మిస్సైన మనిషి... పైతాన్(కొండ చిలువ)పొట్టలో శవమైన వీడియో..

Posted By:
Subscribe to Boldsky

ఈ మద్యన సోషియల్ మీడియాలో బాగా పాపులరై..వైరల్ గా మారిన వీడియో ఒకటి, ఒళ్లు గొగుర్పొచేలా చేస్తుంది. పామును చూస్తేనే ఆమడం దూరం పరిగెత్తే ఈ రోజుల్లో, ఒక పైతాన్ ఏకంగా మనిషిని మింగేసింది. మరి ఈ షాకింగ్ సంఘటన ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..

ఇండోనేషియాలోని సుల్వేసి ద్వీపంలో..

ఇండోనేషియాలోని సుల్వేసి ద్వీపంలో..

తోటలో పని చెయ్యడానికి వెళ్లిన రైతును 26 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ (పైతాన్) మింగేసి పొట్టనపెట్టుకున్న సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలోని సుల్వేసి ద్వీపంలో అక్బర్ సలుర్బీ (25) అనే యువకుడు కొండచిలువకు బలి అయ్యాడు.

చాలా అరుదుగా మాత్రమే ఇలా పైతాన్ మనుషులను అటాక్ చేస్తుంది:

చాలా అరుదుగా మాత్రమే ఇలా పైతాన్ మనుషులను అటాక్ చేస్తుంది:

ఇండోనేసియా, ఫిలిప్ఫైన్స్‌ దేశాల్లో 20 అడుగులకు పైగా పొడవైన కొండచిలువలు మనుగడ సాగిస్తున్నాయి. అవి సాధారణంగా చిన్న చిన్న జంతువులపై దాడి చేసి తింటుంటాయి. కానీ మనుషులను తినడం అనేది అరుదుగా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆ వ్యక్తి పేరు అక్బర్ సాలిబిరో

ఆ వ్యక్తి పేరు అక్బర్ సాలిబిరో

సెల్వేసి ద్వీపంలోని పండ్ల తోటలో అక్బర్ పని చెయ్యడానికి వెళ్లి మాయం అయ్యాడు. అక్బర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బందువులు పండ్ల తోటలోకి వెళ్లి పరిశీలించారు. తోటలో కడుపు ఉబ్బిపోయి కదలలేని స్థితిలో కొడచిలువ దర్శనం ఇచ్చింది.

కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు..

కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు..

ఆదివారం అక్బర్‌ (25) అనే వ్యక్తి పామాయిల్‌ తోట నుంచి తిరిగి వస్తుండగా అదృశ్యమయ్యాడు. ఎంత సేపటికి ఇంటికి చేరుకోకపోవడంతో , కుటుంబ సభ్యులు, అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతన్ని వెతికే క్రమంలో

అతన్ని వెతికే క్రమంలో

తోటలోకి వెళ్లిన అక్బర్ ను వెతికే క్రమంలో కొండచిలువ ఎమైనా మింగేసిందా అనే అనుమానం అతని కుటుంబ సభ్యులకు వచ్చింది. అంతే స్థానికులు పెద్ద కత్తి తీసుకుని కొండచిలువను నిలువునా చీల్చుకుంటూ వెళ్లారు. చివరికి కొండ చిలువ కడుపులో అక్బర్ శవమై కనిపించాడు.

పైతాన్ పొట్ట చేల్చి అతని శవాన్ని బయటకు తీశారు

పైతాన్ పొట్ట చేల్చి అతని శవాన్ని బయటకు తీశారు

కొండచిలువ శరీరంలోని నుంచి అక్బర్ మృతదేహాన్నిబయటకు తీశారు. అక్బర్ శరీరంలోని ఎముకలు నలిగిపోయాయని అతని కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు చెప్పారు. కొండచిలువ శరీరంలో నుంచి అక్బర్ మృతదేహాన్ని బయటకు తీసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

ఒళ్లు గొగుర్లుపొడిచే ఈ వైరల్ వీడియోను

ఒళ్లు గొగుర్లుపొడిచే ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూడాలనుకుంటే వెంటేనే చూసేయండి...

English summary

A Missing Man Was Found In A Python!

This is one of the most bizarre incidents you would have read where a man who was missing was found in the stomach of a python!! Check out more on the gruesome details.
Story first published: Wednesday, April 12, 2017, 16:38 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter