For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఇంటర్నెట్ లో ఈ పనులు చేయడం చట్టవిరుద్ధమని మీకు తెలుసా?

By Lekhaka
|

ప్రపంచంలొ అన్నిటికీ చట్టాలున్నాయి, అలాగే మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదోక విధంగా వాడే ఇంటర్నెట్ కి కూడా చట్టాలున్నాయని మీకు తెలుసా? చట్టాలు చాలా గందరగోళంగా ఉండడమే కాకుండా, ప్రతి రోజు మారిపోతూ ఉంటాయి.

మ్యూజిక్ ఆల్బం పైరసీ నుండి, టొరెంట్ల నుండి మూవీస్ డౌన్ లొడ్ చేయడం దాకా మనం ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాము. ఇది చట్ట వ్యతిరేకమని తెలిసినా మనం చేసే ఉంటాము.

చట్ట వ్యతిరేకమైనప్పటికి మనం రోజు ఇంటర్నెట్ లొ ఉన్నప్పుడు చేసే అలాంటి పనులు కొన్ని ఈరోజు చదివి తెలుసుకోండి. వీటిలొ కొన్ని మనకి తెలిసినప్పటికి, చట్ట వ్యతిరేకమని తెలియనివి కూడా చాలా ఉన్నాయి.

కొన్ని చట్ట వ్యతిరేక పనులనుండి వెంటనే అలవాటు వదిలించుకోలేము కాని వాటినుండి ఎంతవరకు వీలైతె అంతవరకు దూరంగా ఉండడం మనకే మంచిది. ఇంక ఎక్కువ సేపు వేయిట్ చేయకుండా అవేంటొ తెలుసుకుందామా???

Did You Know That Doing These Things Online Is Illegal

మూవీస్ మరియు టీ వీ షో లు చట్ట వ్యతిరేకంగా డౌన్ లోడ్ చేయడం
"టొరెంట్" వెబ్ సైట్లను చాలా దేశాలలో నిషేధించినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది చట్ట వ్యతిరేకంగా మూవీస్ మరియు టీ వీ షో లు డౌన్ లోడ్ చెస్తూనే ఉన్నారు. దీనిని మనం ఎట్టి పరిస్థితులలోనూ ప్రొత్సహించకూడదు అలాగె చేయకూడదు కూడా.

Did You Know That Doing These Things Online Is Illegal

డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం
డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం మంచిది కాదని మనందరికి తెలిసిన విషయమే. కాని డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం చట్ట వ్యతిరేకమని మనలొ ఎంతమందికి తెలుసు? ఎన్నొ భయానక ఏక్సిడెంట్లకి డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం కారణమైంది, అయినప్పటికీ మనలొ చాలా మంది ఆన్ లైన్ కు సంబంధించిన ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాము.

Did You Know That Doing These Things Online Is Illegal

యాడ్ బ్లాకర్స్
ఇంటర్నెట్ లొ ఉన్న చాలా వెబ్ సైట్ లు యాడ్స్ లేదా ప్రకటనల ద్వారా సులభంగా ఆదాయం పొందుతుంటాయి. కాబట్టి మీరు యాడ్ బ్లాకర్స్ వాడితే అది చట్ట వ్యతిరేకం.

Did You Know That Doing These Things Online Is Illegal

ఆదాయం చెప్పకుండా ఈబే లేక వేరే యే వెబ్ సైట్ లో అయిన వస్తువులను విక్రయించడం:
ఏదైన వస్తువుని ఆన్ లైన్ లో అమ్మేడప్పుడు అస్సలు ఆలోచనకు రాని విషయం ఇది. ఈబే లేకా వేరే యే వెబ్ సైట్ లో అయిన అమ్మె ముందు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి రూలు ఏంటంటే , మీ ఆదాయాన్ని ప్రకటించడం.

Did You Know That Doing These Things Online Is Illegal

నకిలీ ఐ పి అడ్రస్ వాడడం
ఇది చాలా వరకు నకిలీ గుర్తింపు కోసం చేస్తుంటారు. ఏదైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసేప్పుడు ఈ విధంగా నకిలి ఐ పి అడ్రస్ వాడుతుంటారు. అది మూవీస్ డౌన్ లోడ్ చేయడం కావచ్చు , పోర్న్ చూడడానికి కావచ్చు లెక మరేదైనా కావచ్చు , నకిలీ ఐ పి అడ్రస్ వాడడం ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదు.

English summary

Did You Know That Doing These Things Online Is Illegal?

Internet laws are always quite confusing, since the laws keep constantly changing and we are not lawyers to know each of them.From pirating music albums, to streaming movies from Torrent or a sketchy site, we all have done all of this! Of course, we know all these things are illegal; however, we'd still do it.
Desktop Bottom Promotion