For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాయిలెట్స్ కంటే ఇవే ప్రమాదకరం

By Y. Bharat Kumar Reddy
|

ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఎన్నిసార్లు శుభ్రం చేసినా.. కాస్త అపరిశుభ్రంగా అనిపించే ప్రాంతం టాయిలెట్ అని అనుకుంటారు. దాదాపు 80 శాతం మంది ప్రజలు ఇలాగే భావిస్తారు. కానీ అంతకంటే ఇంకా ఎక్కువగా అపరిశుభ్రంగా ఉండేవి కూడా మన ఇంట్లో ఉంటాయి. టాయిలెట్ కంటే అక్కడే ఎక్కువ క్రిములుంటాయి.

మీ వంటగది లేదా కార్పెట్వ వంటివి కూడా క్రిములకు నిలయాలుగా ఉంటాయి. మీరు నిత్యం ఉపయోగించే సెల్ ఫోన్, పర్సుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అలాగే టీవీ రిమోట్ తదితర పరికరాలపై కూడా క్రిములు సంచరిస్తూనే ఉంటాయి. ఇంతకు అలాంటి పరికరాలు, ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందామా.

సెల్ ఫోన్స్

సెల్ ఫోన్స్

మొబైల్ ఒక్క క్షణం చేతిలో లేకుంటే చాలా ఇబ్బందిపడిపోతాం. కానీ ఇది క్రిములకు నిలయం. మనం ఉపయోగించే టాయిలెట్ కంటే 500 రెట్లు ఎక్కువ హానికరమైన క్రిములు మొబైల్ ఫోన్ పై ఉంటాయి. ఇక మీరు మీ లవర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఆమెకు ఫోన్ లోనే ముద్దులుపెడుతున్నట్లయితే కాస్త జాగ్రత్త. దీని ద్వారా ఫోన్ పై ఉండే క్రిములన్నీ కూడా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల వీలైనంత వరకు సెల్ ఫోన్స్ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

<strong>అలర్ట్: రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ టాయిలెంట్ కు వెలితే..స్టొమక్ అల్సర్?</strong>అలర్ట్: రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ టాయిలెంట్ కు వెలితే..స్టొమక్ అల్సర్?

కంప్యూటర్ / ల్యాప్ టాప్ కీబోర్డు

కంప్యూటర్ / ల్యాప్ టాప్ కీబోర్డు

తినే సమయంలో కూడా మీరు ల్యాప్ టాప్ పై పని చేస్తూ ఉంటారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి కాస్త ప్రమాదకరం. ఒక టాయిలెట్ సీట్ మీద ఉండేటటువంటి క్రిముల కంటే 200 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా కీ బోర్ట్ పై ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు ఉపయోగించే కీబోర్డ్ ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

కూరగాయాలను కట్ చేసుకునేందుకు ఉపయోగించే చెక్క

కూరగాయాలను కట్ చేసుకునేందుకు ఉపయోగించే చెక్క

మన వంటగది చాలా రకాల బ్యాక్టీరియాలకు నిలయం. మీరు రోజూ కిచెన్ లో వినియోగించే కట్టింగ్ బోర్డ్ చాలా ప్రమాదకరం. దీనిపై టాయిలెట్ సీట్ కంటే చాలా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఆ చెక్కను శుభ్రం చేసుకుంటూ ఉండండి.

కార్పెట్స్

కార్పెట్స్

మీ ఇంట్లో ఉండే కార్పెట్స్ కూడా క్రిములకు నిలయాలుగా ఉంటాయి. టాయిలెట్స్ కంటే ఇవి చాలా మురికిగా ఉంటాయి. టాయిలెట్ తో పోల్చుకుంటే దాదాపు 4000 రెట్ల ఎక్కువ క్రిములు కార్పెట్స్ లో ఉంటాయి. కార్పెట్స్ లో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కార్పెట్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండండి.

కిచెన్ సింక్

కిచెన్ సింక్

భోజనం అయిపోయాక మన వంట సామగ్రి, మనం తిన్న ప్లేట్లను ఉంచేది కిచెన్ సింక్ లోనే. దీనిలో కూడా క్రిములు ఎక్కువగా ఉంటాయి. టాయిలెట్ తో పోల్చుకుంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఒక చదరపు అంగుళంలో 5,00,000 బ్యాక్టీరియా ఉంటుంది. కిచెన్ సింక్ ను మీరు ఎప్పటికప్పడు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఇలాంటి బ్యాక్టీరియా నుంచి బయటపడగలుగుతారు.

టీవీ రిమోట్

టీవీ రిమోట్

మనం భోజనం చేసే సమయంలో కూడా మన చేతిలో ఉండేది టీవీ రిమోట్. ఒకవైపు తింటూనే మరోవైపు ఛానల్స్ మారుస్తూ ఉంటాం. దీనిపై కూడా లెక్కలేనన్నీ క్రిములుంటాయి. మీ ఇంట్లో ఉన్నవాళ్లంతా దాన్ని నొక్కుతూనే ఉంటారు. ఇలా చేతులు మారడం, ఫుడ్, చెమట వంటి వాటి ద్వారా టీవీ రిమోట్లు అపరిశుభ్రంగా మారిపోతాయి. అందువల్ల వీలైనంత వరకు టీవీ రిమోట్ ను పరిశుభ్రంగా ఉంచుకోండి.

<strong>చిత్ర విచిత్రమైన టాయిలెట్స్..! వీటి గురించి తెలుసుకుంటే తలతిరుగుడు గ్యారెంటీ..!</strong>చిత్ర విచిత్రమైన టాయిలెట్స్..! వీటి గురించి తెలుసుకుంటే తలతిరుగుడు గ్యారెంటీ..!

ఆఫీసులో మహిళల డెస్కులు

ఆఫీసులో మహిళల డెస్కులు

ఆఫీసుల్లో పురుషులు పని చేసే ప్రాంతంలో ఉండే డెస్క్ ల కంటే మహిళలు పని చేసే డెస్క్ లు చాలా అపరిశుభ్రంగా ఉంటాయి. మగవారి డెస్క్ లతో పోల్చుకుంటే ఇవి మూడు నుంచి నాలుగు రెట్లు అపరిశుభ్రంగా ఉంటాయి. సాధారణంగా పురుషుల డెస్క్ లు టాయిలెట్ సీటు కంటే 100 రెట్లు ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటాయి.

ఇక మహిళల డెస్క్ లు మగవారి డెస్క్ ల కంటే 300 నుంచి 400 రెట్లు అపరిశుభ్రంగా ఉంటాయి. మహిళలు వారు పని చేసే ప్రాంతంలోని డెస్క్ లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది.

పురుషుల పర్సులు

పురుషుల పర్సులు

పురుషుల పర్సులు కూడా చాలా మలినంగా ఉంటాయి. అందువల్ల వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. దీంతో వీటిలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల పర్సులను ఉపయోగించే వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి.

టూత్ బ్రష్స్

టూత్ బ్రష్స్

టూత్ బ్రష్స్ లోనూ క్రిములు ఎక్కువగా ఉంటాయి. మీరు పళ్లు తోముకున్న త్వరాత మీ బ్రష్ లను మీ బాత్ రూంలో ఉంచడం మంచి పద్ధతి కాదు. టాయ్ లెట్ ఫ్లష్ ఉండేచోట మీరు బ్రష్స్ పెట్టకుండా ఉండడం మంచిది. మీరు పళ్లు తోముకునే ముందు మీ బ్రష్స్ ను బాగా కడుక్కోవ్వడం చాలా మంచిది.

డోర్ నాబ్

డోర్ నాబ్

తలుపును మూయాలన్నా, తెరవాలన్నా, లాక్ వేయాలన్నా మనం కచ్చితంగా డోర్ నాబ్ తిప్పాల్సిందే. ఇలా మనం ప్రతి రోజూ చేస్తూనే ఉంటాం. అయితే అది అనేక సూక్ష్మజీవులకు నిలయంగా ఉంటుంది. చాలా ఎక్కువ క్రిములు ఉంటాయి. అందువల్ల రోజూ దాన్ని శుభ్రం చేయడం చాలా మంచిది.

English summary

10 Shocking Things At Home That Are Dirtier Than Your Toilet | Toilets | Bathroom | Kitchen

Most of us assume that a toilet is the most dirtiest place in our houses. But that's far from truth. Read on to find out the shocking details.
Story first published:Tuesday, November 7, 2017, 13:13 [IST]
Desktop Bottom Promotion