటి ఆరునెలల్లోనే పెళ్లి అవుతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేవాళ్లకు ఆగస్ట్ తర్వాత పెళ్లి ముహూర్తం కుదురుతుంది. అయితే ఈ ఇయర్ మాత్రం మూడుముళ్లు వేయకుండా మిస్ అవకండి.

సింహ రాశి:

సింహ రాశి:

సింహరాశి వారికి ఈ ఏడాది కష్టాలు, సుఖాల సమ్మేళనం. అయితే లవ్ లో ఉన్నవాళ్లు మొదటి ఆరునెలలు ఓపిక వహించాలి. పార్టనర్ ని కూడా వదిలిపెట్టకూడదు. అలాగే మొదటి ఆరునెలలు పెళ్లి ఆలోచనకు దూరంగా ఉంటే మంచిది. ఆగస్ట్ తర్వాత అంతా మీకు అనుకూలంగా ఉంటుంది.

కన్యా రాశి:

కన్యా రాశి:

ఈ ఇయర్ లో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే కన్యారాశి వాళ్లకు.. మొదటి ఆరు నెలలు మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. కానీ చాలా ఓపికగా వ్యవహరించాలి. జరగాల్సినవి జరగాల్సిన టైంలో జరుగుతాయి. అలాగే ఆరు నెలల తర్వాత మీకు అనుకూలంగా ఉండటానికి ఛాన్సెస్ తక్కువ. కాబట్టి ప్రేమ వ్యవహారాలు లేని వాళ్లు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

తులారాశి:

తులారాశి:

తులారాశి వాళ్లకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మీ జీవితంలో కొత్త చాప్టర్ మొదలవబోతోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి 2016 మంచి సమయం. వెంటనే ఇక మీ పెళ్లి పనులు మొదలుపెట్టేయండి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి:

కొన్ని సందర్భాల్లో మానసికంగా ధైర్యంగా ఉండాలి. భయపడకండి. మరీ ఎక్కువ చెడు ఏమీ జరగదు. కానీ.. చాలా ఓర్పుగా ఉండాలి. మీ పెళ్లి కాస్త వాయిదా పడుతూ ఉంటుంది. మొదటి ఆరునెలలు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. కానీ కాస్త ఎక్కువ కష్టపడి ప్రయత్నిస్తే.. మీకు అనుకూలంగా మారుతాయి.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి:

ధనస్సు రాశివాళ్లకు మొదటి ఆరునెలలు అటు ఇటుగా ఉంటాయి. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది. అయితే మీ వివాహ ప్రయత్నాలు చాలా కష్టంగా నడుస్తాయి. కాబట్టి ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు.

మకర రాశి:

మకర రాశి:

మకరరాశి వాళ్లకు 2016 చాలా సర్ ప్రైజ్ తీసుకొస్తుంది. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. మొదటి ఆరునెలల్లో ఖచ్చితంగా మీకు పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే.. మంచి లైఫ్ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో పెళ్లి చేసుకోవడానికి అనుకూలం.

కుంభ రాశి:

కుంభ రాశి:

ఇప్పటికే రిలేషన్ లో ఉండే కుంభరాశి వాళ్లకు ఒడిదుడుకులు ఉంటాయి. అయితే సమస్య పరిష్కారానికి మీరు వర్కవుట్ చేయడం అవసరం. ఒంటరిగా ఉండే వాళ్లు ప్రేమలో పడటానికి చాలా అనుకూలమైన సంవత్సరం ఇది. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మ్యారేజ్ లైఫ్ కి ఖచ్చితంగా పునాది పడుతుంది.

మీన రాశి:

మీన రాశి:

ప్రేమలో ఉన్న మీనరాశి వాళ్లకు 2016 ఇయర్ గ్రేట్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో పెళ్లి చేసుకోవడానికి, కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి చాలా అనుకూలమైన సమయం. అన్ని విషయాల్లోనూ ఈ సంవత్సరం మీకు గొప్ప విశేషమైనది.

Desktop Bottom Promotion