అతి భయంకరమైన దెయ్యాల దిబ్బ: ఫుకుషిమా..!!

Posted By: Staff
Subscribe to Boldsky

మార్చ్ 11, 2011 న జపాన్ లో భూకంపం, సునామీ ఒకేసారి వచ్చాయి. చాలా వినాశనం జరిగింది - దాంట్లో కొంత అయితే మరమ్మతులకు కూడా వీలు కాలేదు. మానవ ప్రాణాలకు, ఆస్తులకు నమ్మశక్యం కానంత నష్టం వాటిల్లింది.

కేవలం భూకంపమూ, సునామీ నే కాక అణు ప్రమాదాలు కూడా జీవితాన్ని దుర్భరంగా మార్చిన ఫుకుషిమా నగరానికి చెందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం.

మనిషి మనుగడకు అలవి కాని పరిస్థితుల్లో ప్రజలు ఆ ప్రదేశాన్ని వదిలి పెట్టి ఎలా వెళ్లి పోవాల్సి వచ్చిందో వీటిలో చూడండి.

జీవితం క్షణ భంగురం అనీ, క్షణాల్లో జీవితం మారిపోతుందనీ గుర్తు చేసే ఈ భయంకరమైన చిత్రాలు పరికించండి.

న్యూక్లియర్ రేడియేషన్ జీవితాన్ని దుర్భరం చేసింది.

న్యూక్లియర్ రేడియేషన్ జీవితాన్ని దుర్భరం చేసింది.

అణు ప్రమాదాల వల్ల ఉత్పన్నమైన రేడియేషన్ స్థాయిల గురించి ఇక్కడ రికార్డులు నమోదు అయ్యాయి. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోవడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది.

వాహనాలు ఇలా వదిలివేయబడ్డాయి.

వాహనాలు ఇలా వదిలివేయబడ్డాయి.

ప్రజలు తమ విలువైన వస్తువులను కూడా వదిలేయాల్సి వచ్చింది - ఆ మోటార్ సైక్లిస్ట్ తన వాహనాన్ని ఎలా వదిలేసాడో చూడండి.

ఖాళీ చేసిన సరుకుల కొట్టు.

ఖాళీ చేసిన సరుకుల కొట్టు.

సాధారణంగా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, దుకాణాలు, షో రూంలు దోచుకోవడానికి ప్రజలకు అవకాశం వుంటుంది, కానీ ఇక్కడ ప్రజలు ప్రాణాలకోసం పరిగెత్తడంతో అలా జరగలేదు.

సైకిళ్ళు దేనికీ పనికి రాలేదు.

సైకిళ్ళు దేనికీ పనికి రాలేదు.

అప్పుడెప్పుడో వదిలేసిన సైకిళ్ళు కూడా అదే స్థానంలో అలాగే ఉండిపోయాయి.

డైనింగ్ టేబుళ్లు

డైనింగ్ టేబుళ్లు

డైనింగ్ టేబుల్ మీద వున్న గిన్నెల పరిస్థితి చూస్తె ప్రజలు తమ ప్రాణాల కోసం ఎలా పరిగెత్తాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

ఎప్పటికీ జరగని గొ కార్తింగ్ రేస్.

ఎప్పటికీ జరగని గొ కార్తింగ్ రేస్.

ఫుకుషిమా నగరాన్ని సునామీ తాకినప్పుడు ప్రజలంతా రేస్ కోసం సిద్ధం అయినట్లు ఈ చిత్రం చూస్తె తెలుస్తుంది.

కార్లు అలా వదిలేశారు...

కార్లు అలా వదిలేశారు...

ఈ నగరాన్ని సునామీ తాకినప్పుడు ప్రజలకు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమె మిగిలి వుంది. అందువల్ల అప్పటికి కార్లు ఎలా వదిలేసి పరిగెత్తారో తెలుస్తుంది.

ఈ నగరాన్ని ఆ బాధాకరమైన ఘటనలు కుదిపేసినప్పటి నుంచి ఇక్కడ జీవితం ఎలా స్థాణువులా నిలిచిపోయిందో ఈ చిత్రాలు మనకి తెలియచేస్తాయి. మీ భావాలు ఈ క్రింది కామెంట్స్ సెక్షన్ లో తెలియచేయండి.

English summary

Haunting Images Of The Ghost Town Of Fukushima

Images are said to be powerful, as they capture the moment and save it for later. These are some of the most haunting images of a ghost town in Fukushima that has been abandoned for years now.
Subscribe Newsletter