వైబ్రేట్ బ్రాతో పాటు ఎన్నెన్నో వెరైటీలు: వీటిని చూస్తే మీరు సర్ ప్రైజ్ అవుతారు!

Posted By: Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

గతంలో కొందరు కొన్ని అదిరిపోయే ఆవిష్కరణలు చేశారు. అప్పట్లో ఉపయోగించే పరికరాలు కాస్త డిఫరెంట్ గా ఉండేవి. అవన్నీ కూడా కొంతకాలం వినియోగంలో ఉండేవి. రానురాను అవి అంతరించిపోయాయి. కానీ చరిత్రలో ఎప్పటికీ వాటికంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇవి ప్రస్తుతం అందుబాటులో లేకున్నా.. వాటి గురించి సమాచారం తెలుసుకోవడం వల్ల మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసినట్లు అవుతుంది.

మానవ సంబంధాల గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలు

అప్పటి విషయాలపైన నాలెడ్జ్ వస్తుంది. ఇక కొన్ని ఆవిష్కరణలకు సంబంధించిన పేటెంట్ రైట్స్ కోసం 2015 లో యూఎస్ లో అక్కడి ప్రభుత్వం 28,800 పేటెంట్ దరఖాస్తులు అందుకుంది. ఇలా ఎప్పటికప్పడు కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నా...పాత వాటికి కూడా కొన్ని ప్రత్యేకతలుంటాయి. మరి అప్పట్లో హల్ చల్ చేసిన కొన్నింటి గురించి మనం తెలుసుకుందామా..

డ్యాష్ బోర్డ్ పై కాఫీ మేకర్

డ్యాష్ బోర్డ్ పై కాఫీ మేకర్

ప్రస్తుతం ఏ కారులో కూడా డ్యాష్ బోర్డ్ పై కాఫీ మేకర్ ఉండదు. కానీ గతంలో ప్రతి కారులో కాఫీ మేకర్ ఉండేది. అప్పుడు డ్రైవర్ సీటు పక్కను ఉండే డ్యాష్ బోర్ట్ పై ఇది ఉండేది. చాలా కార్లకు షోరూం నుంచే ఈ పరికరం వచ్చేది. కానీ ఇప్పటి కార్లలో ఈ సదుపాయం ఉండదు. కారులో వెళ్తూ కాఫీ తాగాలనిపిస్తే ఎక్కడైన కేఫ్ దగ్గర ఆగాలి. అప్పట్లో ఉండే కార్లలో ఉండే కాఫీ మేకర్ సదుపాయం ప్రస్తుతం ఎందుకు కనుమరుగు అయ్యిందో అర్థం కానీ పరిస్థితి.

Image Credit

ఒకేసారి పది సిగరెట్స్ తాగేవాళ్లు

ఒకేసారి పది సిగరెట్స్ తాగేవాళ్లు

ధూమపానం వాస్తవంగా ఆరోగ్యానికి హానికరం. కానీ అప్పట్లో మాత్రం ఏకంగా ఒకేసారి పదికి పైగా సిగరెట్స్ తాగే సదుపాయం ఉండేది. ఇప్పటి పరిస్థితికి మాత్రం ఇది అస్సలు సూట్ కాదు కాబట్టే ఈ పద్ధతి 21 వ శతాబ్దానికి పాకలేదు.

Image Credit

బట్టతలను పాలిషింగ్ చేసే పరికరం

బట్టతలను పాలిషింగ్ చేసే పరికరం

బట్టతలను దువ్వుకోలేరు. కానీ దాన్ని మసాజ్ చేసినట్లు చేస్తే ఆ హాయే వేరు. అందుకే గతంలో ఇందుకోసం కూడా ఒక మిషన్ ఉండేది.

లాస్ ఏంజిల్స్ బ్రష్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్ వారు తయారు చేసిన 'హెయిర్లైన్ బ్రష్' అనేది అప్పట్లో చాలా ఫేమస్. దీన్ని 1950 ప్రాంతంలో బట్టతలను పాలిషింగ్ చేసుకునేందుకు ఉపయోగించేవారు.

Image Credit

ఫోన్ ఆన్సరింగ్ రోబోట్

ఫోన్ ఆన్సరింగ్ రోబోట్

ఫోన్ ఆన్సరింగ్ రోబో అంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే రోబో కాదు. ఇది అప్పట్లో ఫోన్ రింగ్ కాగానే ఫోన్ లిఫ్ట్ చేసేది. ఆ తర్వాత ఫోన్ పెట్టేసేది. బహుశా ఫోన్ మాట్లాడే వ్యక్తి వచ్చేలోపు ఫోన్ తీసి రెడీగా పెట్టేదేమో. ఎవరికీ తెలుసు అప్పుట్లో టెక్నాలజీని ఈ విధంగా కూడా ఉపయోగించారు మరీ.

Image Credit

సూప్ కూలింగ్ ఫ్యాన్

సూప్ కూలింగ్ ఫ్యాన్

మీలో చాలామందికి ఇది చాలా స్టుపిడ్ విషయం కావొచ్చు. అది ఏమిటి.. సూప్ ను చల్లబరచడానికి స్పెషల్ గా ఫ్యాన్ ఉంటుందా అని డౌట్ పడొచ్చు. కానీ అప్పట్లో ఉండేదంట మరి. ఇప్పుడు మాత్రం ప్రపంచంలో సూప్ ను చల్లబరచడానికి ప్రత్యేకంగా ఎలాంటి సదుపాయం లేదు.

Image Credit

ఆటోమేటిక్ టిప్ రిక్వెస్టర్

ఆటోమేటిక్ టిప్ రిక్వెస్టర్

దీన్ని 1955 లో రసెల్ ఇ. ఓకేస్ అనే ఒకతను కనుగొన్నారు. అప్పట్లో ఈ మిషన్ ఒక రేంజ్ లో అమ్ముడుపోయింటుంది. ఇక దీన్ని తయారు చేసిన వ్యక్తికి ఒక రేంజ్ లో డబ్బు వచ్చి ఉండొచ్చు.

Image Credit

బేబీ విండో బాస్కెట్

బేబీ విండో బాస్కెట్

ఒక చిన్న అపార్టుమెంట్ లో నివసించేవారు కోరుకునేది కాస్త స్థలం. అందుకే వారి గదిలో ఒక్క ఇంచు ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తపడతారు. అలాంటి వారి కోసం అప్పట్లో బేబీ విండో బాస్కెట్స్ కనుగొన్నారు. కిటకీ దగ్గర ఉండే స్పేస్ లో ఒక బాక్స్ ను ఏర్పాటు చేసుకునేవారు. అందులో పిల్లలను నిద్రపుచ్చువారు.

Image Credit

బియో కుర్చీ

బియో కుర్చీ

ఒక సూపర్ హిట్ ఫిల్మ్ చూడడానికి మీరు వెళ్లారనుకో.. అక్కడ టిక్కెట్ల కోసం జనాలంతా బారులుదీరి ఉంటారు.

అలాగే ఏదైనా క్రికెట్ మ్యాచ్ లేదా, బేస్ బాల్ మ్యాచ్ లాంటి టిక్కెట్ల వరుసులో కూడా క్యూ బాగా కిక్కిరిసిపోయి ఉంటుంది. అక్కడ నిల్చోలేక ఇబ్బందులుపడాల్సి వస్తోంది. విసుగొస్తుంది. మరి అలాంటి సమయంలో మీ దగ్గర బియో కుర్చీ ఉందనుకోండి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వెంటనే అక్కడ ఆ చిన్నపాటి చైర్ ను వేసుకుని కూర్చొంటారు. ఇక పక్కనున్న వారిని మిమ్మల్ని చూసి కాస్త అసూయపడుతారు.

Image Credit

వైబ్రేటింగ్ బ్రా

వైబ్రేటింగ్ బ్రా

దీన్ని మొదటిసారిగా 1971 లో బ్రస్సెల్స్ లో అంతర్జాతీయ ప్రదర్శన ఆవిష్కరణలో ప్రవేశపెట్టారు. ఇది ఒక సెక్స్ బొమ్మలాగా ఉండేది. అయితే ఆడవారి రొమ్ముభాగం సరైన ఆకారంలోకి రావడానికి ఇది సహాయపడేది.

Image Credit

ఇద్దరూ ఒకేసారి దమ్ము తాగొచ్చు

ఇద్దరూ ఒకేసారి దమ్ము తాగొచ్చు

దీన్ని ది డబుల్ ఎండార్స్ అని పిలిచేవారు. ఇద్దరు వ్యక్తులు ఒకే టొబాకో పైప్ ద్వారా పొగ పీల్చేవారు. ఇది చూసేవారికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించేది కానీ దాన్ని తాగే వారు మాత్రం మస్తు మజా పొందేవారు.

Image Credit

పవర్ మోటార్

పవర్ మోటార్

1957 లో ఇటాంటి మిషన్లు ఉండేవి. వీటికి ప్లాస్టిక్ తో తయారు చేసిన టాప్ దీనికి అమర్చబడి ఉండేది. వీటి ద్వారా వర్షంలో కూడా ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉండేది.

Image Credit

రిచ్టర్ రాకెట్ సైకిల్

రిచ్టర్ రాకెట్ సైకిల్

దీనిని 1931 లో జర్మన్ ఇంజనీర్ రిచ్టర్ కనుగొన్నారు. అప్పట్లో ఇది హల్ చల్ చేసింది. మరి 21 వ శతాబ్దంలో ఇలాంటి పరికరం ఎందుకు తయారుకాలేదు అనడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే ఇది మంచి పరికరమే కానీ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందువల్లే ప్రస్తుతం ఇలాంటివి వాడుకలో లేవు.

Image Credit

గ్లామర్ బోనెట్

గ్లామర్ బోనెట్

అందంగా కనిపించడం కోసం ఇప్పుడే కాదు. గతంలో కూడా మహిళలు నానా తంటాలుపడేవారు. అందుకోసం మార్కెట్లోకి వచ్చే ప్రతిదీ వినియోగించేవారు. అప్పట్లో గ్లామర్ బోనెట్ అనే పరికరం ఉండేది. దీనిద్వారా మహిళలు తమ సౌందర్యాన్ని పరిరక్షించుకునేవారు.

Image Credit

కుటుంబమంతా పయణించేందుకు వైరైటీ సైకిల్

కుటుంబమంతా పయణించేందుకు వైరైటీ సైకిల్

సైకిల్ పై సాధారణంగా ఇద్దరు ప్రయాణించొచ్చు. కానీ అప్పట్లో ఉండే సైకిల్ పై మాత్రం ఏకంగా ఒక కుటుంబం పయణించడానికి వీలుండేది. దానిపై కూర్చొన్న వారంతా దాన్ని తొక్కే సౌకర్యంతో దీన్ని రూపొందించారు. అంతేకాదండోయ్.. ఇక ఈ సైకిల్ పై పయణిస్తూనే ఎంచక్కా దుస్తులు కూడా కుట్టే సౌకర్యం ఉండేది. గమ్యానికి చేరేలోపు మహిళలు ఒక జాకెట్ కుట్టేవారు. అదే ఆ సైకిల్ ప్రత్యేకత. దీంతో ఇంధనం కూడా ఆదా అయ్యేది.

Image Credit

జెట్ ప్యాక్

జెట్ ప్యాక్

అలా గాలిలో తేలిపోతున్నట్లు చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాబర్ట్ కోర్సర్. ఈయన జూన్, 1969 లో జెక్ ప్యాక్ ప్రయోగం వర్జీనియాలో చేశారు. అప్పట్లో ఇది హల్ చల్ చేసింది.

Image Credit

English summary

15 Infamous Ancient Inventions That Are Work Of Pure Genius

15 Useless Inventions That Are Work Of 'Pure' Genius!. Know more read on..