Latest Updates
-
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.!
బుల్లెట్ బాబా గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే స్టోరీ ?
బుల్లెట్ బాబా ఏంటి ? ఆలయం ఏంటి అనుకుంటున్నారా ? అవును బుల్లెట్ బాబా అంటే అక్కడ చాలా పవర్ ఫుల్ దేవుడు. ఏ కష్టం వచ్చినా, ఏ మాత్రం బాధగా ఉన్నా.. ఈ బుల్లెట్ బాబా ముందు మొరపెట్టుకుంటారు ఆ ఊరి ప్రజలు.
బుల్లెట్ బాబా ఏంటి ? ఆలయం ఏంటి అనుకుంటున్నారా ? అవును బుల్లెట్ బాబా అంటే అక్కడ చాలా పవర్ ఫుల్ దేవుడు. ఏ కష్టం వచ్చినా, ఏ మాత్రం బాధగా ఉన్నా.. ఈ బుల్లెట్ బాబా ముందు మొరపెట్టుకుంటారు ఆ ఊరి ప్రజలు. పూలహారాలు, దారాలు, నైవేద్యాలు సమర్పించి మొర ఆలకించమని వేడుకుంటారు.

దేవుళ్లను చూశాం, దేవుళ్లకు ప్రతిరూపంగా చెప్పుకునే బాబాలను చూశాం. కానీ.. ఈ బుల్లెట్ బాబా ఏంట్రా బాబూ అనుకుంటున్నారా ? నిజమే.. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ బుల్లెట్ బాబాగా మారిపోయింది. బైక్ మీద ప్రేమతో ఇలా బాబా అని క్రియేట్ చేసి ఉంటారని అనుకుంటున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.
నిజంగా మహిమ ఉన్న బాబా అని కొలిచే దైవం బుల్లెట్ బాబా. ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉన్న ఈ బుల్లెట్ బాబా కథ తెలుసుకోవాలని.. చాలా ఆత్రుతగా ఉంది కదూ. అయితే ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.. బుల్లెట్ బాబా మిస్టరీ తెలుసుకోండి..

బైక్
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈ బుల్లెట్ బాబా పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ మోటార్ సైకిల్ నే.. ఓం బన్నా అనే వ్యక్తికి ప్రతిరూపంగా పూజిస్తారు.

లిక్కర్
350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని బుల్లెట్ బాబాగా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజూ వందలాది మంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అంతేకాదు లిక్కర్ ని ప్రసాదంగా సమర్పిస్తారు.

1991లో
ఈ బుల్లెట్ బాబా చరిత్ర 1991లో మొదలైంది. ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బన్నా అనే వ్యక్తిది ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్. ఇతను ఆ గ్రామానికి చెందిన ఓ లీడర్ కొడుకు.

యాక్సిడెంట్
ఈ బుల్లెట్ పై వెళ్తుండగా.. ఓం సింగ్ రాధోడ్ ( ఓం బన్నా ) యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఓ చెట్టుకి బైక్ ఢీకొనడంతో ఓం బన్నా చనిపోయాడు.

పోలీస్
పోలీసులు ఈ బైక్ ని సీజ్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే.. మరుసటి రోజు ఉదయానికి ఆ బైక్ మళ్లీ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉంది. ఎవరూ తీసుకురాకుండానే అది అక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీ.

చైన్లతో కట్టేశారు
పోలీసులు మళ్లీ మరుసటి రోజు బైక్ ని తీసుకెళ్లి పెద్ద పెద్ద చైన్లతో గట్టిగా బంధించారు. కానీ మళ్లీ మరుసటి రోజు ఉదయానికి షాక్. బైక్ పోలీస్ స్టేషన్ లో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ప్రత్యక్షమైంది.

బుల్లెట్ బాబా
అంతే ఇలా బైక్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికే వచ్చి చేరుతుండటంతో.. ఆ ప్రదేశం పుణ్యక్షేత్రంగా, ఆ బైక్ బుల్లెట్ బాబాగా మారిపోయింది. ఓం బన్నానే బుల్లెట్ బాబాగా ఆ గ్రామస్తులు పూజిస్తున్నారు.

బీర్
జోధ్ పూర్ హైవే దాటడానికి ముందు ప్రతి ఒక్కరూ.. ఈ పుణ్యక్షేత్రంలో బీర్ ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వచ్చింది. బైక్ ఢీకొన్న చెట్టే పుణ్యక్షేత్రంగా మారింది.

గాజులు, దారాలు
ఇక్కడ చూశారా ? ఇక్కడి ప్రజలకు ఎంత నమ్మకం లేకపోతే.. ఇలా.. బైక్ కి గ్యాప్ ఉన్న భాగాన్నంతా.. పవిత్రమైన దారాలు కట్టి కోరికలు అడుగుతున్నారు. అంతేకాదు.. చెట్టుకి గాజులు కడుతున్నారు.

పూజారి
అంతేకాదు.. ఈ పుణ్యక్షేత్రానికి రోజంతా పూజలు నిర్వహించడానికి ఓ పూజారి కూడా ఉన్నాడు. బైక్ ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పూజలు నిర్వహించడం ఈ పూజారి బాధ్యత. చాలా ఆశ్చర్యపరుస్తున్న ఈ బుల్లెట్ బాబా టెంపుల్ ని చూడాలని మీకు కూడా అనిపిస్తోందా.. ??



Click it and Unblock the Notifications
