Latest Updates
-
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!
ఈ 6 రేఖలు మీ నుదిటిపై ఉంటే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది..!!
హస్తశాస్త్రం చూసి వ్యక్తి భవిషత్ ను ఎలా అంచాన వేస్తారో అదే విధంగా సాముద్రిక శాస్త్రంను బట్టి భవిష్యత్ ను తెలుకోవచ్చని సాముద్రిక శాస్త్ర నిపులు అంటున్నారు. సాముద్రిక శాస్త్రంలో నుదుటిపై ఉన్న రేఖల ద్వార
హస్తశాస్త్రం చూసి వ్యక్తి భవిషత్ ను ఎలా అంచాన వేస్తారో అదే విధంగా సాముద్రిక శాస్త్రంను బట్టి భవిష్యత్ ను తెలుకోవచ్చని సాముద్రిక శాస్త్ర నిపులు అంటున్నారు. సాముద్రిక శాస్త్రంలో నుదుటిపై ఉన్న రేఖల ద్వారా మీరు భవిష్యత్తుల్లో ఎలా ఉంటారో తెలుసుకోవచ్చట. నుదుటిపై గీతలకు కొన్ని గ్రహాలకు సంబంధం ఉంటుందని సాముద్రిక శాస్త్ర నిపుణులు అంటున్నారు.
నుదిటి రేఖల ఆధారంగా వ్యక్తిగత భవిష్యత్తును హస్తసాముద్రిక వేత్తలు అంచనా వేస్తుంటారు. నుదుటిపై ఉండే టెంపుల్ లైన్‌ను గుర్తించడానికి ఆ వ్యక్తి తల, దాని ఆకారం, పరిమాణం, విశాలమైన నుదురు, నుదురు షేడ్స్, బ్రో స్మూత్ నెస్ ను మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ టైంపుల్ లైన్ వ్యక్తిగత జీవితంపై ఏమాత్రం ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు. మరి అదెలాగో వెంటనే తెలుసుకుందాం...

మెర్క్యురి లైన్ :
కనుబొమ్మల మీదుగా ఉండే పొడవైన రేఖను మెర్క్యూరీ లైన్ (బుధుడు రేఖ) అంటారు. ఇది కొందర్లో చెవుల అంచుల వరకూ ఉంటుంది. చెవుల అంచుల వరకు ఈ రేఖ ఉంటే ఙ్ఞాపక శక్తి అపారంగా ఉంటుంది. వీరు కళాత్మక రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే అత్యున్న మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతే కాకుండా ఆర్థికపరమైన లావాదేవీల్లో వ్యూహాత్మకంగా ఉంటూ ఒక్క పైసా కూడా నష్టపోరు.

వీనస్ లైన్ :
బుధుడి రేఖకు కింద కుడివైపుగా నుదురు మధ్యలో ఉండే రేఖను వీనస్ లైన్ అంటారు. ఈ రేఖలు నుదుటిపై స్పష్టంగా కనబడే వ్యక్తులకు ప్రయాణాంటే ఇష్టం. అలాగే అదృష్టం వీరి వెన్నంటి ఉంటుంది. వృత్తిపరంగా సహాయం చేసే వ్యక్తిత్వం వీరి సొంతం.

వీనస్ లైన్ :
వీనస్ రేఖ మందంగా, లోతుగా ఉండేవాళ్లు అత్యవసర సమయాల్లో ఆదుకునే స్వభావం ఉంటుంది, అంతే కాకుండా ఇంద్రియాలపై నిగ్రహం, ఖచ్చితత్వంతో ఉంటారు. అయితే వీరు శృంగార ప్రియులు కూడా...

మార్స్ లైన్ :
బృహస్పతి రేఖ కింద ఉండే మార్స్ లైన్ నుదురు మధ్యలో ఉంటుంది. మార్స్ లైన్ కనిపించే వ్యక్తులకు అడ్మినిస్ట్రేటివ్, జాతీయ భద్రత, రక్షణ విభాగాల్లో అపారమైన అవకాశాలు ఉంటాయి. వీరికి గర్వం, ధైర్యంతో పాటు అద్బుత నిర్మాణాత్మక సామర్థ్యం ఉంటాయి.

మార్స్ లైన్ :
వ్యక్తిగతంగా జన్యూన్ గా కనిపించే స్వచ్చమైన వ్యక్తిత్వం ఉండే వీళ్లే కొన్ని సందర్బాల్లో సహనాన్ని కోల్పోతారు. వీరు సమస్యలకు ఏమాత్రం సహించుకోలేరు ఎప్పుడెప్పుడు సమస్యల నుండి బయటపడదామా అన్న విధంగా ఉంటారు.

సాటర్న్ లైన్ (శని రేఖ) :
నుదురు పైభాగంలో తలను తాకుతూ ఉండే రేఖను శని రేఖ అంటారు. ఈ రేఖ స్పష్టంగానూ, బలంగానూ ఉంటే సంపాదన అంతా మంచులా కరిగి పోతుంది. దీనికి అడ్డుకట్టవేయడం కష్టం. కానీ కోరుకున్నవి మాత్రం సాధిస్తారు. అయితే ఈ రేఖ అతి కొద్ది మందికి మాత్రమే స్పష్టంగా కనపడుతుంది.

సాటర్న్ లైన్ (శని రేఖ) :
ఒకవేళ శని రేఖ స్వల్పంగా తల వరకు పెరిగితే అదృష్టం అయస్కాంతంలా అట్టిపెట్టుకుని ఉంటుంది. వీరు చాలా సాహసోపేతంగా, వినయవిధేయతలు కలిగి ఉంటారు.

జూపిటర్ లైన్ దీన్నే గురు లైన్ అనికూడా పిలుస్తారు:
కనుబొమపై శని రేఖకు కింద ఉండే రేఖ బృహస్పతి. ఆర్డర్ గా చూస్తే ఇది శని రేఖ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ రేఖ నుదుటిపై కనిపించే వ్యక్తులకు ఆధ్యాత్మిక భావాలు, ధ్యానం, అకడమిక్ విషయాలలో నమ్మకం కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు విద్యా వంతులు. ఇలాంటి వారికి సంపాదన గురించి అంత ఇబ్బంది ఉండదు.

జూపిటర్ లైన్ దీన్నే గురు లైన్ అనికూడా పిలుస్తారు:
అయితే వీరి మొండి వైఖరి, వీరు అనుసరించే పద్దతులు, నియమాల కారణంగా ఒక్కోసారి ప్రమాదం బారిన పడతారు.

మూన్ లైన్ :
ఈ మూన్ లైన్ చాలా లైట్ గా కనబడుతుంది. ఎడమ కనుబొమపై సన్నగా ఉండే గీతే మూన్ లైన్. ఈ రేఖ ఉండే వ్యక్తులు అత్యంత ధనవంతులుగా చలామణి అవుతారు. ఈ సంపాదన అంతా కళల అంటే పెయింటింగ్ (చిత్రలేఖనం), సింగింగ్ (పాడటం), యాక్టింగ్ (నటన) లాంటి వాటి ద్వారా చేకూరుతుంది.

సన్ లైన్ :
మూన్ లైన్‌కు ఎదురుగా అంటే కుడి కనుబొమపై ఉండేదే సన్ లైన్. ఈ రేఖ వ్యక్తుల సామర్థ్యం, సృజనాత్మకత, లక్ష్యాలు చేరుకోవడం, ప్రశంసలకు సూచిక. వీరి వెనుక అదృష్ట దేవత ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే వీళ్లు గొప్ప శక్తివంతులుగానూ, రాజకీయాలతో సంబంధాలను కలిగి ఉంటారు.



Click it and Unblock the Notifications
